జయలలిత జయరాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జె. జయలలిత
J Jayalalitha
ஜெ. ஜெயலலிதா
J. Jayalalithaa.jpg
16th తమిళనాడు ముఖ్యమంత్రి
Incumbent
Assumed office
16 మే 2011
Preceded by ఎమ్.కరుణానిధి
నియోజకవర్గం శ్రీరంగం
14th తమిళనాడు ముఖ్యమంత్రి
In office
2 మార్చి 2002 – 12 మే 2006
Preceded by ఓ. పన్నీర్‌సెల్వం
Succeeded by ఎమ్. కరుణానిధి
నియోజకవర్గం ఆండిపట్టి
తమిళనాడు ముఖ్యమంత్రి (క్వాషెద్)
In office
14 మే 2001 – 21 సెప్టెంబర్ 2001
Preceded by ఎమ్. కరుణానిధి
Succeeded by ఓ. పన్నీర్‌సెల్వం
నియోజకవర్గం పోటీ చేయలేదు
11th తమిళనాడు ముఖ్యమంత్రి
In office
24 జూన్ 1991 – 12 మే 1996
Preceded by రాష్టపతి పరిపాలన
Succeeded by ఎమ్. కరుణానిధి
నియోజకవర్గం బర్గూర్
వ్యక్తిగత వివరాలు
జననం (1948-02-24) 24 ఫిబ్రవరి 1948 (age 66)
మైసూర్,
భారత దేశం
రాజకీయ పార్టీ ఎ.ఐ.ఎ.డి.ఎమ్.కె.
నివాసం పోయస్ గార్డెన్,
చెన్నై,
భారత దేశం
మతం హిందూ మతము
  • సెల్వి జె.జయలలిత (ఫిబ్రవరి 24, 1948) తమిళనాడు రాష్ట్రపు ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు సినీనటి. తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కళగం యొక్క సామాన్య కార్యదర్శి.తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి, 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభఎన్నికైరి . అప్పటి ముఖ్యమంత్రి యం.జి.రామచంద్రన్ కు సన్నిహితంగా మెలిగిరి. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. గ్లామర్ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. అయినా పార్టీవారు తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
  • జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఈమె అలనాటి సినీ నటి సంధ్య కూతురు. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయ రంగప్రవేశానికి మునుపు తమిళ చిత్ర రంగములో విజయవంతమైన సినీ నటి. కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించినది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించినది.ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.
  • జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
  • 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 గెలుపు, 1991 గెలుపు. 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి), (2001 గెలుపు) 2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది. 2006 లో ఓటమి. 2011 లో తిరుగులేని ఎన్నిక.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]