ఎం.కరుణానిధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.కరుణానిధి

ఎం.కరుణానిధి దిద్దుబాటు


నియోజకవర్గము చేపాక్

వ్యక్తిగత వివరాలు

జననం (1924-06-03) 1924 జూన్ 3
తిరుక్కువలై, తమిళనాడు
రాజకీయ పార్టీ డి.ఎం.కె
సంతానము 4 కొడుకులు, 2 కూతుళ్ళు
నివాసము చెన్నై
మే 17, 2011నాటికి

మూలం: Government of Tamil Nadu

ఎం.కెగా మరియు డా.కళైనార్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు[1] మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[2] కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.[3] 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.

బాల్యం[మార్చు]

ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .

రాజకీయాలు[మార్చు]

మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సాహిత్యం[మార్చు]

తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.

మూలాలు[మార్చు]