వి.ఎన్.జానకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జానకి రామచంద్రన్, ప్రముఖ తమిళ నటి, రాజకీయ నాయకురాలు. ఈమె వి.ఎన్.జానకిగా ప్రఖ్యాతులు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  ఎం.జి.రామచంద్రన్  భార్య జానకి. ఆయన చనిపోయిన తరువాత  తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారామె.  

తొలినాళ్ళ జీవితం[మార్చు]

కేరళ రాష్ట్రం, కొట్టాయంలోని వైకోం పట్టణంలో జన్మించారు జానకి. ఆమె తల్లిదండ్రులు రాజగోపాల్ అయ్యర్, నారాయణి అమ్మా. ఆమె సోదరుడు పి.నారాయణన్ విద్యావేత్త. జానకి బాబాయి పాపనాశం శివన్ ప్రముఖ  కర్ణాటక సంగీత విద్వాంసులు, కన్నడ సినీ రంగంలో ప్రముఖ సంగీత దర్శకులు కూడా. 1940లలో ఆమె విజయవంతమైన నటిగా కొనసాగారు. దాదాపు 25 సినిమాల్లో నటించారు జానకి. రాజా ముక్తి, వెలైకారి, ఆయిరం తలైవంగైయా అబూర్వ చింతామణి, దేవకి, మరుధనట్టు  ఇలవరసి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో చేశారామె. ఎం.జి.రామచంద్రన్ తన ఆత్మకథలో జానకి గురించి రాస్తూ 1940, 50లలో నటునిగా తాను సంపాదించేదానికన్నా, ఆమె ఎక్కువ సంపాదించేవారని ప్రస్తావించారు. 

వ్యక్తిగత జీవితం[మార్చు]

1939లో జానకి 16వ ఏట గణపతి భట్ తో వివాహం జరిగింది. వీరిద్దరికీ సురేంద్రన్ అని కుమారుడు ఉన్నారు. ఆ తరువాత 1963లో ఎం.జి.రామచంద్రన్ ను వివాహం చేసుకున్నారు ఆమె.

రాజకీయ జీవితం[మార్చు]

1987లో ఎం.జి.రామచంద్రన్ మరణించిన తరువాత, జానకి తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా అయ్యారు.  ఎడిఎంకె పార్టీకి నాయకురాలిగా కూడా ఎన్నికయ్యారు ఆమె. జనవరి 1988లో ఆమె భర్త రామచంద్రన్ చనిపోయాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆమె ప్రభుత్వం 24 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. తమిళనాడు చరిత్రలో అతితక్కువ రోజులు ఉన్న ప్రభుత్వం ఇదే. అసెంబ్లీలో 1988లో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమె ప్రభుత్వం గెలిచినా, కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం జానకి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 1989లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓడిపోయింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళికం రెండు చీలికలుగా విడిపోవడంతో ఆమె రాజకీయల నుంచి బయటకు వచ్చేశారు.[1]

మరణం[మార్చు]

1996 మే 19న జానకి గుండె పోటుతో మరణించారు.

దాతృత్వం[మార్చు]

1986లో జానకి అవ్వాయ్ షణ్ముగం సలయ్ లోని తన ఆస్తిని భర్త రామచంద్రన్ జ్ఞాపకార్ధం ఎ.ఐ.డి.ఎం.కె పార్టీకి రాసిచ్చేశారు. అదే ఆ పార్టీకి  ప్రధాన కార్యాలయంగా ఉంది. టి.నగర్ లోని ఆర్కాట్ వీధిలో ఉన్న తన ఇంటిని 1988లో డాక్టర్.ఎం.జి.ఆర్ మెమోరియల్ హౌస్ గా విల్లు రాశారు ఆమె.[2] సత్య విద్య, స్వచ్చంద సంస్థను స్థాపించారు జానకి. ఈ సంస్థకు ఆమే చైర్మెన్ గా వ్యవహరించారు. ఈ సంస్థ చెన్నైలో ఎన్నో ఉచిత విద్యా సంస్థలను నడుపుతోంది. తమిళనాడులోని ఎన్నో  స్వచ్చంద సంస్థల కోసం ఎన్నో మిలియన్ డాలర్లు విలువ చేసే ఆస్తిని రాశారు జానకి.[3] జానకి రామచంద్రన్ విద్య, స్వచ్చంద ట్రస్టును  స్థాపించారు ఆమె. ఈ సంస్థ ఉపయోగించుకుంటున్న భూములు  ఆమె రాసిచ్చినవే. అవన్నీ ఎన్నో మిలియన్ డాలర్ల విలువైనవి కావడం విశేషం.[4][5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. MGR's Marriage Life
  2. "MGR Memorial House". మూలం నుండి 2016-07-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-11-21. Cite web requires |website= (help)
  3. "Janaki Donations new". మూలం నుండి 2009-09-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-11-21. Cite web requires |website= (help)
  4. "Janaki Donations". మూలం నుండి 2009-09-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-11-21. Cite web requires |website= (help)
  5. MGR facts