కనిమొళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనిమొళి కరుణానిధి
కనిమొళి


లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
18 జూన్ 2019 – ప్రస్తుతం
ముందు జె . జేయసింగ్ తీయగరాజ్ నటర్జీ
నియోజకవర్గం తూత్తుక్కుడి

రాజ్యసభ సభ్యురాలు
పదవీ కాలం
25 జులై 2007 – 23 మే 2019
ముందు ఎస్. జి. ఇందిరా
తరువాత పి . విల్సన్
నియోజకవర్గం తమిళనాడు

చైర్‌పర్సన్‌ - కెమికల్స్ & ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 సెప్టెంబర్ 2019
ముందు ఆనందరావు విత్తోబా అడ్సుల్

చైర్‌పర్సన్‌ - తూత్తుకుడి ఎయిర్పోర్ట్ అడ్వైసరి కమిటీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 జూన్ 2019
ముందు జె . జేయసింగ్ తీయగరాజ్ నటర్జీ

లోక్‌సభలో డీఎంకే ఉప నేత
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 జూన్ 2019
నాయకుడు టీ. ఆర్. బాలు

ది హిందూ నేషనల్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 ఏప్రిల్ 2017
ముందు ఈ. గోపాల్

డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 జనవరి 2015
అధ్యక్షుడు ఎం.కరుణానిధి
ఎం. కె. స్టాలిన్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-01-05) 1968 జనవరి 5 (వయసు 56)
చెన్నై , తమిళనాడు
రాజకీయ పార్టీ డీఎంకే
తల్లిదండ్రులు నాన్న: ఎం.కరుణానిధి
తల్లి : రజాతి అమ్మాళ్
జీవిత భాగస్వామి
  • అతిబన్ బోస్
    (m. 1989; విడాకులు 1997)
    [1]
జి. అరవిందన్
(m. 1997)
సంతానం 1
నివాసం * 46/1, ప్రశాంతి అపార్ట్మెంట్స్ , 2వ క్రాస్ స్ట్రీట్, సిట్ కాలనీ , మైలాపూర్ , చెన్నై-600004, తమిళనాడు, భారతదేశం
పూర్వ విద్యార్థి ఎతిరాజ్ కాలేజీ ఫర్ విమెన్
వృత్తి
  • కవయిత్రి
  • జర్నలిస్ట్
  • రాజకీయ నాయకురాలు

కనిమొళి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుండి గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2] కనిమొళి రాజకీయాల్లోకి రాకముందు ది హిందూ సబ్ ఎడిటర్, కుంగుమం అనే తమిళ వార పత్రికకు ఇన్ ఛార్జి ఎడిటర్‌గా, సింగపూర్ కేంద్రంగా పని చేసే తమిళ పత్రిక తమిళ్ మురసుకు సంపాదకురాలిగా పని చేసింది. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె.

రాజకీయ జీవితం[మార్చు]

కనిమొళి తన తండ్రి స్పూర్తితో డీఎంకే పార్టీ ద్వారా 2007లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 2007 నుండి 2009 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, 2009 నుండి 2010 వరకు విదేశీ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీ, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఆహార నిర్వహణ కమిటీలో సభ్యురాలిగా, 2010 నుండి 2012 వరకు గ్రామీణాభివృద్ధి పై ఏర్పాటైన కమిటీలో సభ్యురాలిగా, హోమ్ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీలో సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది.

కనిమొళి 2013లో రెండోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3] ఆమె 2013 ఆగష్టు 5న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి,[4] 2013 ఆగష్టు 15న రాజ్యసభలో డీఎంకే నేతగా ఎన్నికైంది.[5] కనిమొళి 2018లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకుంది. ఆమె 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో తూత్తుక్కుడి(ట్యూటికోరిన్) లోక్‌సభ నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి[6] తన సమీప బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ పై 347209 ఓట్లు ఆమెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

మూలాలు[మార్చు]

  1. "The Big and Mighty Karuna family". Daily News and Analysis. 26 May 2009. Retrieved 1 February 2011.
  2. Lok Sabha (2019). "Kanimozhi Karunanidhi". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  3. Sakshi (27 June 2013). "రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ఎన్నిక". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  4. Sakshi (5 August 2013). "రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  5. Sakshi (15 August 2013). "రాజ్యసభ నేతగా కనిమొళి". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  6. Andhra Jyothy (19 January 2019). "టూటికోరిన్ లోక్‌సభ బరిలో కనిమొళి". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కనిమొళి&oldid=3830092" నుండి వెలికితీశారు