Jump to content

పోస్టుమన్ రాజు

వికీపీడియా నుండి
పోస్టుమన్ రాజు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.శంకర్
నిర్మాణం వి.ఎస్.బోస్
తారాగణం రవిచందర్,
జయశంకర్,
నగేష్,
జయలలిత,
పండరీబాయి,
షీలా
సంగీతం విశ్వనాథం
జె. వి. రాఘవులు
నేపథ్య గానం ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
జె. వి. రాఘవులు,
పి.లీల
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
కూర్పు కందస్వామి
నిర్మాణ సంస్థ సీతారామా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పోస్టుమన్ రాజు 1968, ఆగస్టు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గౌరీ కళ్యాణం అనే తమిళ సినిమా నుండి ఈ సినిమా తెలుగులోనికి డబ్ చేయబడింది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఊహలు పొంగే కలను కన్నా ఊగే హృదయమే నాలో - ఎల్.ఆర్.ఈశ్వరి, రాఘవులు
  2. ఒకరి మనసు ఒకరికి తెలిపే లోక సేవ యిదే - ఘంటసాల
  3. నిను పిలిచే మనసే మనసు స్వామీ నిజం నీ స్మరణే - పి.లీల
  4. వాణీ శుభ జననీ రవ సాధనమే ఫల సాధకమే - పి.లీల
  5. విజయం విజయం ప్రియురాలా విరిసేను జీవితం - రాఘవులు, ఎల్.ఆర్.ఈశ్వరి

రాజు పోస్టుమాన్. అతనికి ఉన్నది ఒకే చెల్లెలు గౌరి. ఆ చెల్లెలే తన పంచప్రాణాలుగా భావించి ఆమెను కాలేజీలో చదివిస్తున్నాడు. కామాక్షమ్మ కుమారుడు మధుసూధనరావు తల్లిమీద కోపంతో ఏనాడో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతని కంఠస్వరం, రాజు కంఠస్వరం ఒకలాగే ఉంటాయి. అతని మాటవిన్నప్పుడల్లా కామాక్షమ్మకు తన కొడుకు జ్ఞాపకం వస్తాడు. అందుకే ఆమెకు రాజు అంటే వల్లమాలిన అభిమానం. ఆమె ఆవేదన గమనించిన రాజు సానుభూతి చూపుతూ మధు నుండి ఉత్తరం తెస్తానని చెబుతుంటాడు. కామాక్షమ్మ కూతురు లక్ష్మి టీచరుగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె అంటే రాజుకు ఒక విధమైన అనురాగం. పాఠశాల వార్షికోత్సవం నాడు దాని స్థాపకుడైన వెంకటాద్రిగారే అధ్యక్షత వహిస్తారు. ఆయన కుమారుడు రాము లక్ష్మి పాట విని ప్రశంసిస్తాడు. లక్ష్మి రామును ప్రేమిస్తుంది. ఆరోజే కాలేజీలో వార్షికోత్సవం. రాము, గౌరీలు నాట్యంగురించి వాదించుకుని వేదికపై నృత్యం చేస్తారు. బస్సులో అతడు ఆమెను అల్లరిచేస్తాడు. ఈ సంగతి తెలిసి రాజు అతని కారుకు తన సైకిల్‌ను అడ్డంగా పెట్టి కొట్లాటకు దిగుతాడు. ఇద్దరి మధ్య శత్రుభావం పెరుగుతుంది. కాని రాముకు గౌరి అంటే అమితమైన ప్రేమ కలుగుతుంది. ముందు తగవులతో మొదలైన వారి పరిచయం చివరకు అనురాగంగా మారుతుంది. కామాక్షమ్మ కొడుకు మధు యుద్ధరంగంలో మరణించాడన్న తంతి వార్తను రాజు పోస్టాఫీసులో చూస్తాడు. లక్ష్మి కూడా ఎంతో విచారిస్తుంది. కామాక్షమ్మకు ఈ విషయం తెలిస్తే తల్లడిల్లుతందని మభ్యపెడతారు. తల్లికి డబ్బుపంపుతున్నట్టు రాజు తనే కొంచెం పైకం మనియార్డరు రూపంలో ఇస్తూవుంటాడు. త్వరలో రమ్మని వచ్చేటప్పుడు కాశీ నుండి గంగాజలం తెమ్మని ఉత్తరం వ్రాయమంటుంది. మధు వచ్చేరోజు కామాక్షమ్మ సంతోషంతో ఇంట్లో సామానులు సర్దుతూ క్రిందపడిపోయి కళ్ళు పోగొట్టుకుంటుంది. కాశీగంగ తెచ్చిన రాజు ఆమె పరిస్థితిని చూసి భయవిహ్వలుడౌతాడు. అంతలోనే మధు చనిపోయాడని అతని దుస్తులు, కిట్ ఇచ్చిపోతారు మిలటరీ ఆఫీసర్లు. ఆ దుస్తులు తానే ధరించి రాజు మధులా నటిస్తాడు. మధు చేతిలో లక్ష్మి చేయి పెట్టి కామాక్షమ్మ చనిపోతుంది. గౌరి, రాముల ప్రణయ సన్నివేశం చూసి రాజు ఉగ్రుడై చెల్లెలిని మందలిస్తాడు. రాము తండ్రి యుద్ధరంగంలో తన కళ్ళుపోగా ఒక మిత్రుడు నేత్రదానం చేశాడని చెబుతాడు. ఆ మిత్రుని ఫోటో తమయింటిలో ఉంది. అలాంటి ఫోటోనే గౌరి ఇంటిలో చూసిన రాము గౌరిని తన తండ్రి వద్దకు తీసుకువెళతాడు. "మీ నాన్న ఇచ్చిన కళ్ళు ఇవి" అని వెంకటాద్రి కృతజ్ఞత చూపుతాడు. గౌరిని రాముకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. రాజు కూడా అంగీకరిస్తాడు. పెళ్ళి సన్నాహాలు జరుగుతున్న సమయంలో లక్ష్మిని ప్రేమించిన రాజు ఆమె చేతనే చెప్పించి ఒప్పించి పెళ్ళి చేసుకోవాలని వెడతాడు కాని లక్ష్మి రామును ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది. వెంకటాద్రిగారితో, చెల్లెలితోను ఈ సంగతి చెప్పి రాముకు లక్ష్మికి పెళ్ళి చేయడానికి నిశ్చయించుకుంటాడు రాజు.కాని లక్ష్మి రాము గౌరిని ప్రేమించిన సంగతి తెలుసుకుని మనస్సు మార్చుకుని రామును గౌరికే ఇచ్చి పెళ్ళిచేసి తాను పంతులమ్మగానే మిగిలిపోతుంది[1].

మూలాలు

[మార్చు]
  1. రాధాకృష్ణ (30 August 1968). "చిత్రసమీక్ష - పోస్టుమన్ రాజు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 27 February 2020.[permanent dead link]