Jump to content

పి.లీల

వికీపీడియా నుండి
పొరయత్తు లీల
పి.లీల
జననంపి.లీల
(1934-05-19)1934 మే 19
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్
మరణం2005 అక్టోబరు 31(2005-10-31) (వయసు: 71)
చెన్నై, ఇండియా
వృత్తిగాయని
ప్రసిద్ధిసోలో సింగర్
తండ్రివి.కె.కన్‌జన్‌మీనన్
తల్లిపొరయాత్ మీనాక్షీ అమ్మ

పొరయత్తు లీల (మే 19, 1934 - అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]

జననం

[మార్చు]

లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.


తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

తెలుగు సినిమారంగం

[మార్చు]

ఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది.[2]

పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1మనదేశంబాలత్రిపురసుందరీఘంటసాల1949
2కీలుగుర్రందిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మిఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
3కీలుగుర్రంనిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబోఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
4గుణసుందరి కథఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
5గుణసుందరి కథఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
6గుణసుందరి కథకల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతినిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
7గుణసుందరి కథచిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటేకస్తూరి శివరావుఓగిరాల రామచంద్రరావుపింగళి1949
8గుణసుందరి కథశ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవేఓగిరాల రామచంద్రరావుపింగళి1949
9లైలా మజ్నుఅందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపుకె.జమునారాణిసి.ఆర్.సుబ్బరామన్సముద్రాల సీనియర్1949
10శ్రీ లక్ష్మమ్మ కథఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనాసి.ఆర్.సుబ్బరామన్1950
11శ్రీ లక్ష్మమ్మ కథచిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోనబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
12శ్రీ లక్ష్మమ్మ కథజీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనోబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
13అగ్నిపరీక్షవసంత రుతువే హాయి మురిపించి మించెనోయిగాలిపెంచలకె.జి. శర్మ 1951
14పాతాళ భైరవిఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటుఘంటసాలఘంటసాలపింగళి1951
15పాతాళ భైరవికలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలేఘంటసాలఘంటసాలపింగళి1951
16పాతాళ భైరవితీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంతబృందంఘంటసాలపింగళి1951
17పాతాళ భైరవిహయిగా మనకింక స్వేచ్ఛగాఘంటసాలఘంటసాలపింగళి1951
18సర్వాధికారిఅందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలుసుసర్ల దక్షిణామూర్తి1951
19చిన్నమ్మ కథకనుపించినావు రావో రాకున్న విడువనోయీవేలూరు కృష్ణమూర్తి1952
20పెళ్ళి చేసి చూడుఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరాఘంటసాలఘంటసాలపింగళి1952
21పెళ్ళి చేసి చూడుఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవుఘంటసాలపింగళి1952
22పెళ్ళి చేసి చూడుప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగపిఠాపురం,
రామకృష్ణ
ఘంటసాలపింగళి1952
23పెళ్ళి చేసి చూడుమనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసాఘంటసాలపింగళి1952
24మిస్సమ్మఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
25మిస్సమ్మకరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాతఎస్.రాజేశ్వరరావుపింగళి1955
26మిస్సమ్మతెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
27మిస్సమ్మరాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసాసి.కృష్ణవేణిఎస్.రాజేశ్వరరావుపింగళి1955
28మిస్సమ్మరావోయి చందమామ మా వింత గాథ వినుమాఎ.ఎం.రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
29చరణదాసిఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరముఎస్.రాజేశ్వరరావు1956
30చింతామణితగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునాఅద్దేపల్లి రామారావు,
టి.వి.రాజు
1956
31చిరంజీవులుఅల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవిఘంటసాల బృందంఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
32చిరంజీవులుఎందాక ఎందాక ఎందాక అందాక అందాకఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
33చిరంజీవులుఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననేఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
34చిరంజీవులుకనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైనఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
35చిరంజీవులుచికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసుఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
36చిరంజీవులుతెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరాఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
37భలే రాముడుఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేలఎస్. రాజేశ్వరరావుసదాశివబ్రహ్మం1956
38హరిశ్చంద్రఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మసుసర్ల దక్షిణామూర్తిజంపన1956
39దొంగల్లో దొరవిన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాలఘంటసాలఎం.ఎస్.రాజునారపరెడ్డి1957
40మాయాబజార్చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరముఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
41మాయాబజార్దయచేయండి దయచేయండిఘంటసాల,
పి.సుశీల
ఘంటసాలపింగళి1957
42మాయాబజార్నీకోసమె నే జీవించునదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
43మాయాబజార్నీవేనా నను తలచినదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
44మాయాబజార్లాహిరి లాహిరి లాహిరిలోఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
45మాయాబజార్విన్నావటమ్మా ఓ యశోదమ్మాపి.సుశీల,
స్వర్ణలత
ఘంటసాలపింగళి1957
46వినాయక చవితిఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరాఘంటసాలసముద్రాల సీనియర్1957
47వినాయక చవితితనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతోఘంటసాలసముద్రాల సీనియర్1957
48వినాయక చవితిరాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరాఎం.ఎస్.రామారావు బృందంఘంటసాలసముద్రాల సీనియర్1957
49సతీ అనసూయఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతాఘంటసాలసముద్రాల జూనియర్1957
50సారంగధరజయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారిఘంటసాలసముద్రాల సీనియర్1957
51శ్రీ రామభక్త హనుమాన్పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతివిజయభాస్కర్శ్రీశ్రీ1958
52అప్పుచేసి పప్పుకూడుఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పైఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1959
53పెళ్ళి సందడిఅప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడాఘంటసాలసముద్రాల జూనియర్1959
54సతీ సుకన్యఅందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనేఘంటసాలశ్రీరామచంద్1959
55సౌభాగ్యవతిముల్లోకములనేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవీపెండ్యాల నాగేశ్వరరావుశ్రీశ్రీ1959
56సౌభాగ్యవతిచేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్పెండ్యాల నాగేశ్వరరావుశ్రీశ్రీ1959
57సౌభాగ్యవతిమాతా భవానీ మంగళ గౌరీ శంకరీపెండ్యాల నాగేశ్వరరావుశ్రీశ్రీ1959
58సౌభాగ్యవతినిదురలో మెలుకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచితినమ్మాపెండ్యాల నాగేశ్వరరావుశ్రీశ్రీ1959
59భక్త రఘునాథ్హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమాఘంటసాలసముద్రాల సీనియర్1960
60మహాకవి కాళిదాసురసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరిరత్నంపెండ్యాలపింగళి1960
61శాంతి నివాసంకలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపేఘంటసాలసముద్రాల జూనియర్1960
62శాంతి నివాసంసెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోనఎ.పి.కోమల బృందంఘంటసాలసముద్రాల జూనియర్1960
63జగదేకవీరుని కథజలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలాపసుశీల బృందంపెండ్యాలపింగళి1960
64ఋష్యశృంగఆనందమీనాడే పరమానంద మీనాడేటి.వి.రాజుసముద్రాల జూనియర్1961
65సీతారామ కళ్యాణంఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేరఘంటసాలగాలిపెంచలసముద్రాల సీనియర్1961
66శ్రీకృష్ణ కుచేలనీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైనఘంటసాలఘంటసాలపాలగుమ్మి పద్మరాజు1961
67గుండమ్మ కథవేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెనుఘంటసాలఘంటసాలపింగళి1962
68మహామంత్రి తిమ్మరుసుజయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగాఘంటసాలపెండ్యాలపింగళి1962
69ఆప్తమిత్రులుపవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగఎ.పి.కోమలఘంటసాలసముద్రాల జూనియర్1963
70రాణీ సంయుక్తఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలాఘంటసాలఎం.రంగారావుఆరుద్ర1963
71లవకుశజగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడేఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ఘంటసాలసముద్రాల సీనియర్1963
72లవకుశరామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
73లవకుశరామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
74లవకుశలేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలోపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
75లవకుశవినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
76లవకుశశ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
77సోమవార వ్రత మహాత్మ్యంఅడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడిమాస్టర్ వేణునార్ల చిరంజీవి1963
78పతివ్రతరావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణాఎం.రంగారావుఅనిసెట్టి1964
79పతివ్రతనీ చెలికనవో నీ చెలి గనవా చలించవామాధవపెద్దిఎం.రంగారావుఅనిసెట్టి1964
80పతివ్రతలేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తిబృందంఎం.రంగారావుఅనిసెట్టి1964
81పతివ్రతసా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవోపి.బి.శ్రీనివాస్ఎం.రంగారావుఅనిసెట్టి1964
82బభ్రువాహనఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరాపామర్తిసముద్రాల సీనియర్1964
83రహస్యంశ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళాఘంటసాలమల్లాది1967
84శ్రీకృష్ణ మహిమకృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనాఎ.పి.కోమలఘంటసాలఅనిసెట్టి1967
85శ్రీకృష్ణావతారంవిన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలుబృందంటి.వి.రాజుసి.నా.రె.1967
86తారాశశాంకమునీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పసపి.సుశీలటి.వి.రాజుసముద్రాల సీనియర్1969
87మా ఇలవేల్పుగౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరిజిక్కిజి.కె.వెంకటేష్సి.నా.రె.1971

మరణం

[మార్చు]

లీల అక్టోబర్ 31 2005చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]

ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2007-01-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-04.
  2. కంపల్లె, రవిచంద్రన్ (2013). జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 131–136.
  3. P. Leela's death mourned Archived 2007-06-13 at the Wayback Machine - ది హిందూ, నవంబర్ 1, 2005

బయటి వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పి.లీల&oldid=4301535" నుండి వెలికితీశారు