సారంగధర (1957 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారంగధర
(1957 తెలుగు సినిమా)
Saarangadhara.jpg
దర్శకత్వం వి.ఎస్.రాఘవన్,
కె.ఎస్. రామచంద్రరావు
నిర్మాణం టి.నామదేవరెడ్డి
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి,
ఎస్.వి.రంగారావు
సంగీతం ఘంటసాల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
కళ ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణ సంస్థ మినర్వా ప్రొడక్షన్స్
విడుదల తేదీ నవంబర్ 1, 1957
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సారంగధర మినర్వా పతాకంపై ఎన్‌టి రామారావు, భానుమతిల కాంబినేషన్‌తో రూపొందించిన చిత్రం. ఈ కథను తొలుత 1930లో వై.వి. రావు మూకీ చిత్రంగా ‘జనరల్ కార్పొరేషన్’పై మద్రాస్‌లో రూపొందించాడు. తమిళంలో 1935లో టాకీ చిత్రంగా దర్శకులు విఎస్‌కె పాథమ్, కొత్తమంగళం శీను, టిఎం శారదాంబల్ కాంబినేషన్‌లో ‘సారంగధర’ నిర్మించారు. తమిళంలోనే మరోసారి నవీన ‘సారంగధర’ పేరిట మరోచిత్రం ఎంకె త్యాగరాజు భాగవతార్, ఎస్‌డి సుబ్బలక్ష్మిలతో రూపొందించారు. 1937లో తెలుగులో స్వామి పిళ్లై, రామయ్య అనే నిర్మాతలు స్టార్ కంబైన్స్ బ్యానర్‌పై పి.పుల్లయ్య దర్శకత్వంలో బొంబాయిలో నిర్మించారు. ఆ చిత్రానికి బందా కనకలింగేశ్వరరావు (సారంగధరునిగా), పి.శాంతకుమారి (చిత్రాంగి), అద్దంకి శ్రీరామమూర్తి రాజరాజనరేంద్రునిగా, పులిపాటి వెంకటేశ్వర్లు సుబుద్దిగా నటించగా తాపీ ధర్మారావు రచన, ఆకుల నరసింహారావు సంగీతం సమకూర్చారు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

కథ[మార్చు]

వేంగి రాజ్యాన్ని పాలించే చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు (ఎస్‌వి రంగారావు). మహారాణి రత్నాంగి (శాంతకుమారి). యువరాజు సారంగధరుడు (ఎన్‌టి రామారావు). మహామంత్రి సింగన్న (గుమ్మడి). మంత్రి కుమారుడు సుబుద్ది (చలం), మాండవ్యుడు (రేలంగి) యువరాజు మిత్రులు. వేంగి రాజ్యానికి సామంతుడు మంగరాజు (సివివి పంతులు). అతని కుమార్తె కనకాంగి (రాజసులోచన), యువరాజు పరస్పర అనురాగబద్దులవుతారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజు (ఏవి సుబ్బారావు సీనియర్) వద్దకు శాంతికోసం యువరాజు రాయబారిగా వెళ్తాడు. దారిలో చిత్రాంగి (భానుమతి) యువరాజును చూసి ప్రేమిస్తుంది. సంధి ఒప్పందం తరువాత రాజ్యానికి వెళ్లిన యువరాజుకు వివాహం కోసం రాజరాజు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి చిత్రాంగి పెళ్లికి అంగీకరిస్తుంది. కాని కనకాంగిపట్ల అనురక్తుడైన యువరాజు వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే మంత్రి గంగన్న (ముక్కామల) కుయుక్తివలన రాజరాజు చిత్రాంగిని (కత్తికి మాలవేయించి) వివాహం చేసుకుంటాడు. జరిగిన మోసం తెలుసుకున్న చిత్రాంగి, వ్రతం పేరుతో రాజరాజును దూరంగావుంచి చెలికత్తె మల్లిక (సురభి బాలసరస్వతి) సాయంతో పావురాల ఆట ద్వారా సారంగధరుని తన భవనానికి రప్పించి తన ప్రేమను వెల్లడిస్తుంది. తన తల్లివలెనే భావిస్తున్నానని సారంగధరుడు చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు. భంగపాటుతో కోపానికి గురైన చిత్రాంగి, సారంగధరుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని రాజరాజుకు చెబుతుంది. మహారాజు ఆగ్రహానికి గురై సారంగుని కాళ్లుచేతులు నరికించమని శిక్ష విధిస్తాడు. సుబుద్ధి సాయంతో నిజం తెలుసుకున్న రాజరాజు శిక్ష నిలుపుదల చేయమంటాడు. అయితే గంగన్న శిక్షను త్వరగా అమలుపర్చడంతో సారంగధరుడు మరణిస్తాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన చిత్రాంగి ఆత్మత్యాగం చేసుకుంటుంది. తల్లి రత్నాంగి, ప్రియురాలు కనకాంగి, యువరాజుకై విలపిస్తుండగా ఓ సాధువు వచ్చి మంత్రజలంతో యువరాజును బతికిస్తాడు. కనకాంగిని వివాహం చేసుకున్న సారంగధరుడు వేంగి రాజ్య సింహాసనం అధిష్టించి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందటంతో చిత్రం సుఖాంతమవుతుంది[1]..

మూలాలు[మార్చు]

  1. సివిఆర్ మాణిక్యేశ్వరి (8 December 2018). "ఫ్లాష్ బ్యాక్ @ 50 సారంగధర". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 10 December 2018.

బయటి లింకులు[మార్చు]