బభ్రువాహన (1964 సినిమా)
బభృవాహన (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సముద్రాల రాఘవాచార్య |
---|---|
నిర్మాణం | సి. జగన్మోహనరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, ఎస్.వరలక్ష్మి, కాంతారావు, చలం, ఎల్. విజయలక్ష్మి |
సంగీతం | [[పామర్తి వెంకటేశ్వరరావు}}పామర్తి]] |
నిర్మాణ సంస్థ | శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బభ్రువాహన 1964, అక్టోబర్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రేలంగి, చలం, బాలయ్య, పేకేటి, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, విజయమాల, నారీమణి, సి.ఎస్.ఆర్., నాగరాజ్, వంగర, సీతారాం, వేళంగి, మల్లాది, విజయరావు, కాశీనాథ్, వెంకటేశ్వరరావు, మిక్కిలినేని (గెస్టు ఆర్టిస్టు), మాస్టర్ సముద్రాల లు నటించారు.[1]
వివరాలు
[మార్చు]- చిత్రం పేరు - బభ్రువాహన (అర్జున - బభ్రువాహన యుద్ధం)
- దర్శకత్వం, కథ, మాటలు, పాటలు - సముద్రాల సీనియర్
- సంయుక్త దర్శకుడు - బి.హెచ్.విజయరావు
- నిర్మాత - సి.జగన్మోహనరావు
- తారాగణం - ఎన్.టి.రామారావు, కాంతారావు, రేలంగి, చలం, బాలయ్య, పేకేటి, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, విజయమాల, నారీమణి, సి.ఎస్.ఆర్., నాగరాజ్, వంగర, సీతారాం, వేళంగి, మల్లాది, విజయరావు, కాశీనాథ్, వెంకటేశ్వరరావు, మిక్కిలినేని (గెస్టు ఆర్టిస్టు), మాస్టర్ సముద్రాల
- నిర్మాణ సంస్థ - శ్రీ నేషనల్ ఆర్టు పిక్చర్సు
- నేపథ్యగాయకులు - ఘంటసాల, మాధవపెద్ది సత్యం, మల్లికార్జునరావు, పి.లీల, పి.సుశీల
- సంగీతం - పామర్తి
- నృత్యం - పసుమర్తి కృష్ణమూర్తి
- ఛాయాగ్రహణ దర్శకత్వం - కమల్ ఘోష్
- ఛాయాగ్రహణం - జె.సత్యనారాయణ
- స్టూడియో - వాహినీ
- పంపిణీ - ఎన్.ఏ.డి(విజయవాడ)-ఆంధ్ర, శ్రీ నేషనల్ ఆర్టు పిక్చర్సు(సికింద్రాబాద్)-నైజాం
- టైటిల్సు - స్పెషల్ ఎఫెక్ట్సు - వి.మదన్మోహన్, ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
- స్పెషల్ ఎఫెక్ట్సు - హర్బాన్సింగ్
- శబ్దగ్రహణం - పాటలు: వి.శివరాం(వాహినీ), పి.వి.కోటేశ్వరరావు(భరణి). మాటలు: పి.ఎం.మదనగోపాల్(వాహినీ)
- రికార్డింగు యంత్రము - వెస్ట్రెక్స్ సౌండ్ సిస్టం
- రీ-రికార్డింగ్ - ఏ.ఆర్.స్వామినాథన్
- ఎడిటింగ్ - బి.హరినారాయణయ్య
- కళ - తోట వెంకటేశ్వరరావు
- దుస్తులు - కె.అచ్యుతరావు
- మేకప్ - పీతాంబరం, వీర్రాజు, భక్తవత్సలం
- కేశాలంకరణ - తానారపు భాస్కరరావు
- సీనిక్ ఎఫెక్ట్సు - ఆర్.జయరామరెడ్డి, కె.శ్రీనివాసన్
- సెట్టింగులు - టి.నీలకంఠన్
- మోల్డింగ్ - పి.జి.దొరెస్వామి
- ఛీఫ్ ఎల్క్ట్రిషియన్ - ఎం.శంకరనారాయణన్
- స్టంట్సు - సాంబశివరావ్ అండ్ పార్టీ
- స్టిల్స్ - డి.రాధాకృష్ణమూర్తి, మాతా స్టూడియో
- పబ్లిసిటి కన్సెల్టెంట్ - విజయా పబ్లిసిటీస్
- ప్రాసెసింగ్ - విజయా లేబొరెటరీస్, పి.ఎం.విజయరాఘవులు
- ప్రొడక్షన్ నిర్వహణ - పి.వి.గోపాలకృష్ణ, ఎస్.చిట్టిబాబు
- స్టూడియో ప్రోగ్రామ్స్ - సి.ఎస్.ప్రకాశరావు, ఎం.జి.రామదాసు, పి.సుందరం
- పబ్లిసిటీ - కె.రామదాస్, స్టూడియో సక్సెస్
పాటలు
[మార్చు]- ఏమని తానాడునో నే నేమని బదులాడనౌనో - ఎస్. వరలక్ష్మి
- ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా - పి. లీల
- కావి పుట్టింబు జడలు అలంకారములుగ నీమనోహర (పద్యం) - ఘంటసాల - రచన: వెంకట కవి
- కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా (పద్యం) - ఘంటసాల - రచన: వెంకట కవి
- కదనమ్ములోన శంకరుని (సంవాద పద్యాలు) - ఘంటసాల, మాధవపెద్ది సత్యం - రచన: సముద్రాల
- కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- నా ఆశ విరబూసె మనసే మురిసే మధువానినా మైకాలతో - పి.సుశీల
- నీ సరి మనోహరి జగాన కానరాదుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - రచన: సముద్రాల
- నిన్నే నిన్నే చెలి నిలునిలుమా నిను విడి నిలువగలేను - ఘంటసాల, పి.సుశీల - రచన: వెంకట కవి
- మనసేమో వయారాల విలాసాల మహారాజా - పి.లీల, ఘంటసాల - రచన: సముద్రాల
- మాసాటి వారు ఏ చోటలేరు ఆటపాటలనైన - ఎస్. వరలక్ష్మి బృందం
- మాసాటి వారు ఏ చోటలేరనిడంబాలు పోనేలా ఇపుడిలా - బృంద గీతం
- వర్ధిల్లు మాపాప వర్ధిల్లవయ్యా కురువంశ మణిదీపా - ఎస్. వరలక్ష్మి
- సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యారిత్రుడౌనే (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- మణి పూరీసులు శివ భక్త రహితులేని మాతృ,(పద్యం) మాధవపెద్ది, రచన:సముద్రాల సీనియర్
- ఎగు భుజంబుల వాడు మృగరాజు మధ్యంబు (పద్యం), పీ.సుశీల, రచన: చేమకూర వెంకటకవి
- చెరకు విలుకాని బారికి వెరచి ,(పద్యం), పి.లీల , రచన: చేమకూర వెంకటకవి
- త్వత్రీ రేవ సతిం తవామల జలస్నానం(పద్యం), పి.లీల, రచన:సముద్రాల సీనియర్
- దుర్జయ రాజమండల,(పద్యం) మల్లికార్జునరావు, రచన: పిల్లల మర్రి పినవీర భద్రకవి
- మీరింద్ర ప్రస్థము కనినారా పాండవుల (పద్యం), పి.సుశీల, రచన: చేమకూర వెంకటకవి.
ఇవి కూడా చూడండి
[మార్చు]కథాంశం
[మార్చు]అర్జునుడి కొడుకు బభ్రువాహనుని కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. కృష్ణుడు అర్జునుడు చేస్తున్న తీర్థయాత్రలను తన భార్యకు , సుభద్రకు చెప్పటంతో కథ మొదలవుతుంది. తరువాత అర్జునుడు, అతని స్నేహితుడు రాత్రి నిద్ర పొయ్యే ముందు మాట్లాడుకోవటం కనిపిస్తుంది. వెంటనే దృశ్యం నాగలోకం కి వెళ్లి అక్కడ అర్జునుడిని వలచిన నాగ కన్య ఉలూచి పాట పాడుకుంటుంది - అర్జునుని చిత్ర పటం ముందు ఉంచుకోని. చెలి కత్తెలు నవ్వుతారు, కాని ఉలూచి వారిని వెలుపలికి పంపి, ప్రధాన చెలికత్తెతో కలిసి అర్జునుడు నిద్రిస్తున్న చోటుకు వెళ్లి అర్జునుడిని మెడలో మాలగా చేసుకోని, అర్జునుడి స్నేహితున్ని చిలుకగా చేసుకోని నాగలోకం తీసుకెళ్తారు.
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (25 October 1966). "బభ్రువాహన చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 13 October 2017.[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)