ఎమ్.పీతాంబరం

వికీపీడియా నుండి
(పీతాంబరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ప్రముఖ ఆహార్య నిపుణులు.

తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.

వీరు శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశారు.

వీరు ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం మరియు యుగంధర్ చిత్రాల్ని నిర్మించారు. పంచభూతాలు (1979) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 21 ఫిబ్రవరి 2011 తేదీన పరమపదించారు.

ప్రముఖ దర్శకుడు పి.వాసు ఇతని కుమారుడే.