ఈనాడు (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈనాడు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ,
చంద్రమోహన్,
రాధిక
సంగీతం జె.వి.రాఘవులు
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్
విడుదల తేదీ డిసెంబరు 17, 1982 (1982-12-17)
భాష తెలుగు

ఇది 1982లో విడుదలైన తెలుగు సినీమా. కృష్ణ 200 వ చిత్రంగా పద్మాలయా పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం. మలయాళంలో విజయవంతమైన ఈనాడు చిత్రం దీనికి ఆధారం. పరుచూరి సోదరులు కృష్ణ చిత్రానికి తొలిసారిగా పనిచేసారు. పొలిటికల్ సెటైర్ గా తీసిన చిత్రం విజయవంతమయ్యింది.

తారాగణం

[మార్చు]

కృష్ణ,
చంద్రమోహన్,
రాధిక,
శ్రీధర్,

రావు గోపలరావు

గిరిబాబు

కైకాలసత్యనారాయణ

అల్లు రాలింగయ్య

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]
దర్శకుడు పి.సాంబశివరావు

మలయాళంలో విడుదలై విజయవంతమైన ఏకలవ్య చిత్రం ఈనాడుకు మాతృక. పద్మాలయ సంస్థ ద్వారా తెలుగులో తీద్దామన్న ఉద్దేశంతో కృష్ణ ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణ హక్కులు కొన్నారు. ఏకలవ్యలో సినిమాలో హీరో వయసు అరవై సంవత్సరాలు. పరుచూరి సోదరులను పిలిపించి కృష్ణ వారికి ఈ సినిమా చూపించి ఎవరు హీరోగా సరిపోతారంటే కృష్ణే సరిపోతారని చెప్పారు. మూలంలో కథానాయకుడు ముసలి వయసులో ఉన్నవాడు కదానని కృష్ణ అడగగా, ఆయన బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారు. ఆయన మరుసటి రోజు వింటానని సమయమివ్వగా 20 గంటల్లో ట్రీట్మెంట్ రాయడం పూర్తిచేశారు. ఇందులో కథానాయకుడి వయసును తగ్గించడంతో పాటుగా, కథానాయకుడు ప్రతినాయకుల మధ్య బావా బావమరుదుల సంబంధాన్ని కల్పించారు రచయితలు పరుచూరి సోదరులు. ఏకలవ్య సినిమాలో పాటలేవీ ఉండకపోగా తెలుగు సినిమాలో పాటలకు చోటుకల్పించారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

మలయాళ మాతృకలో కథానాయకుని పాత్ర ముసలి వ్యక్తి కావడంతో కృష్ణ ఎవరైనా సీనియర్ నటుడితో కథానాయక పాత్ర చేయిద్దామనుకున్నారు. ఆ పాత్రలోనూ, సినిమా కథలోనూ రచయితలు పరుచూరి సోదరులు మార్పులు చేశారు. దాంతో కథానాయకునిగా కృష్ణ నటించడానికి అంగీకరించారు.[1]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
నేడె ఈ నాడే ప్రజా యుద్ధ సంరంభం శ్రీశ్రీ జె.వి.రాఘవులు
రండి కదలి రండి జె.వి.రాఘవులు
జె.వి.రాఘవులు
జె.వి.రాఘవులు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పరుచూరి, గోపాలకృష్ణ. లెవంత్ అవర్ (2 ed.). హైదరాబాద్: వి టెక్ పబ్లికేషన్స్. pp. 1–11.

బయటి లంకెలు

[మార్చు]