షావుకారు జానకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షావుకారు జానకి
జననంషావుకారు జానకి
(1931-12-12) 1931 డిసెంబరు 12 (వయస్సు: 87  సంవత్సరాలు)
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
వృత్తితెలుగు రంగస్థల మరియు సినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1949–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశంకరమంచి శ్రీనివాసరావు (వివాహం 1947)[1]

షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (జ. 1931 డిసెంబరు 12) అలనాటి రంగస్థల మరియు తెలుగు సినీ కథానాయిక.

జననం[మార్చు]

జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న పశ్చిమ బెంగాల్లో జన్మించింది.. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.

రంగస్థల సినిమా ప్రస్థానం[మార్చు]

అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు.

విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "రక్షరేఖ" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది [1]) తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి.

నటించిన కొన్ని తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sowcar Janaki Returns". www.indiaglitz.com. Retrieved 23 December 2014.

ఇతర లింకులు[మార్చు]