సవతి

వికీపీడియా నుండి
(సవతి కొడుకు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఒక మగవాడికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లయితే ఆ భార్యలు ఒకరికొకరు సవతి లేదా సపత్ని అనబడుతారు. ఆ వ్యక్తికి ఒక భార్య ద్వారా కలిగిన పిల్లలకు అదే వ్యక్తి మరొక భార్య సవతి తల్లి అవుతుంది. సవతి తల్లి యొక్క కొడుకును సవతి కొడుకు అంటారు. సవతుల మధ్య ఉన్న జగడాన్నిసవతి పోరు అంటారు.


బహుభార్యాత్వం ఉన్న పరిస్థితులలో కుటుంబ జీవనంలో సవతుల మధ్య ఉన్న సంబంధాలు చాలా గాఢమైన ప్రభావాలు కలిగి ఉంటాయి. తన కడుపున పుట్టకుండా తన భర్తకు మరొక స్త్రీ వలన కలిగిన పిల్లల పట్ల "సవతి తల్లి" చూపే విచక్షణ తెలుగులో అనేక కథలకు, సినిమాలకు ప్రధాన ఇతివృత్తంగా ఉండేది. మారుతున్న పరిస్థితులలో ఈ కథలకు ప్రాధాన్యత తగ్గింది.

"https://te.wikipedia.org/w/index.php?title=సవతి&oldid=2140744" నుండి వెలికితీశారు