అక్క
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

Two Sisters by William-Adolphe Bouguereau.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అక్కాతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు) వయసులో పెద్దదైన సోదరిని అక్క (elder sister) అంటారు. వీరందరిలో పెద్దదైన అక్కని పెద్దక్క లేదా పెద్దక్కయ్య అంటారు. సంస్కృతంలో పూర్వజ అనగా ముందుగా జన్మించినది అనగా అక్క అని అర్థం.
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.
వరుసల్లో అక్క[మార్చు]
- కొడుకు కూతుళ్ళలో కూతురు పెద్దదైతే అక్క
- ఇద్దరు కూతుళ్ళలో పెద్దదైన కూతురు అక్క
- పెద్దమ్మ, పెదనాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
- చిన్నమ్మ చిన్నాన్న కూతుళ్ళలో పెద్ద వయసు కల స్త్రీ అక్క
- తోటి కోడళ్ళలో చిన్న కోడలు పెద్ద కోడలిని అక్క అంటుంది
వినోద రంగం[మార్చు]
వినోద రంగాలలో ముఖ్యరంగాలైన టెలివిజన్, సినిమాల ద్వారా అక్కపాత్ర లేని ప్రోగ్రాములు చాలా తక్కువ. పలు సీరియళ్ళు అక్క పాత్రతో తయారయినవి ప్రధర్శింపబడినవి, ప్రధర్శింపబడుతున్నవి.
- అక్కాచెల్లెలు సినిమాలో షావుకారు జానకి అక్కగా నటించి మెప్పించింది.
- తోడికోడళ్ళు సినిమాలో ముగ్గురు కోడళ్ళలో పెద్దగా కన్నాంబ హుందాగా నటించింది.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.

Look up అక్క in Wiktionary, the free dictionary.