Jump to content

భార్య

వికీపీడియా నుండి
(భార్యలు నుండి దారిమార్పు చెందింది)

ఒక పురుషుడు వివాహము చేసుకున్న స్త్రీని అతడి భార్య, పెళ్ళాం, ఇల్లాలు, గృహిణి, దార, పత్ని లేదా ధర్మపత్ని అంటారు.

తెలుగు భాషలో దార అంటే పెండ్లాము అని అర్ధము.[1] పరదార అనగా a neighbour's wife. దారకొమ్ము అనగా చమరుపోసే పసరపు కొమ్ము. దారపోయు అనగా To endow, to give by a formal ceremony, in which water is poured from the hand of the donor. To bestow as a solemn gift. To lose, పొగొట్టుకొను. దారాపుత్రాదులు అనగా భార్యాబిడ్డలు A family, a household. Lit: Wives, children, and all.

ధర్మపత్నిగా భార్య విధులు

[మార్చు]

షట్కర్మాచరణను చేసే ధర్మపత్నిని గురించిన ఈ శ్లోకాన్ని చూడండి :

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది.

అంటే క్రింది ఆరింటిని కుడా షట్కర్మలు గా చెప్పవచ్చునన్నమాట.

  • ఇంటి పనులు చెయ్యడం
  • మంచి ఆలోచనను ఇవ్వడం
  • చక్కగా అలంకరించుకోవడం
  • కష్ట సమయాలలో ఓర్పుతో ఉండడం
  • ప్రీతిగా భోజనం పెట్టడం
  • పడకటింటిలో ఆనందాన్ని ఇవ్వడం

భార్యపై సామెతలు

[మార్చు]
  • ఆలు మంచిదని అనబోకురన్నా అదివచ్ఛి మనఇంట అణిగియుండేదాక
  • ఆలికి లొంగినవాడు అరగాణిలో పడినవాడు అటిటు ఔతారు
  • ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
  • ఆలికి అదుపు ఇంటికి మదుపు
  • ఆలితో కలహించి ఆకాలికాదని పస్తు పండెడువాడు పంజు వెధవ
  • ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు
  • ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
  • ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట
  • ఆలిని విడిస్తే హరిదాసు సంసారం విడిస్తే సన్యాసి
  • ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం
  • ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే
  • ఆలు ఏడ్చిన ఇల్లు ఎద్దుఏడ్చిన సేద్యం ముందుకురావు
  • ఆలు కుదురైతే చేను కుదురు
  • ఆలుమగల కలహం అన్నం తినేదాకనే
  • ఇంటికి దీపం ఇల్లాలు
  • ఇల్లాలి శుభ్రత ఇల్లు చెబుతుంది
  • ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు
  • భార్యమాట బ్రతుకుబాట
  • భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు
  • ఇల్లాలు గుడ్డిదైతే ఇంటికుండలకు చేటు
  • ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప.

ఏకపత్నీవ్రతం

[మార్చు]

హిందూ పురాణాలలో శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. పన్నెండు శాతం దేశాల్లో ఒకేభార్య సిద్ధాంతాన్ని పాటిస్తారు.

బహుభార్యత్వం

[మార్చు]

బహుభార్యత్వం ఉన్న పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని బ్రిటన్‌లోని షీఫెల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెప్పారు. సాధారణంగా పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. ఏక భార్యత్వం అమలులో ఉన్న దేశాల్లో భార్యలు చనిపోతే భర్తలు మళ్లీ పెళ్ళి చేసుకుంటారని, భర్తలు చనిపోయిన వితంతువులు మ్రాతం మళ్లీ పెళ్ళి చేసుకునే అవకాశం లేదని మళ్లీ పెళ్ళి చేసుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువైందని పరిశోధకులు తెలిపారుఈనాడు 21.8.2008

భార్యా బాధితులు

[మార్చు]
  • వైవాహిక సంబంధాలు, విడాకులు, పిల్లల సంరక్షణ తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని సెక్షన్ 498 (ఎ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. వరకట్న నిషేధచట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు.ఈనాడు 17.8.2009.

భార్యాన్నజీవులు

[మార్చు]

తమ భార్యల కంటే చాలా తక్కువగా సంపాదించే వారు ఎప్పుడూ విచార వదనంలో మునిగి తేలుతుంటారట. తమ భార్యల సంపాదనపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న పురుషులు వారిని మోసగించడంలో ముందుంటారట. ఈనాడు 17.8.2010.

మూలాలు

[మార్చు]

prema unna chota

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=భార్య&oldid=4305720" నుండి వెలికితీశారు