భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో హిందు మతానికి సంబంధించిన దేవాలయాల జాబితా రాష్ట్రాల వారిగా ఈ క్రింద ఇవ్వబడింది. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో దాదాపు 34000 దేవాలయాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్[మార్చు]

యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి యాదగిరి గుట్ట

పంజాబ్[మార్చు]

స్వర్ణ దేవాలయం[మార్చు]

స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

స్వర్ణ దేవాలయం ఉత్తర భారతంలోని పంజాబ్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన అమృతసర్లో ఉంది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది.ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడా వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరుకు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది.ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.

ఆలయ నిర్మాణం

ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ముఖ ద్వారాలున్నాయి. అదే విధంగా నాలుగు వైపులా సిక్కు గురువుల పవిత్ర సమాధులు, వంట శాల, భోజన శాలలు, ఉన్నాయి. అన్నీ పాలరాతి కట్టడాలే. ఈ సరోవరానికి అమృత సరోవరం అని పేరు. ఆ పేరుమీదగానే ఈ ఆలయానికి అమృత సర్ అని పేరు వచ్చింది. సిక్కుల ఐదో గురువైన అర్జున దేవ్ ఈ ఆలయానికి రూప కల్పన చేశారు. ఆలయ నిర్మాణం 1604 లో పూర్తయింది.

ఆలయ సాంప్రదాయం

ఈ ఆలయం లోనికి అన్ని మతస్తులకు ప్రవేశం ఉంది. కాని ప్రతి ఒక్కరు తలపై ఒక విదమైన వస్త్రాన్ని కప్పుకొని ఆలయ ప్రవేశం చేయాలి.

నిత్య అన్నదానం

సందర్శకులందరికి ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతి రోజు సుమారు ఒక లక్ష మందికి అన్నదానము జరుగుతుంది. ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య రెట్టింపు వుంటుంది. ఒక్క రోజు వంటకు 100 క్వింటాళ్ల గోదుమ పిండి, 10 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల నెయ్యి. 5000 లీటర్ల పాలు, వంద గ్యాస్ సిలెండర్లు వినియోగమవుతాయి.

సిక్కుల సాంప్రదాయం

సర్వ జనులను గౌరవించడం, తోటి వారికి సహాయపడటం, మానవత్వంతో ప్రవర్తించడం, న్యాయమైన సంపాదన, ప్రతి రోజు దేవుడిని ప్రార్థించడము, ఖల్సాను స్వీకరించడము మొదలైనవి సిక్కు మతస్తుల సంప్రదాయాలు. కులమాతల కతీతంగా ఇక్కడ సహ పంక్తి భోజనము వుండటము ఇక్కడి ప్రత్యేకత.

మహాబలిపురం[మార్చు]

రాయ వేలూరు కోటలోని జలకంఠేశ్వరాలయం

వెల్లూరు జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మంటపం.
వేలూరు జలకంటేశ్వరాలయం కళ్యాణమంటపంలో పైకప్పు.

రాయ వేలూరు కోటలో వున్న జలకంటేశ్వరాలయం అతి పురాతనమైనది, అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణంలో వున్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్దులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది. దక్షిణ భారత దేశంలో విజయ నగర శిల్ప కళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారన గానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు. అని. వారు కట్టిన అలయాలు అంత విస్త్రుతంగా ఉన్నాయి. వాటిలోని శిల్ప కళ కూడా అంత విశిస్టంగా వుంటుంది. ఆ ఆలయాలలోని కళ్యాణ మంట పాలలోని శిల్ప కళ మరీ అద్భుతంగా వుంటుంది. అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా,, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి, హంపి లోని విఠలాలయంలో కళ్యాణ మండపం, మధురై లోని వేయి స్థంబాల మండపం, తిరునల్వెలి లోని మండపం., కోయంబత్తూరు దగ్గర వున్న పేరూరు మండపం., రాయ వెల్లూరు లోని జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం. ఇవి దక్షిణ భారత దేశంలోనే అత్యంత అందమైన మండపాలు. వీటిలో జలకంటేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా శిల్ప కళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది.ఇది విజయనగరాదీసుడు సదాశివ రాయల కాలంలో కట్ట బడినదిగా చారిత్రిక ఆధారాలున్నాయి. ప్రధాన ఆలయం రాయ వేలూరు కోటలోనే వున్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. ఈకళ్యాణ మండపంలోని శిల్ప కళా రీతులకు ముగ్దులైన బ్రిటిష్ వారు దానిని ఏకీలుకు ఆకీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండన్ లో తిరిగి పున:ప్రతిష్ఠించాలని బావించారు. దానికి తగిన ఏర్పాట్లన్ని చేసు కున్నారు. దీని కొరకు లండన్ నుండి ఒక స్టీమరు కూడా బయలు దేరింది. కాని వారి దురదృష్టమో, భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. ఆ సందర్భంలోనే జరిగిని అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా ఆ శిల్ప కళా కౌశల్యాన్ని మనమీనాడు చూడ గలుగు తున్నాము. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి పక్కనే ఒక మూలన ఉంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇందులో అన్ని కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలున్నాయి. ముందు భాగంలో చుట్టు ప్రహరి గోడ లేదు. ఇందులోనే మధ్యన పైకప్పుకు వున్న శిల్ప కళను బొమ్మలో చూడ వచ్చును. రెండొ భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున ఉంది. ఏ కారణం చేతనో దీని లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించ లేదు. దీని తర్వాత నున్న మూడో భాగం ఇంకొంచెం ఎత్తుగా ఉంది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది. మధ్యలో కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి ఉంది.ఇది మధ్యలో చిన్న వేధికలాగ కనబడుతుంది. స్థంబాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీ దేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత అందంగా చిత్రించి ఉన్నాయి. ఇవి గాక నాట్య గత్తెల, సంగీత కారుల, శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి స్తంభం మీద శిల్ప కళను వివరంగా గమనిస్తే అనేక పురాణ గాథలను స్పురింప జేస్తాయి. ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి వున్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాం చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను, దశరా దిబ్బ ప్రక్కన మైదానంలోను ఉన్నాయి. ఇదొక శిల్ప కళా వైచిత్రి.

వేల్లూరు జలకంఠేశ్వరాలయం ప్రధాన గోపురం.
రాయవేలూరులోని జలకంఠేశ్వర ఆలయ పూర్తి చిత్రం.

జల కంటేశ్వరాలయం: రాయ వెల్లూరు: రాయ వెల్లూరు కోట లోనే వున్న జల కంటేశ్వరాలయము, కోటతో బాటు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత సదా శివ రాయల కాలంలో కట్ట బడింది. విజయ నగర పతనానంతరము ఈ కోట, అందులో భాగమైన ఈ ఆలయము ముస్లింల పాలకులైన ఆర్కాడు నవాబుల పాలన లోనికి వెళ్లింది. అలా చాలకాల మున్నది. ఆ సమయంలో ఈ ఆలయం లోని దేవతా మూర్తులను, శివ లింగాలను ధ్వంసం చేయడమో, లేదా పెకలించి కోట అగడ్తలో పడవేయడమో జరిగింది. వాటిని అగడ్తలో పడవేసి వుంటారనడానికి నిదర్శనంగా అడప దడపా అగడ్తలో దొరికిన శిల్ప ఖండాలే ఆనవాలు. శతాబ్దాలు గడిచి నందున ఆ విగ్రహాలు అగడ్తలోని బురదలో కూరుక పోయి వుంటాయని భావించ బడుతున్నది. అగడ్తలో త్రవ్వకాలు జరిపితే అవి భయట పడవచ్చును. ముస్లిం పాలకుల తర్వాత ఈ కోట బ్రిటిష్ వారి వశమై అలా చాల కాలమున్నది. ఆ సందర్భంలో బ్రిటిష్ వారు కోటను వారి సైనిక కేంద్రంగా మార్చారు. ఇందులోని ఆలయ సముదాయాన్ని, వారి మందు గుండు సామాగ్రికి గోదాముగా వాడు కున్నారు. బ్రిటిష్ వారి కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 వ సంవత్సరంలో రాయ వెల్లూరు కోటను, అందులోనే వున్న మసీదును, జలకంటేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణకు దాన్ని పురావస్తు శాఖకు అప్పగించింది. ఆ విధంగా ఈ జలకంటేశ్వరాలయం కొన్ని శాతాబ్దాల పాటు నిత్య దూప దీప నైవేద్యాలకు నోచుకోక మూసి వున్న కోట గోడల మధ్య వుండి పోయింది.

జలకంటేశ్వరాలయము

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింతర్వాత, ప్రజలు, పుర ప్రముఖులు, ఆలయాన్ని తమ స్వాదీనం చేసుకోడాకి చేయని ప్రయత్నం లేదు. మతాచార్యులు అనేక ఉద్యమాలు, వత్తుడులు చేసినా ఫలితం కనబడలేదు. ఇది మత సంబందమైన సున్నిత విషయమని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చునని భావించి భారత దేశ అధ్యక్షులు గాని, భారత ప్రధాని గాని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు గాని ఈ విషయంలో ఏమి చేయ లేక పోయారు. చివరకు 1981వ సంవత్సరంలో జిల్లా కలెక్టరు వ్వక్తిగత మద్దతుతో, మైలారు గురూజి సుందర స్వామి, తంజావూరు రామనందేద్ర సరస్వతి స్వామి వారి మద్దతుతో వెల్లూరు పట్టణ ప్రముఖులు రహస్యంగా బయట ఒక గుడిలో వున్న శివ లింగాన్ని తెచ్చి జలకంటేశ్వరాలయంలో ప్రతిష్ఠించి పూజ కార్యక్రమాలు నిర్వ హించాలని రహస్య పథకాన్ని రచించారు. ఆ పధకంలో భాగంగా 1981 మార్చి 16 వ సంవత్సరంలో వేరే గుడిలో వున్న శివ లింగాన్ని మూసి వుంచిన ఒక లారీలో తెచ్చి సిద్దంగా వుంచు కున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా సుమారు రెండు వేలమంది పుర ప్రముఖులు అక్కడ గుమి గూడి లారి లోనుండి శివ లింగాన్ని దించి కోటలోని ఆలయంలోనికి ప్రవేశించి లింగాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేసేశారు. ఉన్నట్టుండి జరిగిన ఈ వ్వవహారాన్ని పోలీసులు గాని, భారత స్వాతంత్ర్యానంతరము రాయ వెల్లూరు ప్రజలు, ఇతర మత పెద్దలు, ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు, నిత్య దూప దీప నైవేద్యం చేయడాని చేయని ల్లా కలెక్టరు గాని అడ్డుకోలేక పోయారు. పురా వస్తు శాఖ వారు ఈ సంఘటనను పోలీసులకు, జిల్లా కలెక్టరు పిర్యాదు చేయడం తప్ప ఏమి చేయ లేక పోయారు. ఆ తర్వాత కూడా ఇది సున్నితమైన మత సంబందిత విషయమైనందున, దాంతో ఏదైన శాంతి భద్రతల సమస్యలు పుట్టుకొస్తాయనే భయంతో అధికారులు ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ తర్వాత మతాచార్యుల మద్దతుతో ఆలయ ప్రాంగణంలో అన్ని గర్బగుడులలో విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. ఆ విధంగా వేలూరు పుర ప్రజలు తమ అనేక ఉద్యమాల ఫలితంగా శతాబ్దాల తరబడి మూసి వున్న చీకటి కోటలో మగ్గిన ఈ చారిత్రిక జలకంటేశ్వరాలయాన్ని భక్తులకు ప్రజలకు అందుబాటు లోనికి తెచ్చారు. ఎన్నో చారిత్రిక సంఘటనలకు ఆలవాలమైన ఈ రాయ వెల్లూరు కోట, అందులోని ఈ ఆలయము నకు సంబంధించిన ఈ పున: ప్రతిష్ఠ సంఘటన కూడా దాని చరిత్రలో ఒక భాగమై పోయింది.

మూలం: శ్రీ ఎ.కె.శేషాద్రి, రచించిన "వెల్లూరు ఫోర్టు అండ్ ది టెంపుల్ త్రూ థి ఏజెస్" అనే గ్రంథం. వ్వక్తిగత సందర్శన.

శ్రీ రంగ క్షేత్రం[మార్చు]

(శ్రీరంగం) నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అతి ముఖ్యమైనది. ఈ క్షేత్ర దర్శనంతో 108 క్షేత్రాల దర్శన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం.ఐదు వేల సంవత్సరాలకు ముందు కట్టిన ఈక్షేత్రం చోళుల, పాండ్యుల, హోయసలల, విజయనగర రాజుల కాలంలో విశిష్ట ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయ రాజ గోపురము ఎత్తు 230 అడుగుల ఎత్తుకు పైనే వుంటుంది. ఈ ఆలయానికి పదమూడు ద్వారాలు, ఏడు ప్రాకారాలు వుండటము విశేషము.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]