అక్షాంశ రేఖాంశాలు: 19°01′01″N 72°49′49″E / 19.016920°N 72.830409°E / 19.016920; 72.830409

సిద్ధి వినాయక దేవాలయం (ముంబై)

వికీపీడియా నుండి
(సిద్ధి వినాయక దేవాలయం,ముంబై నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సిద్ధి వినాయక దేవాలయం
సిద్ధి వినాయక దేవాలయం,ముంబై (మహారాష్ట్ర,ఇండియా)
సిద్ధి వినాయక దేవాలయం is located in Maharashtra
సిద్ధి వినాయక దేవాలయం
సిద్ధి వినాయక దేవాలయం
Location in Maharashtra
భౌగోళికాంశాలు:19°01′01″N 72°49′49″E / 19.016920°N 72.830409°E / 19.016920; 72.830409
పేరు
స్థానిక పేరు:సిద్ధి వినాయక మందిర్
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:ముంబై
ప్రదేశం:ప్రభాదేవి
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వినాయకుడు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
నవంబరు 19, 1801
నిర్మాత:లక్ష్మణ్ వితు, దూబాయ్ పాటిల్
వెబ్‌సైటు:http://siddhivinayak.org
ముంబై సిద్ధి వినాయక మందిరం

సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్ర లోని ముంబయి లోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు.[1] ఈ దేవాలయం నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు అంరియు దూబాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం.[2] ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువ. మంగళ వారం నాడు సుమారు డెబ్బై వేలమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రతి ఏడు కానుకలుగా పది కోట్లకు పైగా వస్తుంటుంది. ఈ ఆలయ సంపద విలువ మూడు వందల యాబై కోట్ల రూపాయలు పైగానే ఉంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాల క్రమంలో ఆరు అంతస్తులతో ఉంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించారు. ఆగ్రిసమజ్ కు చెందిన దూబె పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని కట్టించింది. పిల్లలు కలగని మహిళలు ఈ స్వామి వారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసము. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయం ప్రత్యేకత. ఒకచేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖ వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం చేయడం జరిగింది.

చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయం నబంబరు 19 1801 న నిర్మించబడింది. దీని వాస్తవ నిర్మాణం చాలా చిన్నదిగా 3.6మీ x 3.6 మీ కొలతలుగా ఉన్న చతురస్రాకార స్థలంలో శిఖరాన్ని కలిగి యుండే నిర్మాణంగా యుండెడిది. ఈ దేవాలయం లక్ష్మణ్ వితుల్ పాటిల్ అనే కాంట్రాక్టరుచే నిర్మించబడింది. ఈ దేవాలయానికి నిధులను ధనవంతురాలైన అగ్రి మహిళ అయిన దెబాయ్ పాటిల్ చే సమకూర్చబడినవి. ఆమెకు సంతానం లేరు.

మూలాలు

[మార్చు]
  1. "Shree Siddhivinayak Mandir". Amazing Maharashtra.
  2. "The Birth of Shree Siddhivinayak Ganapati". Archived from the original on 2015-05-27. Retrieved 2015-08-22.

ఇతర లింకులు

[మార్చు]