కుడుము
Jump to navigation
Jump to search
మూలము | |
---|---|
మూలస్థానం | భారతదేశం |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | డెజర్ట్ |
ప్రధానపదార్థాలు | వరిపిండి లేదా గోధుమపిండి, మైదా పింది, కొబ్బరి,బెల్లం |
కుడుం అనేది ఒక ఆహార పదార్థం. వినాయకుడికి ఇష్టమైన ఆహారం. వినాయక చవితికి ఇవి నైవేద్యంగా పెడతారు.[1] వీటినే ఉంఢ్రాళ్ళు అని కూడా వ్యవహరిస్తారు.
వినాయక చవితి రోజున కుడుములు నైవేద్యంగా పెట్టడం సంప్రదాయం. ఉండ్రాళ్లు, కుడుములంటే వినాయకుడికి ప్రీతికరం.[2]
కావాల్సిన పదార్థాలు[మార్చు]
- బియ్యం రవ్వ : 1 గ్లాస్,
- కొబ్బరి తరుం : 1 కప్,
- శనగపప్పు : 2 టేబుల్ స్పూన్,
- ఉప్పు : తగినంత
తయారీ విధానం[మార్చు]
ముందుగా ఓ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టవ్‌పై పెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా రవ్వ కలపాలి. రవ్వ, శనగపప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత క్రిందకు దించి కొబ్బరి తురుమును చల్లాలి. చల్లారిన తరువాత ఉండలు చుట్టుకుని ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి ఆవిరి మీద ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే కుడుములు తయారవుతాయి.[3]
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Undrallu Recipe: విఘ్నాధిపతికి ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యం". Samayam Telugu. Retrieved 2020-04-19.
- ↑ Kumar, Raj (2019-08-29). "వినాయక చవితి స్పెషల్.. బెల్లం కుడుములు తయారీ విధానం". telugu news | Manalokam.com. Retrieved 2020-04-19.
- ↑ http://www.prajasakti.com/Article/Pickles/2166059