కుడుం
స్వరూపం
మూలము | |
---|---|
మూలస్థానం | భారతదేశం |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | డెజర్ట్ |
ప్రధానపదార్థాలు | వరిపిండి లేదా గోధుమపిండి, మైదా పింది, కొబ్బరి,బెల్లం |
కుడుం అనేది ఒక ఆహార పదార్థం. వినాయకుడికి ఇష్టమైన ఆహారం. వినాయక చవితికి ఇవి నైవేద్యంగా పెడతారు.[1] వినాయక చవితి రోజున కుడుములు నైవేద్యంగా పెట్టడం సంప్రదాయం. ఉండ్రాళ్లు, కుడుములంటే వినాయకుడికి ప్రీతికరం. కుడుము అంటే ఓ పేద్ద సైజు పలుచని ఇడ్లీ అని చెప్పవచ్చు. కొన్నిచోట్ల దీనినే తట్ట ఇడ్లీ అని పిలుస్తారు.[2]
కావాల్సిన పదార్థాలు
[మార్చు]- బియ్యం రవ్వ: 1 గ్లాస్,
- కొబ్బరి తరుం: 1 కప్,
- శనగపప్పు: 2 టేబుల్ స్పూన్,
- ఉప్పు: తగినంత
తయారీ విధానం
[మార్చు]ముందుగా ఓ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టవ్‌పై పెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా రవ్వ కలపాలి. రవ్వ, శనగపప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత క్రిందకు దించి కొబ్బరి తురుమును చల్లాలి. చల్లారిన తరువాత ఉండలు చుట్టుకుని ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి ఆవిరి మీద ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే కుడుములు తయారవుతాయి.[3]
మినప కుడుము (ఆవిరి కుడుము)
[మార్చు]- మూడు గంటలముందు మినపప్పు నానబెట్టి కడిగి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి.
- ఒక గిన్నెలో నీళ్ళుపోసి దానికి పల్చటి గుడ్డ కట్టాలి. దీనినే వాసం కట్టడం అంటారు.
- రుబ్బిన మినప్పిండిలో ఉప్పు కలిపి దీనిని ఆ వాసం కట్టిన గుడ్డమీద వేసి ఫైన ఒక మూతపెట్టాలి.
- స్టవ్ వెలిగించి దానిమీద ఈ గిన్నె పట్టి పదిహేనునిముషాలు ఉడికించాలి.
- గిన్నెలోని నీళ్ళు మరుగుతుంటే ఆ ఆవిరికి మినపకుడుము ఉడుకుతుంచి. దీనినే ఆవిరి కుడుము అంటారు.
- దీనిలో బెల్లం, నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదా చెట్నితో తినొచ్చు.
ఇది బలవర్ధకమయిన ఆహారం.[4]
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Undrallu Recipe: విఘ్నాధిపతికి ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యం". Samayam Telugu. Retrieved 2020-04-19.
- ↑ Parakala, Suryamohan (2024-03-01). "కుడుముల్ని చింతకాయ పచ్చడితో ఎపుడైనా తిన్నారా… భలే కాంబినేషన్". telangana.thefederal.com. Retrieved 2024-05-03.
- ↑ http://www.prajasakti.com/Article/Pickles/2166059
- ↑ "మినప కుడుము (ఆవిరి కుడుము) (Aviri Kudumu or Minapa Kudumu in Telugu)". మా వంటగది. Retrieved 2024-05-03.
ఇరత లింకులు
[మార్చు]- "గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము | Sakshi". www.sakshi.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-05-03.
- ఆవిరి కుడుము తయారి విధానం|| Aviri Kudumu || How To Make Aviri Kudumu ||Traditional Aviri kudumu Reci, retrieved 2024-05-03
- ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆవిరి కుడుము- aaviri kudumu | Indian food | healthy breakfast | how to, retrieved 2024-05-03