కాణిపాకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాణిపాకం వినాయక దేవాలయం
కాణిపాకం వినాయక దేవాలయం is located in Andhra Pradesh
కాణిపాకం వినాయక దేవాలయం
కాణిపాకం వినాయక దేవాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం
భౌగోళికాంశాలు:13°16′37″N 79°2′7″E / 13.27694°N 79.03528°E / 13.27694; 79.03528Coordinates: 13°16′37″N 79°2′7″E / 13.27694°N 79.03528°E / 13.27694; 79.03528
పేరు
స్థానిక పేరు:శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:Andhra Pradesh
ప్రదేశం:కాణిపాకం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వినాయకుడు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
11వ శతాబ్దం
వెబ్‌సైటు:kanipakam.com
కాణిపాకం
—  రెవిన్యూ గ్రామం  —
కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి
కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఐరాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,960
 - పురుషుల 2,500
 - స్త్రీల 2,460
 - గృహాల సంఖ్య 1,267
పిన్ కోడ్ 517131
ఎస్.టి.డి కోడ్: 08585

ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.[1]ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.[2] చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

గణాంకాలు[మార్చు]

 • జనాభా (2011) - మొత్తం 4,960 - పురుషుల 2,500 - స్త్రీల 2,460- గృహాల సంఖ్య 1,267
 • జనాభా (2001) - మొత్తం 3,963 - పురుషుల 2,022 - స్త్రీల 1,941 - గృహాల సంఖ్య 882
 • మండల కేంద్రము. ఏర్పేడు
 • జిల్లా: చిత్తూరు
 • ప్రాంతము: రాయలసీమ.
 • భాషలు: తెలుగు/ ఉర్దూ
 • టైం జోన్: IST (UTC + 5 30)
 • వాహన రిజిస్ట్రేషను. నెం: AP-03
 • సముద్ర మట్టానికి ఎత్తు: 398 మీటర్లు.
 • విస్తీర్ణము: 729 హెక్టార్లు
 • మండలములోని గ్రామాల సంఖ్య: 27

సమీప గ్రామాలు[మార్చు]

[3] కొత్తపల్లె 1 కి.మీ. చిగరపల్లె 1 కి.మీ. కొత్తపల్లె 2 కి.మీ. ఉత్తర బ్రాహ్మణ పల్లె 2 కి.మీ. పట్నం 2 కి.మీ. దూరములో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

బస్సు సౌకర్యములు
తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.
విమాన సౌకర్యములు
తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

పాఠశాలలు[మార్చు]

ఈ గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి

 1. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం (నాగుపాము) తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.[4]
 2. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు.
 3. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది
 4. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయములతో నిండి ఉంది.

ప్రధాన పంటలు[మార్చు]

చెరకు, వరి, మామిడి, వేరుశనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాధార పనులు, వ్యాపారము.

ఇతర "విశేషాలు", ఆలయాలు[మార్చు]

కాణిపాకం ఆలయ సమూహము

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది[4] ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

భౌగోళికం, జనాభా[మార్చు]

కాణిపాకంఅన్నది చిత్తూరు జిల్లాకు చెందినా ఐరాల తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1267 ఇళ్లతో మొత్తం 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన చిత్తూరు 12 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2500, ఆడవారి సంఖ్య 2460గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1531 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596496[1].

అక్షరాస్యత[మార్చు]

 • మొత్తం అక్షరాస్య జనాభా: 3538 (71.33%)
 • అక్షరాస్యులైన మగవారి జనాభా: 1975 (79.0%)
 • అక్షరాస్యులైన స్త్రీల జనాభా: 1563 (63.54%)

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రైవేటు మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలు, ఉన్నాయి. సమీప బాలబడి, అనియత విద్యా కేంద్రం (ఐరాలలో), సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (చిత్తూరులో), వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థ తిరుపతిలో,, పాలీటెక్నిక్, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల,, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.[5]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 అలోపతీ ఆసుపత్రి, 1 మామూలు ఆసుపత్రి, ఉన్నాయి.సమీప పశు వైద్యశాల, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో ఉంది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణా కేంద్రం, టి.బి వైద్యశాల, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 2 మందుల దుకాణాలులు ఉన్నాయి.

త్రాగు నీరు[మార్చు]

గ్రామములో రక్షిత మంచి నీరు ఉంది. మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల చెరువు/కొలను/సరస్సు నుంచి కూడా నీటిని వినియోగిస్తున్నారు.

పారిశుధ్యం[మార్చు]

తెరిచిన డ్రైనేజీ గ్రామంలో ఉంది. డ్రెయినేజీ నీరు నేరుగా నీటి వనరుల్లోకి వదిలివేయబడుతోంది. పూర్తి పారిశుధ్య పథకం కిందకు ఈ ప్రాంతం వస్తుంది.

సమాచార, రవాణా సౌకర్యాలు సౌకర్యం[మార్చు]

ఈ గ్రామములో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం, పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, ప్రైవేటు కొరియర్ సౌకర్యం, పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, టాక్సీ సౌకర్యం, ట్రాక్టరు మున్నగునవి ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం, సమీప రైల్వే స్టేషన్, ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి. సమీప జాతీయ రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. సమీప రాష్ట్ర రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామం ఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

ఈ గ్రామములో ఏటియం, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ ఋణ సంఘం, స్వయం సహాయక బృందం, వారం వారీ సంత, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములో ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), సినిమా / వీడియో హాల్, ఇతర (పోషకాహార కేంద్రం), ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), పబ్లిక్ రీడింగ్ రూం, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, వార్తాపత్రిక సరఫరా, జనన మరణాల నమోదు కార్యాలయాలు ఉంది.

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామములో విద్యుత్ సరఫరా విద్యుత్తు ఉంది.

భూమి వినియోగం[మార్చు]

గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో):

* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 93.89
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 114.12
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10.12
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 6.47
* బంజరు భూమి: 2.43
* నికరంగా విత్తిన భూ క్షేత్రం: 501.97
* నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 434.38
* నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 76.49[5]

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో): బావులు/గొట్టపు బావులు: 76.49

తయారీ[మార్చు]

ఈ గ్రామంలో ఈ కింది వస్తువులను ఉత్పత్తి అవుతున్నవి (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో): చెరకు, బెల్లం, వేరుశనగ వర్గం:చిత్తూరు వర్గం:ఐరాల మండలంలోని గ్రామాలు) వర్గం:జిల్లా గ్రామాలు)

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Lists of the antiquarian remains in the presidency of Madras
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2014-03-21.
 3. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Irala/Kanipakam". Retrieved 14 June 2016. External link in |title= (help)
 4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 25 నవంబర్ 2016. Retrieved 23 November 2016. Check date values in: |archive-date= (help)
 5. 5.0 5.1 https://github.com/IndiaWikiFiles/Andhra_Pradesh/blob/master/Chittur-Villages-Telugu/Kanipakam_596496_te.wiki
"https://te.wikipedia.org/w/index.php?title=కాణిపాకం&oldid=3065046" నుండి వెలికితీశారు