చెవుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చెవిటితనం
వర్గీకరణ & బయటి వనరులు
The International Symbol for Deafness
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 19942
MeSH {{{m:en:MeshID}}}

చెవుడు, చెముడు లేదా చెవిటితనం (Deafness or Hearing impairment) అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం.[1] దీనికి చాలా విధాల జీవసంబంధ మరియు పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.

Sound waves vary in amplitude and in frequency. Amplitude is the sound wave's peak pressure variation. Frequency is the number of cycles per second of a sinusoidal component of a sound wave. Loss of the ability to detect some frequencies, or to detect low-amplitude sounds that an organism naturally detects, is a hearing impairment.

చెముడు రకాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
  • అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
  • మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .

వినికిడి యంత్రాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
  • చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు
  • వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌

గుర్తించే పరీక్షలు[మూలపాఠ్యాన్ని సవరించు]

వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు). వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).

  • బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
  • ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
  • ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు.

మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

"https://te.wikipedia.org/w/index.php?title=చెవుడు&oldid=1181851" నుండి వెలికితీశారు