బావి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నైలోని మంచినీటి బావి.

బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.

బావులలో రకాలు

[మార్చు]
  • ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
  • దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
  • గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నాయి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
  • గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.
భద్రాచలం దగ్గర సారపాక గ్రామంలోషిర్డీ సాయిబాబా దేవాలయంలోని బావి.

మూలాలు

[మార్చు]
  • Driscoll, F. (1986). Groundwater and Wells. St. Paul, MN: Johnson Filtration Systems, second edition. ISBN 978-0-9616456-0-1
"https://te.wikipedia.org/w/index.php?title=బావి&oldid=3120078" నుండి వెలికితీశారు