గొట్టపు బావి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచినీరు కోసం వేస్తున్న బోరు బావి, బోరుబండి లోపలికి పంపిస్తున్న గాలి ఒత్తిడికి పైకి చిమ్మిస్తున్న నీరు
బోరు వేసిన తరువాత పంపు బిగించేంత వరకు దానిలో ఏమి పడకుండా ఉండేందుకు డమ్మీ బిగిస్తారు.
బోరు బావి లేదా చేతి పంపు

భూగర్భజలం కోసం భూమిలోనికి వేసే బోరును బోరుబావి అంటారు. సాధారణంగా బోరుబావిని బోరు అని కూడా వ్యవహరిస్తారు. బోరు అనగా చాలా పొడవైన రంధ్రము. నీటి కోసం భూమిలోనికి చాలా పొడవైన రంధ్రం వేయటం ద్వారా ఏర్పరచుకున్న బావి కనుక ఈ బావిని బోరుబావి అంటారు. బోరుబావులను త్రవ్వేందుకు ఉపయోగించే వాహనాలను బోరుబండ్లు అంటారు. బోరు వేసే ప్రాంతాన్ని బట్టి, వేయవలసిన లోతును బట్టి వివిధ రకాల బోరుబండ్లను ఉపయోగిస్తారు. బోరు బావి గుండ్రంగా, చాలా లోతుగా ఉంటుంది, దీని వ్యాసం సాధారణంగా 5 నుంచి 8 అంగుళాలు ఉంటుంది. వీటి లోతు సాధారణంగా భూగర్భజలం లభించే లోతును బట్టి ఉంటుంది. భూగర్భజలం తక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు తక్కువగాను, భూగర్భజలం ఎక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు ఎక్కువగాను ఉంటుంది. వీటి లోతు సాధారణంగా 100 నుంచి 200 అడుగుల లోతు ఉంటాయి, కాని కొన్ని చోట్ల వీటి లోతు 500 అడుగుల కన్నా ఎక్కువ లోతుంటాయి. బోరుబావిలోని నీటిని వాడుకునేందుకు పైకి రంపించడానికి సాధారణంగా కొట్టుడు పంపులు, విద్యుత్ పంపులు ఉపయోగిస్తారు.

ప్రదేశం ఎంపిక[మార్చు]

బోరు బావిని సాధారణంగా ఈశాన్యంలో వేస్తారు. దాదాపు అన్ని ఇండ్లలో ఈశాన్యం దిక్కులోనే బోరుబావి ఉంటుంది. పొలాలలో కూడా బోరు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఈశాన్యానికే, కానీ, కొన్ని ఉపయోగాల దృష్ట్యా, భూగర్భజల నీటి లభ్యత దృష్ట్యా మార్పు జరుగుతుంది.

విఫలం[మార్చు]

కొన్ని ప్రాంతాలలో కొద్ది కొద్ది దూరంలోనే, కొన్ని మీటర్ల దూరంలోనే భూగర్భజలం లభ్యతలో తేడాలుంటాయి. కొన్ని బోరుబావులలో చాలా ఎక్కువ నీరు లభించగా, కొన్నింటిలో చాలా తక్కువ నీరు లభించడం, లేదా అసలు నీరు లభించకపోవడం జరుగుతుంది. వేసిన బోర్లలో అసలు నీరు పడకపోవడం, లేదా అవసరమయినంత నీరు పడకపోవడం జరుగుతుంది, ఇటువంటి బోర్లను తిరిగి పూడ్చివేస్తారు. అలా పూడ్చకుండా వదిలేస్తే, పిల్లలు, చిన్నపాటి జంతువులూ ఆ బావిలో పడిపోయే ప్రమాదముంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]