Jump to content

ఎకరం

వికీపీడియా నుండి
అమెరికాలోని ఫుట్బాల్ మైదానంలో ఎకరా విస్తీర్ణం కొలత

ఎకరం ఇంపీరియల్, యుఎస్ కొలమాన వ్యవస్థలలో ఉపయోగించే భూభాగం యూనిట్ . ఇది ఒక చైన్ వెడల్పు, ఒక ఫర్లాంగు పొడవూ ఉన్న ప్రదేశాన్ని ఎకరం అని అంటారు. ఇది ఖచ్చితంగా 10 చదరపు చైన్లకు సమానం. 1⁄640 చదరపు మైలుకు, లేదా 43,560 చదరపు అడుగులకూ సమానం. సుమారు 4,047 m2 కు సమానం. ఇది హెక్టారులో 40%. ఎకరానికి గుర్తించబడిన ఒక చిహ్నం ac, [1] కానీ "ఎకరం" అనే పదాన్ని కూడా చిహ్నంగా ఉపయోగిస్తారు. [2]

భారతదేశంలో, నివాస స్థలాలను చదరపు అడుగులలో కొలుస్తారు. వ్యవసాయ భూమిని ఎకరాలలో కొలుస్తారు. శ్రీలంకలో ఎకరాన్ని 160 పెర్చి లుగా లేదా 4 రూడ్‌ లుగా విభజించారు. పాకిస్తాన్లో, రెసిడెన్షియల్ ప్లాట్లను కనాల్ (20 మార్లా = 1 కనాల్ = 500 చదరపు గజాలు) లో కొలుస్తారు. బహిరంగ / వ్యవసాయ భూమి కొలత ఎకరాలలో (25 కనాల్ = 1 ఎకరం), మురాబా (8 ఎకరాలు = 1 మురాబా = 200 కనాల్స్) లలో, జెరిబ్, విస్వా, గుంట లలో కొలుస్తారు.

సమాన కొలతలు

[మార్చు]

ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు)

ఒక ఎకరానిక్ 43, 560 చదరపు అడుగులు

ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.

ఒక ఎకరానికి 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)

ఒక ఎకరానికి 605 అంకణములు.

ఒక ఎకరానికి 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం.

40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు) . 121 గజములు ఒక గుంట.

66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం

సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడుగులు = ఒక ఎకరం

2.47 ఎకరాలు ఒక హెక్టారు.

ఒక హెక్టారుకు 2 ఎకరాల 47 సెంట్లు

మూలాలు

[మార్చు]
  1. Fenna, Donald (2002). Dictionary of Weights, Measures and Units. Oxford University Press. p. 4. ISBN 0-19-860522-6.
  2. National Institute of Standards and Technology (n.d.) General Tables of Units of Measurement. Archived 26 నవంబరు 2006 at the Wayback Machine.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎకరం&oldid=3262041" నుండి వెలికితీశారు