హెక్టారు
(హెక్టార్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
హెక్టారు (Hectare) అనేది కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. దీనిని తరచుగా భూమి యొక్క విస్తీర్ణమును లేదా చాలా పెద్ద భవనాలను కొలతలలో తెలుపుటకు ఉపయోగిస్తారు. ఒక హెక్టారుకు పదివేల చదరపు మీటర్లు. ఇది 2.47 ఎకరాలకు సమానం. 100 హెక్టార్లు అనగా ఒక చదరపు కిలోమీటరు. కాబట్టి 200 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న పొలంలో 2 చదరపు కిలోమీటర్ల పొలాలు ఉంటాయి. హెక్టార్ అనే పదానికి 100 అరేస్ అని అర్ధం. హెక్టో అంటే 100 సార్లు అని అర్థానిచ్చే మెట్రిక్ సిస్టమ్ యొక్క ఉపసర్గ. ఆరె (Are) అనేది 100 చదరపు మీటర్లకు సమానమైన విస్తీర్ణానికి కొలత యొక్క మెట్రిక్ సిస్టమ్ యూనిట్. ఒక వైపు 100 మీటర్ల పొడవు కలిగిన చదరపు భూమి ఒక హెక్టార్.
- ఒక హెక్టారు = పదివేల చదరపు మీటర్లు
- ఒక హెక్టారు = 100 అరేస్
- ఒక హెక్టారు = 100 చదరపు మీటర్లు × 100 చదరపు మీటర్లు
- ఒక హెక్టారు = 2.47 ఎకరాలు
- ఒక హెక్టారు = 247 సెంట్లు (249.56 సెంట్లు)