ప్రమాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక భౌతిక రాశిని దేనితో నయినా సరి పోల్చేందుకు వాడే, అదే భౌతిక రాశియొక్క "ప్రామాణిక నిర్దేశాన్ని" ఆ భౌతికరాశిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం (Unit) అంటారు. పొడవును కొలవడానికి వినియోగించే ప్రమాణం పేరు మీటర్. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పేరు సెకండ్.

ప్రాథమిక, ఉత్పన్న ప్రమాణాలు[మార్చు]

భౌతిక రాశులు రెండు విధాలు.

  1. ప్రాథమిక భౌతిక రాశులు (Fundamental physical quantities) - ఇతర భౌతిక రాశులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా మనగలిగేవి. వీటిని ఆధార రాశులు అని కూడా అంటారు. ఉదాహరణకు పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, కాలం వంటివి. ఒకదానినుండి మరొకటి ఉత్పాదించడానికి వీలు లేకుండా వాటిని వేరు వేరు ప్రమాణాలుగా విడగొట్టడానికి వీలు లేని ప్రమాణాలు ప్రాథమిక ప్రమాణాలు
  2. ఉత్పన్న భౌతిక రాశులు (derived physical quantities) - ప్రాథమిక భౌతిక రాశూలనుండి ఉత్పాదించగలిగేవి. ఉదాహరణకు వైశాల్యం (పొడవు నుండి ఉత్పన్నం), వడి (పొడవు మరియు కాలం నుండి ఉత్పన్నం). బలం, సాంద్రత వంటివి కూడా ఉత్పన్న భౌతిక రాశులే. ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.

ప్రమాణాల వ్యవస్థలు[మార్చు]

ప్రాథమిక రాశులు అయిన పొడవు, ద్రవ్యరాశి, కాలం కొలిచేందుకు మూడు ప్రమాణ వ్యవస్థలున్నాయి. అవి "F.P.S. వ్యవస్థ" (బ్రిటిష్ పద్ధతి),"C.G.S. వ్యవస్థ" (మెట్రిక్ పద్ధతి),"M.K.S. వ్యవస్థ". ఈ వ్యవస్థలలో ప్రాథమిక ప్రమాణాలు క్రింది పట్టికలో చూపబడినాయి.

వ్యవస్థ పొడవు ప్రమాణం ద్రవ్యరాశి ప్రమాణం కాలం ప్రమాణం
F.P.S. అడుగు పౌండ్ సెకన్
C.G.S. సెంటీమీటర్ గ్రాము సెకన్
M.K.S. మీటర్ కిలోగ్రాము సెకన్

వినియోగంలోని సౌకర్యం కోసం, మరియు సమాచార సౌలభ్యం కోసం, అయోమయానికి తావులేకుండా ఉండడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలను నిర్దేశించడానికి Gerneral COnference on Weights and Measures (GCGPM) అనే సంస్థకు అధికారం ఇచ్చారు. ఈ సంస్థ 1971లో ఒక "ప్రామాణిక వ్యవస్థ"ను రూపొందించింది. దీనినే అంతర్జాతీయ ప్రామాణిక వ్యవస్థ అంటాఱు. ఫ్రెంచి భాషలో ఈ వ్యవస్థ పేరు Le Systeme International d' units. దానిని క్లుప్తంగా SI వ్యవస్థఅంటారు.

ప్రాథమిక ప్రమాణాలు[మార్చు]

SI వ్యవస్థలో మొత్తం ఏడు ప్రాథమిక భౌతిక రాశులను ప్రాథమిక (ఆధార) రాశులుగా తీసుకొన్నారు. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్ ప్రవాహం, ఉష్ణగతిక ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, పదార్ధరాశి. ఇవి కాకుండా మరో రెండు రాశులను "సంపూరక ప్రాథమిక రాశులు"గా తీసుకొన్నారు. అవి సమతల కోణం, ఘనకోణం.

ప్రాథమిక భౌతిక రాశి ప్రమాణం ప్రమాణ సంకేతం
పొడవు మీటరు m
ద్రవ్యరాశి కిలోగ్రాము kg
కాలం సెకను s
విద్యుత్ ప్రవాహం ఆంపియర్ A
ఉష్ణగతిక ఉష్ణోగ్రత కెల్విన్ K
కాంతి తీవ్రత కేండిలా cd
పదార్ధరాశి మోల్ mol
సంపూరక ప్రాథమిక భౌతిక రాశి ప్రమాణం ప్రమాణ సంకేతం
సమతల కోణం రేడియన్ rad
ఘనకోణం స్టెరేడియన్ sr

ఉత్పన్న ప్రమాణాలు[మార్చు]

,l,,',l

మరి కొన్ని విశేషాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రమాణం&oldid=1956317" నుండి వెలికితీశారు