అక్షాంశ రేఖాంశాలు: 17°21′53″N 78°32′52″E / 17.364693°N 78.547896°E / 17.364693; 78.547896

అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ashtalakshmi Temple
అష్టలక్ష్మీ దేవాలయం
Ashtalakshmi Temple అష్టలక్ష్మీ దేవాలయం is located in Telangana
Ashtalakshmi Temple అష్టలక్ష్మీ దేవాలయం
Ashtalakshmi Temple
అష్టలక్ష్మీ దేవాలయం
తెలంగాణలో ప్రదేశం
భౌగోళికాంశాలు:17°21′53″N 78°32′52″E / 17.364693°N 78.547896°E / 17.364693; 78.547896
పేరు
స్థానిక పేరు:అష్టలక్ష్మీ దేవాలయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:హైదరాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:లక్ష్మీ
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1996

అష్టలక్ష్మీ దేవాలయం భారత దేశము లోని తెలంగాణ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ప్రధాన దైవంగా గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

హిందూ పురాణాల ప్రకారం, ఈ దేవత ధన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువుల హృదయాల్లో స్థిరపడింది. కానీ కొన్ని దేవాలయాలు మాత్రమే లక్ష్మీ యొక్క ఎనిమిది రూపాలతో కూడుకొని అష్టలక్ష్మీ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినవి.

చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయం ఏప్రిల్ 1996 లో కంచి కామకోటి పీఠం వారి అధ్వర్యంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధమైనది. ఇది దిల్‌సుఖ్ నగర్, ఎల్.బి.నగర్ ల మధ్య కొత్తపేట (ఎన్.హెచ్.5) దగ్గరలో గల వాసవి కాలనీలో ఉంది.

నిర్మాణశైలి

[మార్చు]

ఈ దేవాలయ డిసైన్, వాస్తుశైలులను చెన్నై నుండి తీసుకొనడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో అనేక మార్పులు చేయడం జరిగింది. ఈ దేవాలయం సమష్టి కృషికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ దేవాలయ నిర్మాణంలో అనేక మంది ప్రజలు విరాళాలనందించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు ఐదు సంవత్సరాల కాలం పట్టినది. ఈ దేవాలయ ప్రస్తుత రూపంలోనికి రావడానికి నిర్మాణ ఖర్చు 10 మిలియన్ల రూపాయలు అయినది.

ప్రసిద్ధ నిర్మాణ శిల్పి పద్మశ్రీ ఎస్.ఎం.గణపతి, ఎం.మతియాలగన్ స్థపతులు ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. సుమారు 134 విగ్రహాలు ఈ దేవాలయ మహాగోపురంలో నెలకొల్పబడినవి.

ఈ దేవాలయం ఇసుక, సిమెంటులతో నిర్మించినప్పటికీ దీని నిర్మాణ శైలి అది రూపొందించిన కళాకారుల విశేష ప్రతిభను కనబరుస్తుంది. ఈ దేవాలయంలో గల విగ్రహాలలో ఆదిలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ, ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ, వరలక్ష్మీ ప్రధానమైనవి. ఈ దేవతలు అలంకరణలను బంగారు, కాసులపేర్ల హారాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించినవారిలో కొందరు విగ్రహాల శిల్పకళ, అలంకరణలను గూర్చి ప్రస్తుతిస్తే మరికొంత మంది ఆ ఆలయ గోపురంలో గల వివిధ విగ్రహాలను గూర్చి ప్రస్తుతిస్తారు.

ఈ దేవాలయ పరిథిలో సుమారు 15 మిలియన్ల రూపాయలతో ఒక కళ్యాణ మంటపం, అర్చకుల నివాసం కోసం అర్చక నిలయం నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.

రాత్రి వేళలలో ఈ దేవాలయం విద్యుద్దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుండి వీక్షించేటప్పుడు పాలరాతి నిర్మాణంలా కనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]

గ్యాలరీ

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]