హర్మందిర్ సాహిబ్
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హర్మందిర్ సాహిబ్ ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ The Golden Temple స్వర్ణ దేవాలయం | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ శైలి | సిక్కు నిర్మాణం |
పట్టణం లేదా నగరం | అమృతసర్ |
దేశం | భారతదేశం |
భౌగోళికాంశాలు | 31°37′12″N 74°52′37″E / 31.62000°N 74.87694°E |
నిర్మాణ ప్రారంభం | 1585 డిసెంబరు AD |
పూర్తి చేయబడినది | 1604 ఆగష్టు |
హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్గా కూడా పిలవబడుతుంది, అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది, ఇది భారతదేశంలోని అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారం. దీనిని 16 వ శతాబ్దం లో నాలుగవ సిక్కు గురువు గురు రాందాస్ సాహిబ్ జీ నిర్మించారు. 1604లో గురు అర్జున్ సిక్కుమతం పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తిచేశాడు, దీనిని గురుద్వారలో ప్రతిష్ఠాపించాడు. హర్మందిర్ సాహిబ్ లోకి వెళ్లెందుకు నాలుగు తలుపులు ఉన్నాయి. ఇవి సిక్కుల నిష్కాపట్యత చిహ్నంగా అన్ని వర్గాల ప్రజల, మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుత గురుద్వారం ఇతర సిక్కు మిస్ల్స్ సహాయంతో జస్సా సింగ్ అహ్లువాలియా 1764 లో పునర్నిర్మించారు.