గుత్తికొండ బిలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తికొండ బిలం.గుత్తికొండ
GUTTIKONDA CAVE.GUTTIKONDA
గుత్తికొండ బిలం
గుత్తికొండ బిలం
గుత్తికొండ బిలం.గుత్తికొండ GUTTIKONDA CAVE.GUTTIKONDA is located in Andhra Pradesh
గుత్తికొండ బిలం.గుత్తికొండ GUTTIKONDA CAVE.GUTTIKONDA
గుత్తికొండ బిలం.గుత్తికొండ
GUTTIKONDA CAVE.GUTTIKONDA
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°23′42″N 79°49′40″E / 16.394965°N 79.827808°E / 16.394965; 79.827808Coordinates: 16°23′42″N 79°49′40″E / 16.394965°N 79.827808°E / 16.394965; 79.827808
పేరు
ప్రధాన పేరు :గుత్తికొండ బిలం
ప్రదేశము
దేశము:భారత దేశము
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:గుంటూరు జిల్లా
ప్రదేశము:గుత్తికొండ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:చీకటి మల్లయ్యస్వామి (శివుడు )

గుత్తికొండ బిలం చిత్రములు

చీకటి మల్లయ్యస్వామి (శివుడు )
గుత్తికొండ బిలం(CAVE) లో కొలువైన చీకటి మల్లయ్య స్వామి
సొరంగ మార్గము
గుత్తికొండ బిలం(CAVE)లో సొరంగ మార్గము

గుత్తికొండ బిలం చిత్రములు

చీకటి మల్లయ్యస్వామి (శివుడు )
శిలాశాసనం

గుత్తికొండ బిలం[1] కొండల నడుమ పకృతిశోభతో బిలం ప్రసిద్ధక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రజావిశ్వాసం. దీనికి దక్షిణకాశి అనే పేరు ఉంది[2]. ఈ గుత్తికొండ బిలం మాచెర్ల నర్సరావుపేట రహదారి పై ఉంది. మాచర్లకు 65 కిమీ. కారంపూడికి 30 కిమీ. నర్సరావు పేటకు 30 కి.మీ దూరంలో ఉంది. .

చరిత్ర[మార్చు]

గుత్తికొండబిలము (గుహ) పేరెన్నికగన్న పుణ్యక్షేత్రము. 13వ శతాబ్దంనాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉన్నది ఈ పుణ్యక్షేత్రం. క్రీ.శ 1754వ సంవత్సరంలో స్వయంప్రకాశఅవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడు. పురావస్తువారి అన్వేషణలో అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడ లభించగా దానిని హైదరాబాదు పురావస్తుశాలలో పదిలపరిచారు. బిలంలో 101 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. కార్తీకమాసంలో జిల్లా నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు[3].

బిలం విశేషాలు[మార్చు]

ఈ బిలం ప్రకతి సహజ సిద్దంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శిస్తారు. తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు ఎప్పడు ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి. ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు జరిగే బిలమహొత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం, రహస్యాలకు కేంద్రబిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం[4].

భారతమాత ఆలయం[మార్చు]

ఈ బిలం దగ్గర భరతమాత అరుదైన ఆలయం ఉంది. చాగల్లు (నకిరికల్లు) కు చెందిన ఆలపర్తి గోవర్ధనమ్మ 2008 లో ఈ ఆలయాన్ని కట్టించారు.

ఉద్యమవేదిక[మార్చు]

ఆధ్యాత్మకంగా, పర్యాటక కేంద్రమైన గుత్తికొండ బిలానికి కమ్యూనిస్టు ఉద్యమవేదికగా కూడా పేరుంది. 1968లో చారు మజుందారు నేతృత్వంలో పీపుల్స్ వార్ సమావేశాలు ఈ బిలంలో గోప్యంగా సాగాయి. 2004 లో ప్రభుత్వానికి పీపుల్స్ వార్ చర్చలకు ముందు ఈ బిలాన్ని వేదికగా చేసుకొని బహిరంగసభ నిర్వహించారు. వార్ అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ కొండపై చారు మంజుదారు స్మారక స్థూపాన్ని నిర్మించారు.

రోడ్డు మార్గం[మార్చు]

ప్రకృతి రమణీయతతో అలరించే ఈ బిలానికి రావాలంటే శ్రమించక తప్పదు. మాచెర్ల లేదా నర్సరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి. ఆటో లేకపోతే 5 కి.మీ. నడక తప్పదు.

చిత్ర మాళిక[మార్చు]

మూలాలు[మార్చు]

http://templesamazingandhistoricalplaces.blogspot.in/