భారతదేశ హిందూ దేవాలయాల జాబితా
Jump to navigation
Jump to search
భారతదేశంలో రాష్ట్రాలవారిగా ప్రసిద్ధిపొందిన, బాగా గుర్తింపు పొందిన హిందూ దేవాలయాలు రాష్ట్రాల వారిగా ఈ జాబితాలోనమోదు అవుతాయి.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం (తిరుమల) - తిరుపతి జిల్లా, తిరుమల పట్టణం, శేషాచల కొండలపై తిరుమల తిరుపతి దేవస్థానం అనే స్వతంత్ర సంస్థ నిర్వహణలో ఉన్న ప్రముఖ దేవాలయం.
- అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం - అంతర్వేది తూర్పు గోదావరి జిల్లా
- మహానంది (కర్నూలు జిల్లా మహానందిలోని శైవక్షేత్రం)
- గోవింద రాజస్వామి దేవాలయం (తిరుపతి) - తిరుపతి, తిరుపతి జిల్లా
- ద్రాక్షారామ భీమేశ్వరాలయం - ద్రాక్షారామం, కోనసీమ జిల్లా
- శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు) - పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా
- శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం) - అన్నవరం, కాకినాడ జిల్లా
- వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం (విశాఖపట్నం జిల్లా సింహాచలలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం)
- శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం - శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా,
- శ్రీనివాస మంగాపురం - (చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరాలయం)
- బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం - (విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం)[1]
- శ్రీశైలం (కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయం)
- కాణిపాకం - (చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయక ఆలయం)
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి - (కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఉన్న శ్రీరాఘవేంద్రస్వామి దేవాలయం)
- అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం - (గుంటూరు జిల్లా అమరావతిలోని ఆలయం)
- ద్వారకా తిరుమల (వేంకటేశ్వరస్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా)
- శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట
- సూర్యనారాయణ స్వామి దేవాలయం, అరసవల్లి, శ్రీకాకుళం
- కపోతేశ్వర స్వామి దేవాలయం, చేజర్ల, గుంటూరు
- గుత్తికొండ బిలం, గుత్తికొండ, గుంటూరు జిల్లా - మహర్షులు తపస్సు చేసిన గుహ
తెలంగాణ
[మార్చు]- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా
- శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, భద్రాద్రి జిల్లా భద్రాచలం)
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (వేములవాడ, రాజన్న జిల్లా
- శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం (బాసర, ఆదిలాబాద్ జిల్లా)
- శ్రీ జోగులాంబ శక్తిపీఠం (ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా)
- వేయి స్తంభాల గుడి (హన్మకొండ, వరంగల్ జిల్లా)
- శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. (చెరువుగట్టు, నార్కెట్పల్లి మండలం, నల్గొండ జిల్లా)
- లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (వాడపల్లి) (దామెరచర్ల మండలం, నల్గొండ జిల్లా)
- చిల్కూరు బాలాజీ మందిరం (చిల్కూరు, రంగారెడ్డి జిల్లా)
- శ్రీ భద్రకాళీ దేవాలయము (వరంగల్)
- శ్రీ రామప్ప దేవాలయము (పాలంపేట, వరంగల్ జిల్లా)
- శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం, (వరంగల్ ఖిల్లా, వరంగల్ జిల్లా)
- బిర్లామందిరం, హైదరాబాద్
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, హైదరాబాద్
- కాళికామాత దేవాలయం, సికింద్రాబాద్
- తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయం (సికింద్రాబాదు)
- అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్
- గణేష్ మందిరం, సికింద్రాబాద్
- శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం (కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా)
- శ్రీ మల్లికార్జున దేవస్థానం (ఓదెల, కరీంనగర్ జిల్లా)
- (పబ్బతి అంజనేయ స్వామి దేవాలయం మద్దిమడుగు, పదర,నాగర్ కర్నూలు జిల్లా)
- (ఉమామహేశ్వర దేవాలయం,ఉమామహేశ్వరం,అచ్చంపేట,నాగర్ కర్నూలు జిల్లా)
(బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము, ఇటిక్యాల మండలం,జోగులాంబ గద్వాల్ జిల్లా) (బుద్దరం అంజనేయ స్వామి దేవాలయం బుద్దరం గండి,గోపాల్ పేట మండలం,వనపర్తి జిల్లా)
- సమ్మక్క-సారక్క ఆలయం, తాడ్వాయి, ములుగు జిల్లా.
- పెద్దగట్టు మల్లన్న స్వామి ఆలయం, దురాజ్ పల్లి, సూర్యాపేట జిల్లా.
- మల్లికార్జున స్వామి ఆలయం, కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా.
- మల్లికార్జున స్వామి ఆలయం, ఐనవోలు, హన్మకొండ జిల్లా.
కేరళ
[మార్చు]- శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (తిరువనంతపురం)
- గురువాయూరు శ్రీకృష్ణ మందిరం (గురువాయూరు)
- శ్రీ అయ్యప్ప ఆలయం (శబరిమల)
మహారాష్ట్ర
[మార్చు]- షిర్డీ సాయిబాబా ఆలయం (షిర్డీ)
- సిద్ధి వినాయక మందిరం (ముంబై)
- త్రయంబకేశ్వరాలయం (నాసిక్)
- పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం (పండరీపురం)
కర్ణాటక
[మార్చు]- విరూ పాక్షాలయం. హంపి
- హళేబీడు: ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది.
- పావగడ: మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది.
తమిళనాడు
[మార్చు]తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో దాదాపు 34,000 దేవాలయాలు ఉన్నాయి.[2]
- జలకంఠేశ్వరాలయం (వెల్లూరు) -వెల్లూర్
- రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం) - శ్రీరంగం
- బృహదీశ్వరాలయం (తంజావూరు) - తంజావూరు
- మీనాక్షి అమ్మవారి ఆలయం -మధురై
- నటరాజస్వామి ఆలయం (చిదంబరం) - చిదంబరం
- దేవీ కన్యాకుమారి ఆలయం - కన్యా కుమారి (త్రివేణి సంగమస్థానం)
- రామేశ్వరం (ప్రాచీన శైవక్షేత్రం)
- తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరాలయం (తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం)
- కంచి కామాక్షి ఆలయం (కంచిలో ఉన్న ఆలయం)
- వరదరాజస్వామి దేవాలయం, కంచి
- మహాబలిపురం -
- సుచింద్రం తనుమాలయన్ ఆలయం (తమిళనాడు) - ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం.
- అరుణాచలమేశ్వర స్వామి ఆలయం - (తిరువణ్ణామలై)
- స్వర్ణ దేవాలయం - శ్రీపురం
- అళగియ మణవాళ పెరుమాళ్ ఆలయం - తిరుచిరాపల్లి
- ఉలగళంద పెరుమాళ్ కోవెల - కాంచీపురం
ఉత్తరప్రదేశ్
[మార్చు]- కాశీ విశ్వేశ్వరాలయం (కాశీ)
గుజరాత్
[మార్చు]- కాళీమాతా ఆలయం, పావుగడ (పావుగడ)
జమ్మూకాశ్మీర్
[మార్చు]ఒడిషా
[మార్చు]- పూరీ జగన్నాథ దేవాలయం (పూరీ)
- కోణార్క సూర్య దేవాలయం (కోణార్క)
ఉత్తరాఖండ్
[మార్చు]- హరిద్వార్ ( పుణ్యక్షేత్రం)
పంజాబ్
[మార్చు]- హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) - అమృత్సర్
హర్యానా
[మార్చు]- సీతామాయి దేవాలయం: హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఉన్న సీతామాయి గ్రామంలో ఉన్న పురాతన కట్టడం.
- చండీమందిర్
ఇవి కూడా చూడండి
[మార్చు]- హిందూ దేవాలయం
- ప్రపంచ దేవాలయాల జాబితా
- భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతదేశ ఆలయాల చెఱువులు (పెద్ద) జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Temples in Andhra Pradesh - Info, History, Timing, Photos, Map and Video". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2023-02-23.
- ↑ "Hindu Temples | Indian Temples - The Complete List, Details, Architecture, History, Timings". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2023-02-23.
వెలుపలి లంకెలు
[మార్చు]- Vastu-Silpa Kosha, Encyclopedia of Hindu Temple architecture and Vastu S.K.Ramachandara Rao, Delhi, Devine Books, (Lala Murari Lal Chharia Oriental series) ISBN 978-93-81218-51-8 (Set)