ఓదెల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఓదెల
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ఓదెల మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ఓదెల మండలం యొక్క స్థానము
ఓదెల is located in Telangana
ఓదెల
తెలంగాణ పటములో ఓదెల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°27′19″N 79°26′48″E / 18.4552672°N 79.4466877°E / 18.4552672; 79.4466877
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ఓదెల
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,211
 - పురుషులు
 - స్త్రీలు 21,247
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.62%
 - పురుషులు 62.01%
 - స్త్రీలు 37.18%
పిన్ కోడ్ 505152

ఓదెల, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయితీ. పిన్ కోడ్ : 505 152.,

ఓదెల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం ఓదెల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మండలానికి సరిహద్దు మండలాలు పెద్దపల్లి, జమ్మికుంట, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్.

  • ఓదెల గ్రామములో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జునస్వామి దేవస్థానం ఉంది. ఓదెల మల్లన్నగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయం తెలంగాణాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయ నిర్మాణక్రమం, స్తంభ వర్ణ శిలల శిల్పాల ఆధారంగా, ఇది చాళుక్యుల కాలంలోనే నిర్మింపబడి, క్రీ.శ.1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మింపబడినట్లుగా తెలుస్తున్నది. ఈ దేవాలయం ఓదెల గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో జరిగే జాతరకు కరీంనగర్ జిల్లా నుండేకాక సరిహద్దు జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రితో మొదలయ్యే ఈ జాతర పెద్దపట్నంతో ముగుస్తుంది.

ఓదెల మండల కేంద్రానికి బస్సు మరియు రైలు మార్గం ఉంది. ఢిల్లీ-చెన్నై మార్గంలోని దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఖాజీపేట-బల్లార్షా మధ్యలో ఓదెల రైల్వే స్టేషను ఉంటుంది. ఈ స్టేషనులో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్, నాగపూర్-ఖాజీపేట, విజయవాడ-కరీంనగర్ మెమూ ప్యాసింజర్, భాగ్యనగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లతోపాటు తెలంగాణా ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల ఎక్స్.ప్రెస్ లు కూడా ఆగుతాయి. సమీప పట్టణ కేంద్రమైన సుల్తానాబాద్ నుండి బస్సు సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారి ఓదెలకు సమీపం (సుల్తానాబాద్)నుండి వెళ్తుంది.

  • ఈ మండలంలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 42,211 - పురుషులు - స్త్రీలు 21,247

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=ఓదెల&oldid=2302709" నుండి వెలికితీశారు