సామవేదం

వికీపీడియా నుండి
(సామవేదము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
చతుర్వేదాలలో ఒకటి సామవేదము Samaveda manuscripts exist in many Indic scripts. Above: దేవనాగరి, Below: గ్రంథ.

చతుర్వేదాలలో ఒకటి సామవేదము (సంస్కృతం: सामवेद). సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.

వేదాల మధ్య సంబంధం

వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి - ఋక్కులు, యజుస్సులు, సామములు. ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్. వచన రూపంలో (ఛందస్సు లేకుండా) ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే శ్లోకం ఋక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును. ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన ఋక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్ఛరింపబడే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు, కొన్న ఋగ్వేదమంత్రాలు. సామవేదంలో సామములున్నాయి. అధర్వణ వేదంలో ప్రధానంగా ఋక్కులు, కొన్ని యజుస్సులు ఉన్నాయి.[1]

1895లో రాల్ఫ్ గ్రిఫిత్ ప్రచురించిన సామవేదం ఆంగ్లానువాదం పీఠికలో ఇలా వ్రాశాడు [2] వేదాల క్రమంలో మూడవదిగా చెప్పబడే "సామవేదం" లేదా "పవిత్ర గానాల వేదం" ఋగ్వేదం తరువాతి ముఖ్యస్థానాన్ని కలిగి ఉంది. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. ఋగ్వేదం లోని వివిధ స్తోత్రాలను, శ్లోకాలను ఇందులో తిరిగి అమర్చినట్లుగా అనిపిస్తున్నది. ఈ అమరిక క్రమానికి మూల ఋగ్వేదంలోని క్రమంతో సంబంధం లేదు. యజ్ఞయాగాది కార్యాలలో ఉపయోగపడేందుకు వీలుగా వినియోగం బట్టి ఇలా అమర్చినట్లున్నారు. ఇలా పునర్వవస్థీకరించిన సామములు కొన్ని (ప్రస్తుతం మనకు లభిస్తున్న) మూల ఋగ్వేదంలోని శ్లోకాలకు యధాతథం కాగా మరి కొన్ని సామములు గణనీయంగా మార్పు చెందినట్లున్నాయి. మరి కొన్ని సామములు ప్రస్తుతం లభించే ఋగ్వేద పాఠం కంటే పురాతనమైనవిగా అనిపిస్తాయి. గానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను ఉచ్ఛారణాపరంగా ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి. సామవేద గానాలను ఎప్పుడు సంకలనం చేశారో ఊహించడం సాధ్యం కావడంలేదు. అలాగే సంకలనకర్త పేరు కూడా మౌఖిక సంప్రదాయ పరంగా లభించడం లేదు.

సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలావరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10,552 మంత్రాలలోనుండి యధాతథంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే వర్తిస్తుంది. ఉచ్ఛారణా విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీత 10-22 లో "వేదములలో నేను సామమును" అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును.

సామవేదం శాఖలు[మార్చు]

సామవేద సంహితకు మూడు శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ శాఖ గుజరాత్‌లో ప్రాచుర్యంలో ఉంది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోను, రాహయణీయ శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోను ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ శాఖలలో మంత్రాలు, ఉచ్ఛారణావిధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు (3681) ఉన్నాయి. సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలంనుండి మంత్రాలు గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒకో దేవత గురించి ఒకో ఛందస్సులో కీర్తిస్తుంది. ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని "పవమాన సోముడు" గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సామవేదం గురించిన వివరణావ్యాసం Archived 2008-09-20 at the Wayback Machine SRI AUROBINDO KAPALI SHASTRY INSTITUTE OF VEDIC CULTURE, #63, 13th Main, 4th Block East, Jayanagar, Bangalore – 560 011 , Phone: +91-80-26556315 , Email: info@vedah.com , Web: www.vedah.org
  2. HYMNS OF THE SAMAVEDA - Translated with a Popular Commentary - Ralph T.H. Griffith - 1895 - PREFACE

వనరులు, ఉపయోగకరమైన గ్రంధాలు, బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సామవేదం&oldid=4011046" నుండి వెలికితీశారు