Jump to content

కఠోపనిషత్తు

వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది (ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).

శాంతి మంత్రం

[మార్చు]

ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం

ఓం సహనావవతు ,
సహనౌ భుజన్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వి నా వధీతమస్తు,
మావిద్వాషావహై ,
ఓం శాంతి: శాంతి: శాంతి:

మూల కథ

[మార్చు]

వాజశ్రవుడు (ఉద్దాలకుడు) విశ్వజిద్యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు బ్రాహ్మణు లకు దానమిస్తాడు.వాజశ్రవుడు దానమిస్తున్న సంపదలో ఉన్న గోవులలో ముసలి గోవులు కూడా చాలా ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.

పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి

నచికేతుడు తన తండ్రి వద్దకు వెళ్ళి తనను ఎవరికి దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి యముడికి దానమిస్తున్నాను అని అంటాడు.

పితృ వాక్య పరిపాలన కోసం నచికేతుడు యమ లోకానికి వెడతాడు. అక్కడ యమధర్మరాజు కనిపించడు . నచికేతుడు మూడు రాత్రులు యమలోకంలో అన్నపానాలు లేకుండా గడుపుతాడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి, అతిథి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి, నచికేతుడికి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మొదటి వరంగా తన తండ్రి తనను మళ్లీ చూసేటప్పటికి శాంతస్వరూపంలో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరంగా యముడు నచికేతుడికి అగ్నికార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. ఆవిధంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొందడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.

చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా, ఉండడా అనే విషయాన్ని విశదీకరించమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యోగ్యతను పరీక్షించదలచి రకరకాలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైనా కొరుకొమ్మంటాడు.అయితే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరించి జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]