మహా భారతము

వికీపీడియా నుండి
(మహాభారతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇది మహాభారత గాథను గురించిన వ్యాసం. తెలుగులో కవిత్రయం వ్రాసిన గ్రంధాన్ని గురించిన వ్యాసాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతం వద్ద చూడవచ్చు. భారతము అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది [1][2][3][4][5][6] మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కథనం

కావ్య ప్రశస్తి[మార్చు]

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ:

దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.

మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.

మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలోని విభాగాలు[మార్చు]

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

 1. ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
 2. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
 3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
 4. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
 5. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
 6. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 7. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 8. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 9. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
 10. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
 11. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
 12. శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
 13. అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
 14. అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
 15. ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
 16. మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
 17. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
 18. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.

హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

మహాభారతం ప్రత్యేకతలు[మార్చు]

అక్షౌహిణి[మార్చు]

భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.

అక్షౌహిణి రథములు ఏనుగులు గుఱ్ఱములు కాలిబంట్లు
1 21,870 21,870 65,610 1,09,350

వివిధ ప్రమాణాలు[మార్చు]

పత్తి

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు మరియు ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "పత్తి" అంటారు.

1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
సేనాముఖము

మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి

3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు
గుల్మము

మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము

9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు
గణము

గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X గుల్మము

27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు
వాహిని

వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము

81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు
పృతన

పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు

243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు
చమువు

చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన

729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు
అనీకిని

అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు.

2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు
అక్షౌహిణి

అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని

21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు

ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.

రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి
పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు
సేనాముఖము 3 3 3 9 15 సేనాముఖి
గుల్మము 3*3 9 9 27 45 నాయకుడు
గణము 33 27 27 81 135 గణనాయకుడు
వాహిని 34 81 81 243 405 వాహినిపతి
పృతన 35 243 243 729 1,215 పృతనాధిపతి
చమువు (సేనా) 36 729 729 2,187 3,645 సేనాపతి
అనీకిని 37 2,187 2,187 6,561 10,935 అనీకాధిపతి
అక్షౌహిణి 10*37 21,870 21,870 65,610 1,09,350 మహా సేనాపతి

మరిన్ని ప్రమాణాలు[మార్చు][మార్చు]

అక్షౌహిణి X '18' = ఏకము

ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు)

కోటి X '8' = శంఖము

శంఖము X '8' = కుముదము

కుముదము X '8' = పద్మము

పద్మము X '8' = నాడి

నాడి X '8' = సముద్రము

సముద్రము X '8' = వెల్లువ

అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.

256842399744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట.

మూలాలు[మార్చు]

 • అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
 • ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
 • పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
 • వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
 • మహాభారతంలోని ఉపపర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం,

సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.

చారిత్రక పరిశీలనలు[మార్చు]

కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశొధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది.[ఉల్లేఖన అవసరం] క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి [7][8]

తెలుగు సినిమాలలో భారతగాథ[మార్చు]

మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:

మహాభారతంలోని 18 విభాగాల విడియో ప్రసంగాలు[మార్చు]

"మహాభారతం" లోమంచి కథలు ( వ్యాసాలు)[మార్చు]

"మహాభారతం" లోమంచి కథలు ( వ్యాసాలు) Videos

బయటి లింకులు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
మరింత సమాచారం

బయటి లింకులు

ఆన్‌లైన్ మహాభారత గ్రంథం
కిసారి మోహన్ గంగూలి అనువాదం
మహాభారతం గురించిన వ్యాసాలు
వినండి (ఆడియో)
ఇంకా కొన్ని వనరులు


మూలాలు[మార్చు]

 1. Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647
 2. Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26
 3. The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash Kak
 4. Van Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)
 5. Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.C
 6. An Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India
 7. Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, India
 8. Archeology of Dwaraka Land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004.