వంగరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Vanga

Vanga and erstwhile neighbors in ancient India
Vanga and erstwhile neighbors in ancient India
ప్రభుత్వంMonarchy
చారిత్రిక కాలంAncient India
Today part ofBangladesh
India

వంగరాజ్యం భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యం, భౌగోళికంగా ఒక రాజకీయ విభాగం. బెంగాలు ప్రాంతం పేరున్న రాజ్యాలలో ఇది ఒకటి.[1] ఇది దక్షిణ బెంగాలులో ఉంది. ప్రస్తుత దక్షిణ పశ్చిమ బెంగాలు (భారతదేశం), నైరుతి బంగ్లాదేశుతో చేరిన ప్రధాన ప్రాంతంలో విస్తరించిన రాజ్యం ఇది. ప్రాచీన భారతదేశం పురాణాలు, కథలలో, శ్రీలంక చరిత్రలో వంగ లక్షణాలు పేర్కొనబడ్డాయి.

అనేకమంది గ్రీకో-రోమను రచయితలు పేర్కొన్న గంగారిడై సామ్రాజ్యానికి వంగప్రాంతం బహుశా కేంద్రంగా ఉంది. భారతీయ, గ్రీకో-రోమను రచయితలు ఈ ప్రాంతం, యుద్ధ ఏనుగులను సూచిస్తారు. భారతీయ చరిత్రలో వంగప్రాంతం తన బలమైన నావికాదళానికి ప్రసిద్ది చెందింది. హిందూ ఇతిహాసం మహాభారతంలో వంగప్రాంతం గురించి అనేక సూచనలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని రెండు ప్రధాన సంస్కృత ఇతిహాసాలలో ఒకటి. ఇతర ఇతిహాసం, రామాయణం, రాజ్యాన్ని అయోధ్యకు మిత్రదేశంగా పేర్కొంది. సింహళ వృత్తాంతాల ఆధారంగా వంగ అనేది లంక ద్వీపంలో వలసరాజ్యం. రాజ్యాన్ని స్థాపించిన రాకుమారుడు విజయ పూర్వీకుల నివాసం.

చరిత్ర[మార్చు]

పశ్చిమ భారతదేశం లోని అజంతా గుహలలో ఉన్న వంగదేశ రాకుమారుడు శ్రీలంకను జయించి పట్టాభిషిక్తుడౌతున్న దృశ్యం

వంగరాజ్యం నార్తరను బ్లాక్ పాలిషు వేర్ కాలంలో దిగువ గంగా డెల్టాలో ఉద్భవించింది. ఇది డెల్టా అనేక ద్వీపాలను తన నావికాదళంతో నియంత్రిస్తూ విదేశీ అన్వేషణకు బయలుదేరింది. ప్రాచీన భారతీయ వ్రాతపూర్వక ఆధారాలు వంగను నావికుల కేంద్రంగా సూచిస్తాయి. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో వంగరాజు స్లహాబాహు కుమారుడు రాకుమారుడు విజయ బెంగాలు బే మీదుగా ప్రయాణించి ఇప్పుడు శ్రీలంకలో ఉన్న రాజ్యాన్ని స్థాపించాడు.[2] వంగరాజ్యం మత సంప్రదాయాలలో జైన మతం, బౌద్ధమతం, హిందూ మతం ప్రధానంగా ఉన్నాయి.

కౌటిల్య రాసిన అర్థశాస్త్రంలో వంగను పరిపాలనా విభాగంగా నమోదు చేశారు. దీనిని కాళిదాసు గుర్తించదగిన నావికా శక్తిగా అభివర్ణించారు. వంగాలో ఉపవిభాగాల నమోదిత ఆధారాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక విభాగాన్ని "ఉప వంగా" (ఎగువ వంగా) అని పిలుస్తారు. ఇది జెస్సోరు, సుందర్బన్లకు అనుగుణమైన అటవీ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది.[3]


వంగరాజ్యం పాలకుల వివరాలు అధికంగా తెలియదు. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం తరువాత ఈ భూభాగంలో వరుస భారతీయ సామ్రాజ్యాలలో బెంగాలీ రాజ్యాలలో భాగమైంది. వీటిలో మౌర్య, గుప్తాల, శశాంకా పాలన, ఖద్గాల, పాలాల, చంద్రాలు, సేనాలు, దేవాలు ఉన్నారు. తరచుగా భూభాగాన్ని సూచించడానికి వంగల అనే పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు దక్షిణ భారత చోళ రాజవంశం శాసనం చంద్ర రాజవంశంతో యుద్ధంలో ఈ ప్రాంతాన్ని వంగలదేశంగా పేర్కొంది.[4] ముస్లిం బెంగాలు ఆక్రమణ తరువాత ఈ ప్రాంతాన్ని బంగాలా అని పిలిచారు. ఇది వంగల నుండి ఉద్భవించి ఉండవచ్చు. పేర్లు ఆధునిక పదాలు బంగ, బంగ్లా పూర్వగాములు.

భౌగోళికం[మార్చు]

వంగ ప్రధాన ప్రాంతం తూర్పున పద్మ-మేఘనా నది వ్యవస్థ, పశ్చిమాన భాగీరథి-హూగ్లీ నది వ్యవస్థ మధ్య విస్తరించి ఉంది.

[5]

తూర్పున ఇది ఆధునిక బంగ్లాదేశు ఖుల్నా విభాగం, బారిసాలు విభాగం, అలాగే ఖుల్నా విభాగం నైరుతి విభాగాన్ని కలిగి ఉంది. పశ్చిమాన ఇది పశ్చిమ బెంగాలు ప్రెసిడెన్సీ విభాగాన్ని కలిగి ఉంది. బుర్ద్వాను డివిజను, మేదినీపూరు విభాగం వరకు విస్తరించి ఉండవచ్చు. దాని పొరుగువారిలో తూర్పున సమతట ఉన్నారు; ఉత్తరాన పౌండ్రవర్ధన; పశ్చిమాన మగధ, అంగ, సుహ్మా, రాధ ఉన్నాయి.

వంగా రాజ్యం గంగా డెల్టా, సుందర్బను మడ అడవుల అనేక ద్వీపాలను కలిగి ఉంది.

పురాతత్వం[మార్చు]

పశ్చిమ బెంగాలులో వంగదేశ సంబంధిత పురావస్తు ప్రాంతంగా చంద్రకేతుగరు ఉంది.

మహాభారతంలో మూలాలు[మార్చు]

కంబోడియా లోని అంగరుకోట దేవాలయంలో మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ దృశ్యాలు
పశ్చిమబెంగాలు లోని చంద్రకేతగరు వద్ద లభించిన టెర్రకోట నౌకాముద్ర
కంతజా ఆలయం (బంగ్లాదేశ్)టెర్రకోటా యుద్ధ గజం
టెర్రకోట ఏనుగు, గుర్రం(బంగ్లాదేసు)

పురాతన భారతదేశంలో (6:9)లో అంగ, వంగ, కళింగ సమీప దేశాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో పవిత్ర తీర్ధాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అర్జునుడు వీటిని అన్నింటినీ సందర్శించాడు.

[6] గంగ, వంగ, కళింగ పౌండ్ర సుహ్మాలు ఒకేపూర్వీకతకు భాగస్వాములుగా ఉన్నారు. వారు ముగ్గురూ రాజా వాలి(బాలి) దత్తపుత్రులు. గిరివ్రజపురానికి సమీపంలో ఉన్న మగధలో నివసిస్తున్న దీర్ఘతముడి ద్వారా జన్మించిన పుత్రులే.[7][8]

వంగదేశం మీద భీముడి దండయాత్ర[మార్చు]

తరువాత వంగదేశం మీద దండయాత్ర చేసాడు.(2:29)

వంగదేశం మీద ఇతర దాడులు[మార్చు]

కాశ్మీరాలు, దారదాలు, కుంతిలు, క్షుద్రకులు, మాలవులు, అంగాలు, వంగాలు, కళింగాలు, విదేహాలు, తామ్రలిప్తకాలు, రాక్షోవహాలు, విఠాహోత్రాలు, త్రిగార్తాలు, మార్టికావతలు అందరినీ భార్గవ రాముడు హతమార్చాడు (7: 68).

కర్ణుడు అంగాలు, బంగాలు, కళింగాలు, మండికులు, మగధలను క్షీణింపజేసాడు. కర్కఖండాలు; వారితో అవాసిరాలు, యోధ్యలు, అహిక్షత్రాలు కూడా ఉన్నారు (3: 252).

అంగాలు, వంగాలు, కళింగాలు, మగధలు, కాశులు, కోసలు, వత్స్యులు, గార్గ్యాలు, కరుషులు, పౌండ్రకులు వాసుదేవ కృష్ణుడిచే నిర్మూలించబడ్డారని పేర్కొన్నారు (7:11).

కురుక్షేత్ర యుద్ధం తరువాత అర్జునుడు తన సైనిక ప్రచారంలో బంగాలు, పౌండ్రాలు, కోసల దేశాలను (14:82) ఓడించాడు.

యుధిష్టరుడి సామంతరాజ్యంగా[మార్చు]

అంగ, వంగ, పౌండ్ర రాజులు యుధిష్ఠిర ఆస్థానానికి హాజరైనట్లు పేర్కొన్నారు (2: 4). వంగి, అంగాలు, పాండ్రాలు, ఓడ్రాలు, చోళులు, ద్రావిడలు, ఆంధ్రకులు యుధిష్ఠిరుడికి కప్పం అర్పించారని పేర్కొన్నారు (3:51). అంగాలు, వంగాలు, పునరాలు , సనవత్యులు, గయాలు-ఈ సుక్షత్రియులు సాధారణ వంశాలలో పంపిణీ చేయబడ్డారు. ఆయుధాల వినియోగానికి శిక్షణ పొందారు. యుధిష్ఠిర రాజుకు వందలు, వేలమంది కప్పం తెచ్చారు. వంగాలు, కళింగాలు, మగధలు, తామరలిప్తులు, సుపుంద్రకాలు, దౌవాలికలు, సాగరకులు, పోషకులు, సైసవులు, అసంఖ్యాక కర్ణాప్రవారణులు ద్వారం వద్ద వేచి ఉన్నారు (2:51).

కురుక్షేత్ర యుద్ధంలో వంగాలు[మార్చు]

యుద్ధ ఏనుగులను నిర్వహించడంలో వంగసైన్యం నైపుణ్యం కలిగి ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో వారు కౌరవులతో కలిసి ఉన్నారు.

కురుక్షేత్ర యుద్ధంలో కళింగాలతో పాటు (8:17) దుర్యోధనుడితో వంగప్రజలు ఉన్నారు. (7: 158)లో కౌరవ సైన్యంలో భాగంగా వారిని ప్రస్తావించారు. తూర్పువాసులు, దక్షిణాదివారు, అంగాలు, వంగాలు, పుంలింద్రులు, మగధలు, తమరలిప్తాకులు, మేకలాలు, కోశలు, మద్రాలు, దశర్నాలు, నిషాదులు వంటి ఏనుగుల పోరాటంలో నైపుణ్యం కలిగిన అనేకమంది పోరాట యోధులు ఐక్యమయ్యారు కళింగాలు (8:22). సాత్యకి, వంగాల రాజుకు చెందిన ఏనుగు ప్రాణాలను కొట్టాడు (8:22).

కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ప్రజ్ఞోతిషా రాజ్యానికి పాలకుడిగా భగదత్తను పేర్కొన్నారు.

దుర్యోధనుడి వెనుక వంగ పాలకుని పదివేల ఏనుగులు కొండల వలె భారీగా ఉన్నాయి (6:92). కొండలాగా భారీగా ఉన్న ఏనుగుల మీద ఎక్కిన వంగాల (భగదత్త) పాలకుడు ఘటోట్కాచ రాక్షస వైపు వెళ్ళాడు. యుద్ధరంగంలో గొప్ప వేగంతో కూడిన ఏనుగుతో భగదత్తుడు దుర్యోధనుడి రధం ముందు నిలిచాడు. ఆ ఏనుగుతో ఆయన నీ కొడుకు రధాన్ని పూర్తిగా కప్పాడు. వంగాల తెలివైన రాజు కప్పబడిన మార్గం (దుర్యోధనుడి రధం) చూస్తే, ఘటోత్కచుడి కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. ఆయన ఆ ఏనుగు వద్ద ఆ భారీ డార్టును పైకి లేపడానికి ముందు ఘటోట్కాచుడి చేతుల నుండి విసిరిన ఆ డార్టుతో, ఆ ఏనుగు, రక్తంతో కప్పబడి, చాలా వేదనతో, కింద పడి చనిపోయింది. వంగాల శక్తివంతమైన రాజు ఏనుగు నుండి త్వరగా కిందకు దూకి నేలమీదకు దిగాడు (6:93).

వంగరాజ్య పాలకులు[మార్చు]

(2:29)లో సముద్రాసేన, చద్రసేన అనే ఇద్దరు పాలకుల గురించి ప్రస్తావించారు. వారు వంగ రాజ్యానికి పాలకులేనా అనేది స్పష్టంగా తెలియదు. కర్ణుడు (2:43)లో అంగ, వంగ పాలకుడిగా పేర్కొనబడ్డాడు. జరాసంధుడు మిత్రుడు, వాసుదేవ కృష్ణుడి శత్రువు అయిన పౌండ్రక వాసుదేవుడు (2:14)లో వంగా, పౌడ్ర కిరాతుల రాజుగా పేర్కొనబడ్డాడు. భగదత్తను వంగా పాలకుడిగా పేర్కొన్నారు (8:22).

బహుశా ఈ పాలకులందరికీ వంగా భూభాగంలో వాటా ఉంది. ఇవన్నీ మహాభారతంలోని ఇతర భాగాలలో పొరుగున ఉన్న రాజ్యాలను పాలించినట్లు ప్రస్తావించబడ్డాయి. భగదత్తుడు వంగకు ఉత్తరాన ఉన్న ప్రగ్జ్యోతిష రాజ్యానికి పాలకుడు. పౌండ్రక వాసుదేవుడు వంగకు తూర్పున పౌడ్ర రాజ్యాన్ని, కర్ణుడు వంగా పశ్చిమాన అంగ రాజ్యాన్ని పరిపాలించాడు.

ఇతర మూలాలు[మార్చు]

పాంచాల రాకుమారి స్వయంవరానికి పౌడ్రక రాజ్యానికి రాజైన పౌడ్రక వాసుదేవుడితో కళింగ, వంగ రాజులు హాజరయ్యారని పేర్కొనబడ్డారు. [9]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://www.britannica.com/place/West-Bengal#ref486986
  2. Malaẏaśaṅkara Bhaṭṭācārya (2008). Glimpses of Buddhist Bengal. Indian Institute of Oriental Studies & Research. ISBN 978-81-901371-7-1.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 23 నవంబరు 2019.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 26 ఏప్రిల్ 2019. Retrieved 23 నవంబరు 2019.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 23 నవంబరు 2019.
  6. (Mbh 1:217)[full citation needed]
  7. (1:104)[full citation needed]
  8. (2:21)[full citation needed]
  9. (1:189) (2:33)[full citation needed]

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Tribes and kingdoms of the Mahabharata