Jump to content

ప్రాగ్జ్యోతిష రాజ్యం

వికీపీడియా నుండి
Pragjyotisha Kingdom

A scene involving king Naraka
A scene involving king Naraka
రాజధానిPragjyotishpura
ప్రభుత్వంAbsolute monarchy
చారిత్రిక కాలంVedic period
Today part of India

పురాణాలలో ప్రస్తావించబడిన రాజ్యాలలో ప్రాగ్జ్యోతిష రాజ్యం ఒకటి. తరువాత కాలంలో ఈ రాజ్యం చారిత్రక కామరూపతో సంబంధం కలిగి ఉంది.[1]

మొదటి శతాబ్దం కంటే ముందే రామాయణం, మహాభారతాలలోఈ రాజ్యం మొదటి ప్రస్తావనలు కనిపిస్తాయి. [2] రామాయణంలోని కిష్కింధ కాండలో ప్రస్తావించబడిన రాజ్యం పడమటి వైపున వరాహపర్వతం దగ్గర సముద్రంలో ఉన్నట్లు వర్ణొంచబడింది. [3] మహాభారతం అశ్వమేధ-పర్వంలో అర్జునుడు ప్రగ్జ్యోతిషకు చెందిన వజ్రదత్తుడిని ఎదుర్కొన్నాడు.[4]

పురాతన రాజ్యాన్ని దానవ రాజవంశం పాలనలో ఉంది. బాణ రాజవంశం (ప్రస్తుత సోనిత్పురా (మధ్య అస్సాం)) సమకాలీన రాజవంశంగా భావించబడుతుంది.[5] ఇది హిందూ పురాణాలలో, ప్రాచీన హిందూ సాహిత్యంలో ప్రస్తావించబడింది.[6]

చరిత్ర

[మార్చు]

పురాణాల ఆధారంగా రాజు భగదత్తుడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో రాజ్యపాలకుడుగా ఉన్నాడు. కురుక్షేత్రయుద్ధంలో కౌరవపక్షంలో పోరాడి మరణించాడు.[7] ఈ రాజ్యం గురించిన వివరాలు రామాయణం, మహాభారతం, కల్కి పురాణం, తరువాత యోగి తంత్రం నుండి గ్రహించబడ్డాయి.

మహాభారతంలో మూలాలు

[మార్చు]
  • పాండవరాజు యుధిష్ఠరుడు రాజసూయయాగం (2,26)లో భాగంగా సైనిక పోరాటంలో అర్జునుడు ప్రగ్జ్యోతిషపుర రాజు భగదత్తుడిని ఓడించాడు.
  • భగదత్తుడు, అర్జునుడి మధ్య ఒక ముఖాముఖి సంఘర్షణ జరిగింది. అప్పుడు ఇంద్రుడిని తన స్నేహితుడిగా భావించిన భగదత్తుడు ఇంద్రుడి కుమారుడైన అర్జునుడితో స్నేహం చేశాడు. (5,168)
  • ప్రాగ్జ్యోతిషపురరాజు భగదత్తుడు సముద్ర తీరంలో చిత్తడినేలలలో నివసించే మ్లేచ్ఛ తెగలన్నింటితో కలిసి యుధిష్ఠరుడి రాజసూయ యాగానికి వచ్చాడు; యుధిష్ఠిరుడు చేస్తున్న రాజసూయ యాగానికి (2,33) హాజరు కావడానికి చాలా మంది పర్వతరాజులు వచ్చారు.
  • గొప్ప యోధుడు రాజు భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురానికి ధైర్యసాహసాలు కలిగిన పాలకుడు, మ్లేచ్ఛుల శక్తివంతమైన సార్వభౌముడు. ఆయన ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యవనులు రాజసూయ యాగానికి వచ్చారు (2,50)
  • కురుక్షేత్ర యుద్ధం (5,55)లో కౌరవ సైన్యంలో భగదత్తుడు అతిరధ శ్రేష్టులలో (మహారాఠీ) ఒకరు.
  • ప్రాగ్జ్యోతిష పాలకుడు, ధైర్యమైన భగదత్తుడు గజయుద్ధంలో అగ్రగామి (యుద్ధ-ఏనుగు మీద కూర్చుచి పోరాడడంలో నైపుణ్యం). అలాగే రధం నుండి పోరాడడంలో కూడా నైపుణ్యం ఉంది. (5,168)
  • ప్రగ్జ్యోతిషపుర రాజు భగదత్తుడు కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముని (6-65,75,82,84,96,112,114,115,117) ఆధ్వర్యంలో కురుక్షేత్ర యుద్ధంలో సైనికాధికారిగా పోరాడాడు. ఆయన ద్రోణుడి అధ్యక్షతలో మరో కౌరవ సైన్యాధికారిగా పోరాడాడు. (7-20,24,25,26,27). ఆయనను అర్జునుడు (7,27) చంపాడు.
  • కురుక్షేత్ర యుద్ధం తరువాత, యుధిష్ఠరుడి అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు భగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడితో ప్రాగ్జ్యోతిషపురంలో యుద్ధం చేశాడు. (14,75)
  • మౌరవులను, పాషులను నాశనం చేసి, నిసుంద, నరకులను చంపి వాసుదేవ కృష్ణుడు ప్రజ్ఞోతిషపుర రహదారిని సురక్షితంగా మార్చాడు. (3,12)
  • అసురులకు ప్రాగ్యోతిషా అనే నగరం ఉంది. ఇది బలీయమైనది, ప్రవేశించలేనిది, అగమ్యగోచరమైనదిగా ఉండేది. అక్కడే భూదేవి కుమారుడు (భూమి) శక్తివంతుడైన నరకాసురుడు అధితి కుండలాలను బలవంతంగా తీసుకువచ్చాడు. అధితి కుమారులు (దేవతలు) వాటిని తిరిగి పొందలేకపోయారు. కృష్ణుడి పరాక్రమం, శక్తి, ఎదురులేని చక్రాయుధాన్ని చూసి దేవతలు ఆ అసురుల నాశనం చేయమని కృష్ణుడిని వేడుకున్నారు. చాలా కష్టతరమైన ఈ పనిని చేపట్టడానికి కృష్ణుడు అంగీకరించాడు. నిర్మోచన నగరంలో శ్రీకృష్ణుడు ఆరువేల మంది అసురులను చంపి అసంఖ్యాక ఆయుధాలను ముక్కలుగా చేసి మురాను, రాక్షసులను చంపి, ఆ తరువాత ప్రాగ్జ్యోతిషా అనే నగరంలోకి ప్రవేశించాడు. అక్కడే శక్తివంతమైన ’నరకుడు, కృష్ణుల మధ్య ప్రచ్చన్నయుద్ధం జరిగింది. తరువాత నరకుడు కృష్ణుడి చేత చంపబడ్డాడు. భూదేవి కుమారుడు (భూమి-పుత్ర లేదా భౌమా) నరక, మురను చంపిన తరువాత అధితి కుండలాలను తీసుకుని ఆభరణాల కృష్ణుడు తిరిగి వచ్చి అపురూపమైన కీర్తితో అలంకరించబడ్డాడని (5,48). (12,339)లో పేర్కొన్నారు.
  • కృష్ణుడు ప్రగ్జ్యోతిషపురానికి వెళ్ళినప్పుడు దానవులందరితో కలిసి ప్రయత్నించినా అతడిని పట్టుకోవడంలో నరకుడు విజయం సాధించలేదు. (5,130)
  • వాసుదేవ కృష్ణుడు, ఆయన సైన్యం ప్రాగ్జ్యోతిషపురం వద్ద పోరాడుతున్నప్పుడు కృష్ణుడి బంధువు, శత్రువు అయిన చేదిరాజు శిశుపాలుడు వచ్చి వాసుదేవ కృష్ణుడు నివసించే యాదవుల రాజధాని ద్వారకను తగలబెట్టాడు. (2,44)
  • సాల్వారాజు విలువైన లోహాలతో నిర్మితమైన రధం ఆయన ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళగల సామర్థ్యం కలిగి ఉంది. ​​అందరినీ కలవరపెడుతూ ఆరధం తిరిగి ప్రాగ్జ్యోతిషపురం వద్ద కనిపించింది! (3,22)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mukunda Madhava Sharma (1978),Inscriptions of Ancient Assam, p.221, p.p.366, Department of Publication, Gauhati University
  2. "...the passages in questions may not be much earlier than the first century." (Sircar 1990, p. 81)
  3. (Sircar 1990, p. 81)
  4. (Sircar 1990, p. 81)
  5. Hasmukhlal Dhirajlal Sankalia, Bhaskar Chatterjee, Rabin Dev Choudhury (1989), History and archaeology: Prof. H.D. Sankalia felicitation volume, p.59, p.p 416, Ramanand Vidya Bhawan
  6. S. Sasanananda (1986), History of Buddhism in Assam, c. 300 B.C.-1200 A.D, p.6, p.p.264, Bahri Publications
  7. Suniti Kumar Chatterji (1970), The Place of Assam in the History and Civilisation of India, p.15, p.p.83, Department of Publication, University of Gauhati

వనరులు

[మార్చు]
  • Sircar, D C (1990), "Epico-Puranic Myths and Allied Legends", in Barpujari, H K (ed.), The Comprehensive History of Assam, vol. I, Guwahati: Publication Board, Assam, pp. 79–93

అదనపు అధ్యయనం

[మార్చు]