వైదిక నాగరికత

వికీపీడియా నుండి
(వేద కాలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మలి వేదకాలం (క్రీ.పూ 1100 - 500) నాటి రాజ్యాల చిత్రపటం.

వేద నాగరికత లేదా వేద కాలం అనేది సుమారు క్రీస్తు పూర్వం 2000 - 1000 గల మధ్యకాలం. ఈ కాలం లోనే చతుర్వేదాలలో పురాతమైన ఋగ్వేదం రచింపబడినది అని చెప్పబడుతుంది.ఋగ్వేదం ప్రకారము శబ్దపరంగా ఆర్యన్‌ అంటే ఉత్తమ జన్మ అని అర్దం. ఋగ్వేదంలో ఆర్యుల ప్రస్తావన కలదు కనుక ఆర్యులు మధ్య ఆసియాకు చెందిన వారని మాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు కాని ఈ సిద్దాంతాన్ని చాలా మంది వ్యతిరేకించారు. [note 1]భారత దేశ సాహిత్యానికి ప్రధాన ఆధారం వేదసాహిత్యం. ఈ వేద సాహిత్యం నుంచే మిగతా సాహిత్యం పుట్టింది. నాలుగు వేదాలు, వాటి అనుబంధాలు సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉపవేదాలైన ఆయుర్వేదం, ధను, గాంధార, శిల్పవేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు, ఇతిహాసాలు అలాగే రుగ్వేద, మలివేద కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రధానమైనది. రుగ్వేదంలోని 10వ మండలం పురుషసూక్తంలో వర్ణవ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొనబడింది. అధర్వణ వేదంలో గోత్ర వ్యవస్థ గురించి పేర్కొనగా అది తర్వాత కాలంలో కుల వ్యవస్థకు రూపకల్పన అయింది. యజ్ఞయగాది క్రతువుల నిర్వహణ, సంగీతానికి ఆధార గ్రంథాలు కూడా ఈ వేదాలే. ఇక్కడ రాజకీయ వేద నాగరికత కాకుండా సాహిత్యం, వేదకాలంలో మహిళ పరిస్థితి అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఉదా: రుగ్వేద కాలంలో మహిళకు పురుషునితోపాటు సమాన హోదా ఇవ్వగా మలివేదకాలంలో స్త్రీ పరిస్థితి దిగజారింది. అపాల, విశ్వవర, గార్గి, మైత్రేయి వంటి స్త్రీల గురించి, మత విధానం గురించి ఉంది.

ఆర్యుల చోరబాటు సిద్ధాంతం[మార్చు]

ఈ సిద్ధాంతం ప్రకారం వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశం లోకి ప్రవేశించాయి.

• వేదకాలపు ఆర్యులు 1,500 మరియు 1,200 B.C మధ్య భారతదేశం లోకి ప్రవేశించారు.[2][3]

• ఆర్యులు తమ వద్ద వున్న సాధనాలతో (గుర్రాలు మరియు ఇనుప ఆయుధాలు) ద్రవిడులను లోంగదీసుకున్నారు.

• ఆర్యులు వేద సంస్క్రతిని ప్రవేశపెట్టారు.

• ఆర్యుల చొరబాటు సిద్ధాంతం ప్రకారం వారి సంస్క్రతి ఇతర దేశాలిది.

కాని ఫ్రలేస్ పారడాక్స సిద్ధాంతం ప్రకారం ఆర్యుల ఉనికి లేని 2500 సింధు నాగరికత పట్టణాలు మరియు వేద లిపులు అనేకం ఉన్నాయి. ఆర్యుల ఉనికి సంబంధించిన బలమాన ఆధారాలు లేవు.

వేద నాగరికత పై విమర్శలు[మార్చు]

పూర్వం బ్రిటిషు తత్వవేత్తలు వారి ఆదిపత్యం కోరకు మరియు వారి మతఆచారాల వ్యాప్తి కోరకు వేదకాలంలో విరసిల్లిన వేదాలపై అనేక సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు.వారి ప్రకారం వేదకాలంలో విరసిల్లిన వేదాలు కేవలం పురాణాలుగా మాత్రమే చూసారు.

మాక్స్ మూల్లర్[మార్చు]

ప్రముఖ బ్రిటిషు సంస్క్రత అనువాదకర్త మరియు తత్వవేత్తైన మాక్స్ ముల్లర్ వేదాలు చాలా నిచమైనవి భారతదేశం వాటి అధ్యయణం చేయడం మాని చదువుపరంగా అధ్యయణం చేయండి అని మరియు వేదాలు వాటి మతాలు దుర్బరమైనవి అని వేదాలను విమర్శించారు.[4]

థామస్ మకాలే[మార్చు]

మొట్టమొదటిగా ఇంగ్లీషు విద్యను భారతదేశంలో ప్రవేశ పెట్టిన థామస్ మకాలే ఈ విదంగా చెప్పాడు. భారతీయులు కేవలం రక్తము మరియు రంగు పరంగానే కాని ఆంగ్లం నీతి, రుచి అభిప్రయాల పరంగా అని భారతీయులను విమర్శించాడు. [4] పూర్వ బ్రిటిషు తత్వవేత్తల సిద్ధాంతం:

• వేద వైభవం ప్రక్కకు పెట్టి ఆర్యుల సిద్ధాంతం ప్రవేశపెట్టారు.

• వారు ఆంగ్ల వధ్యను ఉన్నతమైనదిగా భావించారు.

• వారు సంస్క్రత భాషను ప్రక్కదోవ పట్టించారు.

• వారి సిద్దాంతాలతో భారతీయులను మరియు వారి సంస్క్రతులను కించపరిచారు.

• ఈ సిద్ధాంతాలు అన్ని భారతీయుల ఆవిర్బావం ఒక తేగ ద్వారా వ్యప్తిచెందబడిందిగా సృష్ఠించారు.

తాజా శాస్త్రీయ అధ్యయాలు ఆర్యుల సిద్ధాంతాన్ని ప్రశ్నార్దకంగా మార్చాయి.

అర్ధర్ స్కోపెన్హాయర్[మార్చు]

కాని జర్మన్ కు చెందిన ప్రఖ్యాత తత్వవేత్తైన అర్ధర్ స్కోపెన్హాయర్ మాత్రం వేదాలపై తత్వవేత్తలు మరియు చరిత్రకారులు బడికి వెళ్ళే పిల్లలు వలె వ్యవహరిస్తున్నారని విమర్శించాడు.[4]

ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన[మార్చు]

ఋగ్వేదములో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడింది. మొత్తం అరవై పర్యాయములు (ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12.) ఈ సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. సరస్వతి నది భారతదేశం లోనిదని తాజా అధ్యయణాలు చెప్పుతున్నాయి.ఒకప్పుడు ప్రవహించిన సరస్వతి నది గుజరాత్ ఎడారిలో ఎండిపోయిందని రుజువైంది.కనుక ఈ ప్రస్తావన ఆర్యుల సిద్ధాంతానికి ఒక పెను సవాలుగా మారింది.సరస్వతి నది 4000 BC మరియు 3000 BC మధ్య సమయంలో ఎండిపోయిందని రుజువైంది.

అసలు లేదు అని ప్రచారం చేయబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని ఋజువులు దొరికాయి. Michel Danino గారు సరస్వతి నది మీద అనేక పరిశోధనలు చేసి, పురాతన గ్రంథాలు, చారిత్రిక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలు, పురావస్తు శాఖ Archaeological Survey of India వద్ద ఉన్న సమాచారం, రాజస్థాన్లో చెరువుల మీద చేసిన Pollen Analysis, Oxygen-Isotope ratios మీద జరిగిన పరిశోధనా వివరాలు, Remote Sensing satellite చిత్రాలు మొదలైనవాటిని ఎంతో శ్రమతో సంపాదించి అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. ఈ నది ఎండిపోవడానికి గల కారణాలు, నది ఏఏ ప్రాంతాల్లో ప్రవహించిందో వంటివి చిత్రాల్లో, మ్యాప్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు.[5]

4000 BCలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభయ్యిందని, ఎండిపోయిన సరస్వతీ నది గర్భం చిత్రాలు మొదలైనవి అత్యాధునిక Satellite SPOT ద్వారా బయటపెట్టారు ఫ్రెంచి శాస్త్రవేత్త, Henri Paul Franc-Fort.

వీళ్ళ పరిశోధనల ప్రకారం ఋగ్‌వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు 4000 ఏళ్ళ క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం.

దీని తోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కూడా ఈ నది మూలాలు, ఉనికి గురించి కనుక్కునే ప్రయత్నం చేసింది. Indian Remote Sensing Satellite సమాచారం, Digital elevationతో కొన్ని చిత్రాలను విడుడల చేసింది. Palaeo channels (నది యొక్క పాత ప్రవాహ మార్గం) ను కనుగొనె ప్రయత్నం చేసింది. Palaeo channelsతో పురాతన అనావాళ్ళను, చారిత్రిక ప్రదేశాలను, hydro-geological data, drilling dataను పోల్చి చూసింది. సరస్వతీ నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహించిందని తేల్చారు.హరప్ప నాగరికతకు (Harappa Civilization) చెందిన కాలిబంగనన్ (Kalibangan (Rajasthan) ) వంటి ముఖ్యమైన ప్రదేశాలు, Banawali, Rakhigarhi (Haryana), Dholavira, Lothal (Gujarat), అన్నీ కూడా సరస్వతీ నది వెంబడి ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.[6]

సరస్వతీ నది ఎక్కడ, ఎప్పుడు ప్రవహించింది? దానికి ఋజువులేంటి?

సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రబహించి అరేబియా సముద్రంలో కలిసేది (గంగ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల (హిమాలయాల) నుంచి కొండల ప్రాంతంగుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం అని చెప్పబడింది.[7]

వేద సాహిత్యాన్ని అభినందించిన తత్త్వవేత్తలు[మార్చు]

నేను వేదాలను క్షున్నంగా సమికరించాను గొప్ప అలోచనలకు గురైయ్యాను అలాగే ఉన్నతమైన మరియు గణమైన ఆద్యాత్మికతకు లోనైయ్యాను
                                           ----- అర్ధర్ స్కోపెన్హాయర్[8]

ప్రముఖ అమెరికా రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ తాను రోజు వేదాలు చదుపుతాడని వ్యక్తిగతంగానే చెప్పాడు.

నేను ఒక దివ్యమైన రోజును భగవత్గీతకు కేటాయించేవాడిని
                                       ------ఎమర్సన్[9]

మూలాలు[మార్చు]

  1. Oberlies (1998:155) gives an estimate of 1100 BCE for the youngest hymns in book 10. Estimates for a terminus post quem of the earliest hymns are more uncertain. Oberlies (p. 158) based on 'cumulative evidence' sets wide range of 1700–1100
  2. ది క్వెస్ట్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ వేదిక్ కల్చర్: ది ఇండో-ఆర్యన్ మైగ్రేషన్ డిబేట్Aryan Migration Debate, Edwin Bryant, 2001
  3. Trivedi, Bijal P (2001-05-14). "Genetic evidence suggests European migrants may have influenced the origins of India's caste system". Genome News Network. J. Craig Venter Institute. Retrieved 2005-01-27.
  4. 4.0 4.1 4.2 వేదకాలంలో గల వేదాలు శాస్త్రీయంగా భారతదేశానివే అని మరియు ముందు నిర్ణయించిన కాలానికంటే పురాతనమైనవని శాస్త్రవేత్తలు వెల్లడించారు
  5. Danino 2010.
  6. Vedic period Saraswati and Hindu civilization,Edited by S.Kalyanraman (2008),ISBN 978-81-7305-365-8 p. 308
  7. The lost River:On the trails of saraswathi by Danino
  8. The World as Will and Representation Preface to the first edition, p. xiii
  9. http://www.rickjarow.com/Emerson's Gita. Emerson reads Geetha
  1. The precise time span of the period is uncertain. Philological and linguistic evidence indicates that the Rigveda, the oldest of the Vedas, was composed roughly between 1700 and 1100 BCE, also referred to as the early Vedic period.[1]