Jump to content

క్రీస్తు పూర్వం

వికీపీడియా నుండి
ఆస్ట్రియాలోని క్లాగన్‌ఫర్ట్ కేథడ్రల్‌లో అన్నో డొమిని శాసనం

కాల గమనాన్ని కొలవడం

[మార్చు]

పంచాంగాలలో కాని కేలండర్ లలో కాని కాల గమనాన్ని కొలవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. చరిత్రలో "ఏయే సంఘటనలు ఎప్పుడు జరిగాయి?" అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక నిర్ధిష్టమైన సంఘటనని ప్రమాణంగా తీసుకుని అక్కడ నుండి కాలగమనాన్ని లెక్క పెట్టవచ్చు. ఈ పద్ధతి ప్రకారం భారతదేశంలో శాతవాహన శకం లేదా శాలివాహన శకం వాడుకలోకి వచ్చేయి. ఇదే విధంగా వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులు వెలిసేయి. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతం ప్రబలంగా ఉండబట్టి ఆయా సమాజాలలో ఏసు క్రీస్తు పుట్టిన సమయం నుండి క్రీస్తు శకం అని లెక్క పెట్టడం మొదలు పెట్టారు. క్రీస్తు పుట్టక మునుపు జరిగిన సంఘటనలని క్రీస్తు పూర్వం అని వెనక్కి లెక్కపెట్టడం మొదలు పెట్టారు. దీనిని ఆంగ్లంలో Before Christ అంటారు. ఆంగ్లంలో BC లేదా B.C. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో క్రీ.పూ లేక క్రీస్తు పూర్వం అని వాడడం జరుగుతుంది. క్రీస్తు పుట్టిన తరువాత కాలాన్ని ఇంగ్లీషులో AD అని కాని A.D. అని కాని రాస్తారు; అంటే లేటిన్ భాషలో "Anno Domini" లేదా ఇంగ్లీషులో ""In the year of the Lord." మనం శాలివాహనుడి నుండి లెక్క పెడితే వారు కీస్తు నుండి లెక్క పెట్టేరు.

వలస యుగం

[మార్చు]

వలస యుగంలో పాశ్చాత్య ప్రభావం ప్రపంచ వ్యాప్తం అవడంతో వారి పద్ధతులు మనం అంతా అవలంబించక తప్ప లేదు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచీకరణ ద్వారా భూగోళం కుచించుకు పోతూంది. వార్తా ప్రచార సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంలో "క్రైస్తవుల పద్ధతే ఎందుకు అవలంబించాలి?" అనే ప్రశ్న ఉదయించడం సహజం. అందుకని ఇరవయ్యవ శతాబ్దపు చివరి రోజులలో కాల గమనాన్ని లెక్కించే పద్ధతి సర్వులకి ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుందనిపించి చిన్న మార్పు తీసుకు వచ్చేరు. క్రీస్తు శకం (Anno Domini or AD) అని అనడానికి బదులు CE (ommon Era, సాధారణ శకం) అని ప్రతిపాదించేరు. అదే విధంగా BC ని BCE (Before Common Era) మార్చమన్నారు. ఈ ప్రతిపాదనని క్రైస్తవులు తేలికగా అంగీకరించడానికి కారణం CE అంటే Chritian Era అని అనుకోడానికి అవకాశం ఉంది కదా.

పూర్వపు BC/AD పద్ధతిలో ఇబ్బందులు లేకపోలేదు. మొదటి ఇబ్బంది సౌష్టవం. BC అన్నది Before Christ అనే ఇంగ్లీషు సమాసానికి క్లుప్తం కాని AD అన్నది Anno Domini అనే లేటిన్ సమాసానికి క్లుప్తం. వ్యాకరణం ప్రకారం ఇది "దుష్ట జంట." రెండవ ఇబ్బంది ఏమంటే చాల మంది AD అంటే After Death అనుకుంటారు; కాని అది సరి కాదు. మూడవ ఇబ్బంది ఏమంటే నిజానికి ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టేడో ఎవ్వరికీ తెలియదు. అందుకని CE ని Common Era ( సామాన్య శకం) అంటే ఏ ఇబ్బందీ ఉండదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]