మధురం

వికీపీడియా నుండి
(తీపి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మధురం లేదా తీయదనం అనగా తీపి రుచి. ఇది ఆరు ప్రాథమిక రుచులైన షడ్రుచులలో ఒకటి.

లక్షణాలు[మార్చు]

మనం భుజించే ఆహారపదార్ధాలలో ముఖ్యంగా పిండిపదార్ధాలు తియ్యగా ఉంటాయి. మన శరీరంలో ఎక్కువగా ఉండేది ఈ రసమే. ఇది శరీర నిర్మాణానికి, శక్తి, ప్రుగుదలకి ఉపయోగపడుతుంది. శరీరానికి, మనసుకి చక్కటి సమన్వయాన్ని ఇది కలుగ జేస్తుంది. ఇది ఒక సంతృప్తినిచ్చే రసం. మన శరీరంలోని ద్రవాల్ని ముఖ్యంగా ప్రత్యుత్పత్తి చేసే రసాలను ఇది తయరు చేస్తుంది. శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ఈ రసం సాధారణంగా ఆహార పదార్థాలన్నిటిలోనూ ముఖ్యంగా ఉంటుంది. దీని నిర్మాణానికి వస్తే ఇది ముఖ్యంగా భూమి, నీరు అనే మూలకాలతో నిర్మితమై ఉంటుంది. ఇది తీసుకున్నపుడు మన శరీరంలోని వాతం తగ్గుతుంది. కఫం పెరుగుతుంది.పిత్తం కూడా తగ్గుతుంది. దీనిని ఎక్కువగా తీసుకున్నప్పుడు అధిక బరువు, శరీరంలో విషపదార్థాల యొక్క పెరుగుదల, క్రిములు పెరగడం, షుగర్ వ్యాధి, గ్యాస్ పెరగడం, అజీర్ణం ఒక్కోసారి బద్దకం కూడా పెరిగే అవకాశం ఉంది.

తీపి పదార్ధాలు[మార్చు]

వివిధ పదార్ధాల తీయదనం[a][1][2][3][4][5]
పేరు పదార్థం తీయదనం
లాక్టోజ్ డై శాకరైడ్లు 0.16
మాల్టోజ్ డై శాకరైడ్లు 0.33 – 0.45
గ్లూకోజ్ మోనో శాకరైడ్లు 0.74 – 0.8
సుక్రోజ్ డై శాకరైడ్లు 1.00 (reference)
ఫ్రక్టోజ్ మోనో శాకరైడ్లు 1.17 – 1.75
సోడియం సైక్లమేట్ సల్ఫొనేట్ 26
స్టెవియోల్ గ్లైకోసైడ్ గ్లైకోసైడ్ 40 – 300
ఆస్పర్టేమ్ డైపెప్టైడ్ మిథైల్ ఎస్టర్ 180 – 250
సోడియం సాకరిన్ సల్ఫోనైన్ సమ్మేళనం. 300 – 675

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. John McMurry (1998). Organic Chemistry (4th ed.). Brooks/Cole. p. 468. ISBN 0132862611.
  2. Svrivastava, R.C.; Rastogi, R.P (2003). "Relative taste indices of some substances". Transport Mediated by Electrical Interfaces. Studies in interface science. 18. Amsterdam, Netherlands: Elsevier Science. ISBN 0-444-51453-8 B.V Check |isbn= value: invalid character (help). Retrieved 12 September 2010  Taste indices of table 9, p.274 are select sample taken from table in Guyton's Textbook of Medical Physiology (present in all editions)CS1 maint: Multiple names: authors list (link)
  3. McLaughlin, Susan; Margolskee, Rorbert F (November–December 1994). "The Sense of Taste". American Scientist. 82 (6): 538–545.CS1 maint: Multiple names: authors list (link)
  4. Joesten, Melvin D; Hogg, John L; Castellion, Mary E (2007). "Sweeteness Relative to Sucrose (table)". The World of Chemistry: Essentials (4th ed.). Belmont, California: Thomson Brooks/Cole. p. 359. ISBN 0-495-01213-0. Retrieved 14 September 2010.CS1 maint: Multiple names: authors list (link)
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).

యితర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మధురం&oldid=2332640" నుండి వెలికితీశారు