మధుసూదన సరస్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మధుసూదన సరస్వతి (క్రీ. శ. 1540-1640) ఒక భారతీయ తత్త్వజ్ఞుడు. ఆయన అద్వైత పరంపరలో వేదాంతి [1].

బాల్యం[మార్చు]

ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరిద్పూర్ జిల్లా లోని కోటలిపాడా అనే ఊరిలో ప్రమోద పురందర ఆచార్యునికి సంతానంగా మధుసూదన సరస్వతి జన్మించారు. వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కమలనయనుడు[1].

సన్న్యాసం[మార్చు]

మధుసూదన సరస్వతి తొలుత పశ్చిమ బెంగాల్ లోని నవద్వీపంలో నవ్యన్యాయ దర్శనాన్ని చదువుకున్నారు. నవ్యన్యాయ పద్ధతి అద్వైతాన్ని ఖండిస్తుంది. అందుచేత అద్వైతులతో వాదించడానికని అద్వైతంలో లోటు పాట్లని అర్థం చేసుకోవడం కోసం వారణాసికి వెళ్ళి అభ్యాసం మొదలుపెట్టారు. చివరకు అద్వైతంలోని లోతులు తెలుసుకుని అద్వైతిగా సన్న్యసించారు. వీరి గురువు పేరు విశ్వేశ్వర సరస్వతి[1].

ద్వైత-అద్వైత వాదాలు[మార్చు]

ద్వైత సిద్ధాంత గురువులైన వ్యాసతీర్థ వారు "న్యాయామృత" అనే గ్రంథంలో అద్వైతాన్ని ఖండిస్తూ వేసిన ప్రశ్నలకు మధుసూదన సరస్వతి అద్వైత సిద్ధి అనే రచనలో లోతైన సమాధానాలను ఇచ్చారు[2]. ఇది చాలా ప్రాచుర్యం ఉన్న గ్రంథం[3]. అంతే కాక ఇతర రచనలలో సాంఖ్యం, నవ్యన్యాయం మొదలైన దర్శనాలను కూడా తర్కబద్ధంగా ఖండించారు.

రచనలు[మార్చు]

మధుసూదన సరస్వతి వేదాంతం, భక్తి, శాస్త్రం మొదలైన అంశాల గురించి చాలా రచనలు చేసారు. వీరు శంకరాచార్యుల వలే, అద్వైతంలోని లోతులను చూసినప్పటికీ, నిత్యజీవితంలో భక్తికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఈయన రచనలు: వేదాంత కల్ప లతికా, అద్వైత సిద్ధి, అద్వైత మంజరి, అద్వైత రత్న రక్షణ, ఆత్మ బోధ టీకా, ఆనంద మందాకిని, కృష్ణ కుతూహల నాటక, ప్రస్థాన భేద, భక్తి సామాన్య నిరూపణ, భగవద్గీత గూఢార్థ దీపిక, భగవద్ భక్తి రసాయన, భాగవత పురాణ ప్రథమ శ్లోక వాక్య, వేద స్తుతి టీకా, శాండిల్య సూత్ర టీకా, శాస్త్ర సిద్ధాంత లేశ టీకా, సంక్షేప శారీరక సార సంగ్రహ, సిద్ధాంత తత్త్వబిందు, హరిలీలా వ్యాఖ్య [3].

వీటిలో అద్వైతసిద్ధి, భగవద్గీత గుఢార్థ దీపిక, ప్రస్థానభేద చాలా ప్రాచుర్యం ఉన్నాయి.

ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Sures Chandra Benarji, A Companion to Sanskrit Literature, జనవరి 1989, 62వ పుట "http://books.google.com/books?id=JkOAEdIsdUsC&lpg=PA62&ots=SM8fpYHUzn"
  2. ఆనంద్ హుడ్లీ, అంతర్జాలంలో అద్వైత సిద్ధి ఆంగ్లానువాదం, 2009, "http://www.advaitasiddhi.org/"
  3. 3.0 3.1 Surendranath Dasgupta, A History of Indian Philosophy - Volume 2 of 5, 225వ పుట, "http://books.google.com/books?id=dU2E6Ns1u28C"