మృకండు మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృకండు మహర్షి
జీవిత భాగస్వామిమరుద్మతి
పిల్లలుమార్కండేయుడు

మృకండు మహర్షి మృగశృంగ మహర్షి కుమారుడు. ఈతని కుమారుడే మార్కండేయుడు. భారతీయ చేనేత కులానికి చెందినవాడు. పురాణం ప్రకారం, అతను పద్మం దళముల నుండి నుండి బట్టలు నేసిన మొట్టమొదటివాడు, అతని గొప్ప నైపుణ్యం ఫలితంగా దేవతలచే అనేక వరాలు పొందాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మృగశృంగ మహర్షి తపశ్శక్తిచే చనిపోయిన సువృత్తను మరల బ్రతికించాడు. సువృత్త తండ్రి నుచథ్యుడు తన కూతురిని, ఆమె ముగ్గురు చెలికత్తెలైన కమల, విమల, సురసలను ఆతని కిచ్చి వివాహము చేశాడు. వారు నలుగురు మహర్షులను సేవలతో సంతోషపెట్టారు. అతడును వారిపట్ల సమాన ప్రేమను చూపెడుతూ ఆనందపరిచాడు. వారు నలుగురు ఒక్కసారిగా గర్భములు ధరించి నలుగురు పుత్రులను కన్నారు. అందులో సువృత్త కుమారుడే మృకండుడు. కమల కుమారునికి ఉత్తముడు, విమలకు సుమతి, సురసకు సువ్రతుడు అని పేర్లు పెట్టారు. మృకండుడికి మార్కండేయుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు.[2]

చేనేత స్థాపకుడిగా మృఖండుడు గౌరవించబడ్డాడు. దేవతల వల్ల అతనికి రెండు వరాలు లభించాయి. మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Graham Seal; Kim Kennedy White (14 March 2016). Folk Heroes and Heroines around the World, 2nd Edition. ABC-CLIO. pp. 169–. ISBN 978-1-4408-3861-3.
  2. The Vishnu Purana a System of Hindu Mythology and Tradition Translated from the Original Sanskrit, and Illustrated by Notes Derived Chiefly from Other Puranas by the Late H.H. Wilson: 1. Trubner. 1864. pp. 152–.
  3. A. L. Dallapiccola (November 2003). Hindu Myths. University of Texas Press. pp. 15–. ISBN 978-0-292-70233-2.
  4. John Dowson (1888). A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. Trübner & Company. pp. 203–.
  • మహర్షుల చరిత్రలు (ఏడవ సంపుటము), విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.