ఎక్కిరాల వేదవ్యాస
డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస (1934) ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ (యునైటెడ్ సోషల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా - USCEFI) వ్యవస్థాపకులు, విద్యా వేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, వివిధ దేవాలయాల ప్రతిష్ఠాపకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు, మహోపన్యాసకులు, ఆధ్యాత్మిక పరిశోధకులు, రచయిత, యోగ, ఆధ్యాత్మిక గురువు.
ఎక్కిరాల వేదవ్యాస | |
---|---|
జననం | శ్రీమాన్ ఎక్కిరాల వేదవ్యాస 1934 ఆగస్టు 13 ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల |
వృత్తి | ఐ.ఏ.ఎస్ అధికారి |
ప్రసిద్ధి | ఆధ్యాత్మిక గురువు, యునివర్సిటి ఆఫ్ వేదిక్ సైన్సెస్ వ్యవస్థాపకులు, అనేక సద్ గ్రంధముల రచయిత, పరిశోధకులు |
తండ్రి | శ్రీమాన్ అనంతాచార్యులు |
తల్లి | శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి (బుచ్చమ్మ గారు) |
Notes Siblings :ఎక్కిరాల కృష్ణమాచార్య, ఎక్కిరాల బోధాయన, ఎక్కిరాల భరద్వాజ |
జీవిత విశేషాలు
[మార్చు]ఎక్కిరాల వేదవ్యాస ఆంధ్రప్రదేశ్కు చెందిన బాపట్లలో శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యులు, శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి (బుచ్చమ్మ గారు) దంపతులకు 1934 ఆగష్టు 13న జన్మించారు. వీరు గురుకుల విధానంలో విద్యాభ్యాసం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రం ఎం.ఎస్.సి. పూర్తిచేసి లయోలా కళాశాలలో జంతుశాస్త్ర విభాగానికి ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు 1959 ఉత్తీర్ణులైన పిదప ఢిల్లీలో పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో ఎం.ఫిల్ చేశారు.[1] వీరు 1955 జూన్ 2న రాణి సంయుక్తావ్యాస్ ను వివాహమాడారు.[2] వేదవ్యాస 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పి.హెచ్.డి చేశారు. వీరు పరిశోధన అంశం: మహా భారత యుద్ధం ఖగోళ కాల నిర్ణయము.
ఐ.ఎ.ఎస్. పూర్తయిన పిదప వీరు ప్రభుత్వ సర్వీసులో 1959 నుండి వివిధ పదవులను నిర్వహించారు. వాటిలో కర్నూలు జిల్లా స్పెషల్ కలెక్టర్, డిప్యూటీ సెక్రటరీ లాండ్ రెవెన్యూ, మేనేజింగ్ డైరెక్టర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, డైరెక్టర్ యూత్ సర్వీసులు, సెక్రటరీ టు కమిషనర్ లాండ్ రెవెన్యూ, డైరెక్టర్ ఆఫ్ లాటరీలు, రెవెన్యూ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ రెప్రాన్ ఫుడ్స్, ఎడిటర్ ఆఫ్ స్టేట్ గెజటీర్ [3] నిర్వహించారు.
ఆంధ్ర దేశంలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూనే 150కి పైగా తెలుగులో, ఇంగ్లీషులో అనేక పరిశోధన గ్రంథాలు రచించారు. వీరి గ్రంథాలు, ఆధ్యాత్మిక విషయాలు సైన్సు పరమైన విశ్లేషణతో, సైన్సు పరమైన సాక్ష్యాధారాలతో చదివిన వారిని ఆలోచింప చేసేవిగా ఉండటం గమనార్హం. హిందూ మతం మూలాలని సులభ శైలిలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా అందించిన రచనా సామర్థ్యం వీరిది.
వీరి జీవిత ఆశయం అయిన యునివర్సిటి ఆఫ్ వేదిక్ సైన్సెస్ - భారతదేశంలో మన సనాతన ధర్మం ప్రతి ఒక్క విద్యార్థి అర్థంతో సహా విద్యాభ్యాసంలో భాగంగా నేర్చుకోవాలని, భారత దేశ ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టాలని, తద్వారా దేశం లోని పౌరులు సత్యవంతులూ, ధర్మపరులూ, సంస్కారవంతులూ, అదృష్టవంతులూ అయి మన దేశం తిరిగి రామ రాజ్యంలో వలె ఉండాలని, దీనిని అమెరికాలో రిజిస్టర్ చేసి, కొంత మంది విద్యార్థులను ఆంధ్రలో తయారు చేశారు. ఈ యునివర్సిటి ఇప్పుడు వారి శిష్యుల చేత నడుపబడుతోంది.
ఎన్నో భక్తి సంబంధ ఉపన్యాసాలు ఇచ్చారు. అనేకులకు జీవన మార్గ దర్శకులు .శుభవార్త అనే ఆధ్యాత్మిక - జ్యోతిష్య - యోగ - సాహిత్య మాస పత్రికను అప్పటి ఇప్పటి దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా, కేవలం ధర్మ ప్రచారం కోసమూ, వ్యాపార దృక్పథం లేకుండా, ఎంతో మందిని నిస్వార్థ సేవ చేయడానికి ఉత్సాహ పరచి, అటువంటి నిస్వార్థ సేవ చేసే వారికి అనుగ్రహ ఆశీస్సులను ఇస్తూ, 1975 నుండి ఈ పత్రికను నడిపిస్తున్నారు. వీరు 2007 అక్టోబరు 03 న భగవదైక్యం పొందారు.
రచనలు
[మార్చు]- శ్రీ గణేశ పురాణం 1,2 volumes.
- వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర.
- గురుదేవుల జీవిత సంగ్రహం.
- మహాభారత కాలనిర్ణయం.
- ప్రాచీన భగవద్గీత.
- ఇండియాలో జీసస్.
- శ్రీ వేంకటేశ్వర వైభవం 1, 2, 3, 4 భాగాలు .
- యుగ పురుషుడు (శ్రీ కృష్ణుని పై చారిత్రక- పరిశోధన గ్రంథం).
- హస్త సాముద్రికము.
- శ్రీ దేవీ సప్త శతి.
- మంత్ర శాస్త్ర రహస్యాలు.
- 1999 కలియుగాంతం-కాల జ్ఞానం-1
- 1999 కలియుగాంతం-కల్కిభగవానుడు-2
- 1999 కలియుగాంతం-"శంబల"-రహస్యాలు-3
- రామానుజ వైభవం - I.
- రామానుజ వైభవం - II.
- వేదాలలో రహస్యాలు.
- శ్రీ గురు గీత.
- నిత్య పూజకు చదువ వలసిన స్తోత్రాలు.
- శ్రీ విష్ణసహస్రనామ స్తోత్రము.
- శ్రీ లక్ష్మీ సహస్ర నామ స్తోత్రము.
- శ్రీ విష్ణు సహస్ర నామ నవనీత వ్యాఖ్యానము- vol-I.
- శ్రీ విష్ణు సహస్ర నామ నవనీత వ్యాఖ్యానము- vol-II.
- శ్రీ విష్ణు సహస్ర నామ నవనీత వ్యాఖ్యానము- vol-III.
- అణుయుగంలో హిందూమత౦.
- నిత్యజీవితములో యోగసాధన
- సాధన రహస్యాలు.
- పరాశర జ్యోతిష్యం vol-I.
- పరాశర జ్యోతిష్యం vol-II.
- పరాశర జ్యోతిష్యం vol-III.
- జ్యోతిష గణిత బోధిని.
- జ్యోతిషం సైన్సా ?మూఢ విశ్వాసమా?
- సోవియట్ రష్యాలో సైన్సు పరిశోధనలు.
- నా జీవితంలో అదృష్ట ఘడియలు (మొదటి భాగం).
- మహాత్ములతో నా దివ్యానుభవాలు (రెండవ భాగం).
- నా ఆశ్చర్యానుభవాలు (మూడవ భాగం).
- శంబల ప్రభువు - 1,2 భాగాలు.
- శ్రీ భాగవత రసామృతము (ప్రథమ, ద్వితీయ, తృతీయ స్కంధములు).
- శ్రీ భాగవత రసామృతము (చతుర్ధ, పంచమ, షష్ట స్కంధములు).
- శ్రీ భాగవత రసామృతము (సప్తమ స్కంధము).
- శ్రీ భాగవత రసామృతము (అష్టమ, నవమ స్కంధములు).
- శ్రీ భాగవత రసామృతము (దశమ స్కంధము- ప్రథమ భాగము).
- శ్రీ భాగవత రసామృతము (దశమ స్కంధము- ద్వితీయ భాగము).
- శ్రీ భాగవత రసామృతము (ఏకాదశ, ద్వాదశ స్కంధములు)
- ఏరిన ముత్యాలు.
- శ్రీ సత్యనారాయణ వ్రత రహస్యం - అంతరార్థం.
- శ్రీ సూక్త రహస్యం.
- పురుష సూక్త రహస్యం.
- శ్రీమన్ నారాయణ పరతత్వం.
- సత్సంగం.
- చత్ర పతి శివాజీ vol-I.
- చత్ర పతి శివాజీ vol-II.
- నవగ్రహ శాంతి విధానం.
- సాయినాథ చరిత్ర - పారాయణ గ్రంథము.
- హాజీ వారిస్ ఆలీషా (షిరిడీ సాయబాబా సద్గురువు).
- ప్రాచీన భగవద్గీత vol I&II.
- తిరుప్పావై (ధనుర్మాస వ్రత పారాయణ గ్రంథం).
- మన దేశం - మన సంస్కృతి.
- మన సనాతన ధర్మం - జాతీయ విద్య.
- మనము- మన సమాజము.
- శ్రీ విద్యారణ్య స్వామి చరత్ర (హిందూ రాష్ట్ర స్థాపకుడు).
- అదృష్ట ఘడియలు.
- మీ ఇంటిని బట్టి అదృష్టం.
- మీ జన్మ తేదీలో మీ అదృష్టం.
- నవ్వితే నవ రత్నాలు.
- డాక్టర్ లేకుండా ఆరోగ్యం.
- మీరు ఎప్పుడైనా మరణించారా?
- భగవంతుని దీపాలు.
- మన సనాతన ధర్మం - జాతీయ విద్య.
- ఆగమ శాస్త్ర రహస్యాలు.
- దేవాలయ ప్రసాదాలు.
- మన పంచాంగ రహస్యాలు.
- వేదాలలో హిందూ మతం vol-I.
- వేదాలలో హిందూ మతం vol-II (సనాతన హిందూ మతంలో పునర్జన్మ).
- వేదాలలో హిందూ మతం vol-III (అవతార సిద్ధాంతం).
- వేదాలలో హిందూ మతం vol-IV (సాధనా మార్గాలు).
- వేదాలలో హిందూ మతం vol-V (దేవతార్చన పూజా విధానం).
- మన్యు సూక్త విధాన శివ పూజా రహస్యం.
- మన పండుగలు.
- ఆయుర్వేద హృదయం.
- నివేదిత.
- శ్రీ రామ చరితామృతం.
- వ్యాస పీఠం.
- వ్యాస గీత.
- మాస్టర్ C.V.V గారి ఎలక్ట్రానిక్ యోగము.
- వ్యాస వాణి (శ్రీ వేదవ్యాస గురుదేవుల అమృత సందేశాలు) -1,2, 3 volumes.
- అదృష్ట రేఖ.
- శ్రీ వేదవ్యాస మహర్షి దివ్య చరిత్ర (telugu, Kannada, English, Hindi).
English Books
[మార్చు]- Hinduism in the Space Age (Hard Bound) .
- Hinduism in the Space Age (paper back).
- Astronomical Dating of the Mahabharata War.
- Science of Time (Hard Bound and paper back).
- Vedic Sciences - What are they?.
- The Concise Text Book of Vedic Hinduism.
- SUPARNA -E.Anantacharya (Foreword by Dr. Vedavyas IAS, Ph.D, D.Litt.).
- Word Of God.
- Ancient Bhagavad Gita (with 745 Slokas).
- Divine Life Of Maharshi Vedavyas.
- 1999 - End of Kali Yuga.
- Dr. Vedavyas - The Saint Of the Space Age.
- Wisdom of Longevity (Ayurveda).
- Master - C.V.V. And His Electronic Yoga (PB & HB).
- Making and Unmaking of India - As A 'Nation'.
- Every thing And Nothing.
- Our Universe.
- Vedic Chandas (Vedic Seminar -4).
- Medical Astrology (Vedic Seminar -5).
- Vedanga Vyakaranam
(Vedic Seminar -6).
- Vedic Sciences in Mahabharata.
మూలాలు
[మార్చు]- ↑ http://www.vedavyasabharati.org/index.html
- ↑ "People Behind the Project". Archived from the original on 2018-01-15. Retrieved 2019-04-30.
- ↑ Dr. Vedavyas, Saint of the Space Age by M.V.S. Prasad, IRS published by Yoga Brotherbood of America USCEFI, Hyderabad-Bangalore, 1990.