సుందర చైతన్యానంద
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీ స్వామి సుందర చైతన్యానంద (ఆంగ్లము : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి, ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా, గాయకుడుగా, బోధకుడుగా, గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
నందానందం హృది కుర్వంతం కృష్ణo మేఘ వినీల రుచిం
దత్వాఽఽనందం రచనాబిః స్వీయాబిః స్వాన్ రామయంత మజం
శ్రీ చైతన్యద్యుతి సందీప్తం భాగ్యం భక్త జనాత్మ్య మిదం
స్వామీ శ్రీ సుందర చైతన్యానందo సత్య సురూప మయే ll.
ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం
[మార్చు]
శ్రోత్రీయ బ్రాహ్మణిష్టా గరిష్ఠులైన పూజ్య గురుదేవుల యాభై వసంతాల పవిత్ర ఆధ్యాత్మిక సేవా ప్రస్థానం (1966 నుండి 2016వరకు) ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ౦ గా కీర్తించబడింది. ఈ సందర్భంగా మార్చి 19 వ తేదీన భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఈ సేవా స్వర్ణోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల ఫోటో ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవరును.[1] పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది. ఈ అరుదైన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు. ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
శ్రీ చైతన్య జయ ధ్వజం
[మార్చు]సర్వజిత్ - మార్గ శీర్ష శ్రీ :
గీతా భాగావతో దయః
జ్ఞానబ్రహ్మార్ష సర్వజ్ఞ
శ్రీ చైతన్య జయ ద్వజః
- శ్రీ సర్వజిత్ వైకుంఠ ఏకాదశి గీతా జయంతీ పరోషస్సున 1947 డిసెంబరు 25 తేది ఉదయం 4: 30 గంటలకు శ్రీ స్వామీజీ వారి ఆవిర్భావ విజయం
- శ్రీ ప్లవంగ వినాయక చతుర్ది 1967 డిసెంబరు 8 వ తేది శ్రీ స్వామిజీ వారి వాగావిష్కార విజయం.
- శ్రీ రక్తాక్షీ కార్తీక కృష్ణ తృతీయ తదియ 1984 నవంబరు 11 వ తేదీ స్వామీజీ వారి ఆశ్రమ స్వీకార విజయం.
- శ్రీక్రోధి ఆశ్వయుజ కృష్ణ తృతీయ చవితి 1985 నవంబరు 14 వ తేదీ స్వామీజీ వారి స్థాపించిన ఆధ్యాత్మిక మాస పత్రిక గిరిధారి ప్రసార విజయం.
- శ్రీ ప్రజాపతి మార్గశీర్ష శుక్ల షష్ఠి 1991 డిసెంబరు 12 వ తేదీ శ్రీ స్వామీజీ వారి జ్ఞాన శతక్రతు విజయం.
- శ్రీ ఈశ్వర మార్గశీర్ష శుక్ల సప్తమి 1997 డిసెంబరు 6 వ తేదీ శ్రీ స్వామీజీ వారి భాగ్యనగర ఆశ్రమ ప్రవేశ విజయం.
- శ్రీ చిత్రభాను జ్యేశ్ట శుక్ల నవమి 2002 జూన్ 19 వ తేదీ శ్రీ స్వామీజీ వారి విశాఖపట్టణ సాగరగట్టాణ తీరాశ్రమ స్తాపాన విజయం.
- శ్రీ వికృతి నామ చైత్ర శుక్ల అష్టమి 2010 మార్చి 23 వ తేదీ శ్రీ స్వామీజీ వారి చైతన్య భగవద్గీతా గ్రంథ ఆవిష్కార విజయం.
ఇంకా
- ఆయుత పత్ర (10,000) రచనాపూర్తి విజయం.
- పంచ సహస్ర (5,000) ప్రవచనా పూర్తి విజయం.
ఇది శ్రీ సుందర చైతన్యానంద స్వామి విజయానుభూతి.
అవతార విశేషం
[మార్చు]1947 వ సంవత్సరం 25 వ తేదీన నెల్లూరు జిల్లా లోని కట్టుబడిపాళ్ళెం అనే గ్రామంలో బ్రహ్మముహూర్తమున వైష్ణవ కుటుంబంలో శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైన మార్గశీర్ష మాసం. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కలసి రావడం విషేషం కాదు, వైభవం.సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం.
శ్రీ పెరుంబుదూరు వేంకట శే షాచార్యులు, రంగనాయకమ్మ అను పుణ్య దంపతులకి శ్రీ స్వామిజీ అష్టమ గర్భ సంజాతులుగా జన్మించారు. స్వామీజీ పూర్వాశ్రమం పేరు శ్రీ సుందర రాజన్. స్వామీజీ పూర్వీకులు ద్రవిడ దేశము వారు. వీరి తాత గారు బాల్య దశలో ఆంధ్రప్రాంతానికి వచ్చారు. చంగల్పట్టు జిల్లా లోని రామానుజాచార్యుల వారి జన్మ స్థలమైన శ్రీ పెరుంబుదూరు వీరి స్వగ్రామము.[2] స్వామి వారి తాతలు విద్వత్తు గల వారై గ్రంథ రచనలు చేసారు. దేవాలయార్చకులుగా, తోమాల సేవకులుగా, గాయకులుగా, భక్తీ ప్రబంధ రచయితలుగా వన్నెకెక్కారు. కవిబ్రహ్మ తిక్కన, కవయిత్రి మొల్ల, జ్ఞాన బ్రహ్మ సుందర చైతన్యులు - ఈ ముగ్గురు సింహపురి సీమలో విరబూసిన జ్ఞాన మందారాలని స్తుతిస్తూ నెల్లూరు పట్టణంలో 15-6-1994 నుండి 24-6-1994 వరకు పూజ్య స్వామీజీ నిర్వహించిన 118 వ జ్ఞాన యజ్ఞంలో పూజ్య స్వామీజీకి కనకాభిషేకం చేసిన సందర్భంలో సింహ పురీయులు ఒక తెలుగు పద్య మందారమును సమర్పించుకుని యున్నారు.
శ్రీ స్వామీజీ బి.ఏ.లిట్ పట్టమును పొందారు. పూప వయస్సు నందే వేదాంత గ్రంథాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. చేతిలో వేదాంత గ్రంథం లేకుండా బాల్యంలో వారు ఎవ్వరికీ కనిపించి ఉండరు. నిత్యమూ నియమముతో ధ్యానము చేసే వారు. భక్తుల కోర్కె మేరకు యజ్ఞాలు ప్రారంభించారు. ప్రతి యజ్ఞంలో వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు వారి ఉపన్యాసాలను ఆలకించేవారు, ఆలకిస్తూ ఉన్నారు.స్వామి వారిది అద్వైత మార్గము. ఆ విషయంలో రాజీ పడకుండా భోదిస్తారు. జ్ఞానమును భక్తిని సమన్వయం చేసి బోధించడం వారి ప్రత్యేకత.
సనాతన ధర్మ మహా సాగరంలో ఉత్తుంగ తరంగాలై ఎగసిన భక్తుల, మహాత్ముల గాథలు చదువుతూ 'ఇవి నిజాలా!' అని సందేహించే ఆధునిక యువతరానికి చక్కని సమాధానం చెబుతుంది స్వామివారి సున్నిత హృదయం, అద్భుత జీవన విధానం.
ఆధ్యాత్మిక స్పూర్తి - అఖండ కీర్తి
[మార్చు]నలబై ఐదు సంవత్సరాల క్రితం మాట ... సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సమాజానికి వాటిని అందిద్దామనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం నూతన తరాన్ని వినూత్న సంశయాలలో ముంచెత్తింది. అర్ధం లేని భౌతిక వాదం, జనులలో పెరిగిన అలసత్వం - అన్నీ కలసి జీవితాన్ని శోభింప చేసే విజ్ఞాన మణులను వెదజల్లే వేదాంత శాస్త్రాన్ని కాలక్షేపం స్థాయికి దించాయి. ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన భారతదేశము 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్ఫూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మధ్యనున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహోద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడు చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన గంగా నది ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది. శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించారు.[3] 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22 మురళీ కృష్ణ ఆలయాలను, ధ్యాన మందిరాలను నిర్మించి, 'గిరిధారి' మాసపత్రిక ద్వారా, టి.వి ద్వారా ఆడియో, వీడియో సి.డి. ల ద్వారా ఆర్శవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు.
ఆశ్రమ స్వీకారం
[మార్చు]గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది. అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా హైదరాబాదు సుందర చైతన్య ఆశ్రమంం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యింది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్థలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని దేవాలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మేళనమైన సుందర చైతన్య మహోద్యమానికి సంకేతాలు.
2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
చైతన్య శంఖారావం
[మార్చు]ఒక యుద్ధం రణరంగంలో ముగిసి ఉండవచ్చు. కాని, అది పుట్టింది మాత్రం ఒక వ్యక్తీ మనస్సులోనే. మార్పు అనేది సంభవమైతే అది సమాజంలో కాదు. వ్యక్తిలో. వ్యక్తీ ఆలోచనా సరళి మారితే వ్యక్తీ ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. మనసు మారితేనే మనుగడ మారుతుంది. మనిషి మారితేనే సమాజం మారుతుంది.
- సుందర సత్సంగాలు:
మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ అందించ బడే పలు రకాల సిద్ధాంతాలు, సందేశాలు, మాయలు, మహిమలు మనిషిని చుట్టూ ముట్టి మభ్య పెడుతున్న ఈ గందరగోల పరిస్థితులలో, అసలు ఇన్ని రకాల ఆలోచనల వెనుక ఉన్న ఆంతర్య మేమిటి? అది పుట్టిన దెక్కడి నుంచి? పయనిస్తున్నదే తీరానికి? ఇంతకీ మోక్ష మంటే ఏమిటి? దానికి మార్గ మేది? - ఇటు వంటి సహజ, అనివార్య సంశాయాలకు సహేతుకమైన సశాస్త్రీయ మైన సమాధానాలను అందిస్తూ, విచారము - అనుభవం - ప్రచారము - ఈ మూడింటిని లక్ష్యంగా కలిగిన సుందర సత్సంగాలను శ్రీ స్వామీజీ నలభై సంవత్సరాల క్రితమే రాష్ట్ర మంతటా నెలకొల్పారు. కుల తత్వాల నధిగమించి, 'నాకులం ఒక్కటే - సానుకూలం' అనే గురుదేవుని అడుగు జాడల్లో ఏకాత్మ భావంతో సత్సంగీయులు అందరూ జీవిస్తున్నారు.
- చైతన్య మాతృ మండలి:
గృహలక్ష్మి గృహానికి మూల స్తంభం వంటిది. ఆ కల్పవల్లి నీడ లోనే గృహం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. బిడ్డలకు అమ్మ ఒడి ప్రథమ పాఠశాల. అవగాహన గల తల్లులు ఇంటిని శాంతి నిలయం చేయగలరన్న మహోన్నత ఆశయంతో ముందు మాతృ మూర్తులను తీర్చిదిద్దే ప్రయత్నంలో శ్రీ స్వామీజీ అన్నీ గ్రామాలలో, పట్టణాలలో ' చైతన్య మాతృమండలి' స్థాపించారు. నిత్యమూ స్వాధ్యాయంతో, సేవా కార్యక్రమాలతో చైతన్య మాతృ మండలి ఆదర్శవంతంగా శోభిస్తూ ఉంది.
- చైతన్య యువత:
గోడ యొక్క గొప్పదనం ఇటుకల మీద ఆధారపది ఉన్నట్లు, దేశం యొక్క స్థిరత, ఐక్యత, పురోగతి యువత మీద ఆధారపడి ఉంది అన్న ఉధేశంతో 'చైతన్య యువత' విభాగాన్ని శ్రీ స్వామీజీ నెలకొల్పి యువతను క్రమశిక్షణ తో, సంయమనంతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో ప్రగతి మార్గంలో నడుపుతూ ఉన్నారు. ప్రేమతో, సేవా భావంతో, చరిస్తూ, వారు నమ్ముకున్న విలువల వైశిష్ట్యాన్ని, ఈ మార్గంలో వారికి కలిగిన సంతృప్తిని అందరికి అందించాలని పూర్ణ హృదయంతో ప్రయత్నించడమే కర్తవ్యంగా పెట్టుకుని, భావి తరాలకు ఆశాజ్యోతులుగా చైతన్య యువత వేల్గొందుతూ ఉంది.
- గిరిధారి:
సర్వ వేదాంత సారంగా, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారంగా, అనుభావామ్రుతాన్ని చక్కటి వ్యాసాల రూపంలో, కథల రోపంలో కవితల రూపంలో, ప్రశ్నోత్తర రూపంలో నింపి శ్రీ స్వామీజీ గత 30 సంవత్సరాలుగా ఆంధ్రావనికి మాసం మాసం అందిస్తున్న అమృత కలషమే గిరిధారి. 20,000 మంది జీవిత సభ్యులను కలిగిన గిరిధారి ఆధ్యాత్మిక మాస పత్రిక పాటకులను నిత్యమూ చైతన్యవంతం చేస్తూ, ఆనంద తీరాలకు తరలిస్తూ ఉంది.
పశ్చిమంలో యతి పాదం
[మార్చు]అమెరికా లోని భక్తుల ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామీజీ 1998 సెప్టెంబరులో ప్రథమంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశం పర్యటించారు. సనాతన ధర్మ వైభవ కేతనాన్ని అమెరికాలో రెపరెప లాడించారు. చికాగో, డెట్రాయిట్, క్లీవ్ లాండ్, ఓర్లాండో మొదలైన నగరాలలో జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి జనులను అమితంగా స్పందింప జేశారు. Chicago people get another Vivekananda-like saint to expound Advaita Vedanta. Saint thrills Chicago Audience with mesmerizing philosophical discourses. 'Advaita Vedanta delivered to the common man in simple, palatable terms' - అనే శీర్షికలతో దిన పత్రికలు పూజ్య స్వామీజీని శ్లాఘించాయి.
అపురూప విజ్ఞాన వేది - అసమాన కవితా పయోనిధి
[మార్చు]శ్రీ స్వామివారు తమ దివ్య భోదలతో అలసిపోయిన జీవితాలలో ఆశలతలను పూయిస్తున్నారు. అలుపెరుగని కంటంతో మానవాళి అశాంతి తలుపులను మూయిస్తున్నారు. వారికున్న శ్రావ్యమైన గాత్రం, గాన గంధర్వ వైదుష్యం అసమానము, అనితర సాధ్యము. మైదానాలనే తరగతి గదులుగా మార్చి లోతైన ఉపనిషత్ రహస్యాలను శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసిన ఖ్యాతి శ్రీ స్వామీజిది. వారి భాష, బాణీ అద్భుతం. వారి గళం, కలం ఒక దానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఒక దాని నొకటి మించి పోవాలనుకుంటాయి. వేదాంత సాహితీ ప్రపంచలో, తాత్విక భావనా జగత్తులో పూజ్య స్వామీజీ అపురూప విజ్ఞాన వేది. అసమాన కవితా పయోనిధి. గహన మైన వేదాంత విషయాలను సాధారణ మానవులకు కూడా అవలీలగా, అలవోకగా అందించే వారి అసాధారణ వైదుష్యం అనుపమానము, అద్భుతము. అసామాన్య పాండిత్యంతో, అద్భుత రచనా పటిమతో శతాధిక గ్రంథాలతో పాటు చైతన్య మహాభాగవతం, చైతన్య రామాయణము, చైతన్య మహా భారతము గ్రంథాలను ప్రసాదించిన శ్రీ సుందర చైతన్యనందుల వారు ఎప్పుడెప్పుడా అని ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూసిన చైతన్య భగవద్గీత గ్రంథాన్ని వాసుదేవుని ప్రసాదంగా సహృదయ లోకానికి సమర్పించి సంతర్పణం చేశారు. వేదమాతకు నీరాజనాలు అర్పించారు.
చైతన్య దీప్తి
[మార్చు]జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, సత్సంగ ప్రచారమణి, సనాతన ధర్మ దీపికాధారి అను పలు బిరుదులతో యోగి పుంగవులు పూజ్య స్వామీజీని సత్కరించగా, సువర్ణ కంటాభరనాలతో, హస్త కంకణాలతో, సువర్ణ కిరీటాలతో, గండ పెండేర పురస్కారాలతో, గజారోహణలతో, కనకాభిషేకాలతో వివిధ ప్రాంతాలలోని భక్తులు, అనేక సంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు వీరిని సంన్మానించాయి. శ్రీ స్వామీ వారిది ప్రచారోద్యమం. జన జాగరణోద్యమం, సమాజాన్ని చైతన్యవంతం చేసే సుందర సమోద్యమం. ఆయన భారతీయ విజ్ఞాన సర్వస్వం. సనాతన ధర్మ పరిమళం. ఆర్ష సంస్కృతీ సభ్యతల భాండాగారం. ఇది ఆంధ్రుల భాగ్యం. శ్రీ స్వామీ సుందర చైతన్యానందుల వారికి మనం సమకాలీనులం కావడం మన పురాకృత పుణ్యఫల విశేషం. శ్రీ స్వామి వారి అవిరళ కృషికి, త్యాగ జీవనానికి, జనులపై వారికున్న అపార కృపకి ఆంధ్రావని భక్తీ భావంతో, కృతజ్ఞతా భావంతో శిరమోడ్చి, కరములు జోడించి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంది.
గ్రంథములు
[మార్చు]- చైతన్య భగవద్గీత
- చైతన్య భాగవతం
- చైతన్య మహాభారతం
- చైతన్య రామాయణం
- చైతన్య పాంచజన్యం
- చంద్రభాగాతరంగాలు
- విష్ణు సహస్రనామం
- శ్రీ కృష్ణ కర్ణామృతం
- నిత్యసాధన చైతన్యం
- చైతన్య భగవద్గీత (చిన్న సైజు)
- అపరోక్షానుభుతి
- అయితే విను
- ఆత్మా విద్యా విలాసం
- ఆనంద లహరి
- ఆనంద తీరాలు
- ఆత్మభోద
- అధ్వైతానుభుతి
- అవధూత గీత
- భాస్కర శతకం
- భజనావలి
- భజ గోవిందం
- బాలముకుందం
- బ్రహ్మ సూత్ర దీపిక
- చైతన్య లేఖలు - 3
- చైతన్య సమీరాలు
- చైతన్య భావ సుమాలు
- చైతన్య ప్రసంగాలు
- చైతన్య గీతికలు
- దాశరథీ శతకం
- ధన్యాష్టకం
- ద్వాదశ జ్యోతిర్లింగములు
- ఈశావాస్యోపనిషత్తు
- గురు గీత
- గీతాంజలి
- గోపీ హృదయం
- జగద్గుర్వష్టకం
- జ్ఞానదేవ్ అభంగాలు
- జీవన్ముక్త గీత
- హరివిల్లు
- కీర్తనాంజలి
- కృష్ణ లీలలు
- కభీర్ గీతావళి
- కేనోపనిషత్తు
- కృష్ణకథా గానము
- లక్ష్మీనృసింహ స్తోత్రము
- మలయ మారుతం
- మహిష్మతిలో శంకరయతి
- ముండకోపనిషత్తు
- ముక్తికోపనిషత్తు
- మువ్వల సవ్వడి
- ముకుంద మాల
- నరసింహ శతకం
- నారద గాన రామాయణము
- న్యాయ దీపిక
- నారాయణ స్మరణం
- నిర్వాణశట్ట్కం
- నిగ్రహం
- నిర్గుణ మానస పూజ; సదాచారం
- పురుషసూక్తం
- పూజావిధానం
- ప్రపంచసారము
- పండుగలు - ప్రాశస్త్యము
- ప్రభోద సుదాకరము; వేదాంతడిండిమ౦
- ప్రశ్నోత్తర రత్నమాలికా
- ప్రశ్నోపనిషత్తు
- ప్రాతః స్మరణ స్తోత్రం
- రామ గీత
- రామజోగి చిట్కాలు
- శ్రీ రుద్రమ్
- సాధువాక్యం
- సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు
- సుందర సంపాదకీయాలు - 1
- సుందర సంపాదకీయాలు - 2
- సుందర పారిజాతాలు
- సనాతన స్రవంతి
- సంక్షిప్త రామాయణము
- స్వామియే శరణం అయ్యప్ప
- సాధన సోపానాలు
- సాధన పంచకం
- సుందర మందారాలు
- శ్రీ రామ అష్టోత్తర శతనామ స్తోత్రం
- శివ గీత
- శివ స్తోత్రం
- శివ దర్శనం
- శ్రీ కాళహస్తీశ్వర శతకం
- సువర్ణమాలా స్తుతి
- శతశ్లోకి
- స్వాత్మ ప్రకాశికా
- శివానంద లహరి
- షట్పదీస్తోత్రం; సారతత్వోపదేశం
- కనకథారా స్తోత్రం
- శ్రీ శంకరచార్యస్వామి జీవితము
- శివాపరాధ క్షమాపణ స్తోత్రం
- శివ మహిమ్నః స్తోత్రం
- సౌందర్య లహరి
- తత్వ బోధ
- విజ్ఞాన నౌక
- విజ్ఞాన కదంబం
- వేదాంత పంచదశి
- వేదాంత వెన్నెల
- వేమన యోగి
- వ్యాస ప్రసాదం
- విభూతి పండ్లు
- విచారబిందు ఉపనిషత్తు
- వేదాంతసార ఉపనిషత్తు
- యోగాసారోపనిషత్తు
- యక్షప్రశ్నలు
- జీవన సత్యాలు
చైతన్య భాగవతము
[మార్చు]
నీరాజనం
[మార్చు]ఉష్ణము అగ్నియొక్క ధర్మము. శీతము జలము యొక్క ధర్మము. క్రౌర్యము వ్యాఘ్ర ధర్మము. చపలత్వము లేడి ధర్మము. వర్షించుట మేఘ ధర్మము. ప్రేమించుట ప్రేమ ధర్మము. ప్రేమకు అన్యధర్మములు తెలియవు.
ప్రపంచము ప్రేమనుండి జనించినది. ప్రేమలో జీవిస్తున్నది. ప్రేమలో లయిస్తుంది. ప్రేమకు పుట్టుకలేదు. ప్రేమయే సృష్టికి మూలకారణము. వ్యష్టికి మూలాధారము. సమిష్టి మనుగడకు మూల విషయము. ప్రేమ అద్భుతమైన శక్తి. ప్రకృతి స్పందనలో, సౌందర్యములో తొంగిచూసే అసమాన ఆకర్షణాశక్తి మానవ హృదయంలో, ఆరాధనా రూపంలో కదిలే భక్తి. సకల ప్రాణుల హృదయాలలో ఊరట పేరున కలిగే తృప్తి. జీవికి నిజమైన భుక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే అదియే తన స్వరూపమైన ముక్తి. ప్రేమ సర్వాంతర్యామి. అది కదులును, కదలదు. దగ్గర లేదు, దూరము ఉండదు.
తదేజతి తన్నై జతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః'
“అది కదులును. అది కదలదు. అది దూరమున గలదు. దగ్గరనూ గలదు. అది దీని అంతటిలో కలదు. దీని యంతటికి బాహ్యమున కూడా కలదు.” అని ఉపనిషత్తు పలికింది.
ప్రేమకు రూపము లేదు. అరూపమైన ఉజ్వల ప్రేమ రూపమును దిద్దుకుని వ్యక్తమయితే ఎలా వుంటుంది? సముజ్వల విగ్రహమై భాసిస్తుంది. అట్టి సుందర సముజ్వల విగ్రహమే ప్రేమమూర్తియైన శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు ప్రేమావతారమూర్తి. ప్రేమ నిండిన హృదిలో వెలితి తెలియదు. వెలుగు చెదరదు. ప్రేమ భాషణమునకు అలవాటుపడిన వ్యక్తికి అసంపూర్ణత అర్థం కాదు.
అది సరస్వతీ నదీతీరము. వేదములను సంస్కరించిన మహనీయుడు, అష్టాదశ పురాణములకు కర్తయైనవాడు, బ్రహ్మసూత్రములను రచించినవాడునగు వేదవ్యాసుడు అశ్రుపూర్ణవదనుడై విచారముతో కూర్చొనియుండెను. దారిన వెడుచుండిన నారదమహర్షి వ్యాసభగవానుని జూచెను. ఆయన ముఖారవిందమున గోచరమయ్యే అవ్యక్తబాధను గ్రహించెను. మహర్షిని సమీపించి, "ఆర్యపూజితా! పరాశరాత్మజా! మీ వదనమున విషాదఛాయలు అలుముకొనుటకు కారణమేమి? సర్వశాస్త్ర పారంగతులైన మిమ్ములను అశాంతి అలుముకున్నదా? కారణమేమిటి?" అని అడిగెను. "నారద మునీంద్రా! అదియే నాకును అవగతమగుటలేదు. నీవు త్రిలోక సంచారివి. జ్ఞానివి. నీకు తెలియని విషయము లేదు. నా ఈ విషాదమునకు కారణమును తెలియజేయుము" అని తెలిపెను.
నీ కెఱుగరాని ధర్మము లోకములను లేదు బహువిలోకివి నీవీ
నా కొఱత యెట్టిదంతయు నాకున్ వివరింపుమయ్యనారద! కరుణన్'
అని వ్యాసుడు ప్రార్థించెను.
నారదుడు ఒక క్షణమాలోచించాడు. కారణాన్ని అన్వేషించి అవగత మొనర్చుకున్నాడు. అర్థమైన విషయాన్ని అభ్యర్థించిన వ్యాసునికి తెలియజేశాడు.
అచింతమైన ధర్మచయమంతయుఁ జెప్పితి వందులోన నిం చుకగాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్ ప్రవచిం చిన మెచ్చునే గుణ విశేషము లెన్నినఁగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిఁగోరి నుతింపుమి నార్యపూజితా! "మహాత్మా! వ్యాసా! జటిలమైన వేదాంతశాస్త్రమును ప్రవచించిన నీవు భగవద్భక్తిని గూర్చి ప్రత్యేకముగా ప్రవచించవైతివి. ఎంతటి జ్ఞానము కలిగినను భక్తి లేనిదే ముక్తి రాదు. భగవానుని అనంత కళ్యాణ గుణములను కీర్తించకపోవుటయే నీ ఆవేదనకు ముఖ్యకారణము.
"హరిభక్తిని విరివిగా పంచెడి భాగవత కావ్యమును రచించి, మీ హృదిలోని ఆవేదనను పోగొట్టుకొనుడు" అని తెలియజేసెను.
నిగమంబులు వేయిఁ జదివిన సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!
నారదమహర్షి చేత ప్రభావితుడైన వ్యాసమునీంద్రుడు శమ్యాప్రాసమనే ఒక ఆశ్రమంలో ఉండి భక్తిరస ప్రధానమైన భాగవత కావ్యమును రచించెను. తత్ఫలితముగ హృదయావేదనను పోగొట్టుకొని నిర్వికల్పానందములో రమించెను.
శ్రీమద్భాగవత కథామృతము మహాజ్ఞానియైన వ్యాసమహర్షి కలమునుండి కదలి, మహా వైరాగ్యమూర్తియైన శుకబ్రహ్మ గళమునుండి స్రవించి, మహాభక్తుడైన పరీక్షిత్తుని హృదయమున నిలిచినది. కనుక ఈ మహాకావ్యము భక్తి, జ్ఞాన, వైరాగ్య రూపమని తెలియుచున్నది.
వ్యాసమహర్షి విరచితమును, నిరోధలీలా ప్రతిపాదకమునగు ద్వాదశస్కంధ సముల్లసితమగు ఈ భాగవత గ్రంథము పరమపావన గ్రంథము. "భాగవతము" అనెడి పదములోని ఐదు అక్షరములు స్వరూపానుభూతికి పంచ సోపానములవలె తెలియుచున్నవి. మొదటి అక్షరమైన 'భా' శబ్దము ప్రకాశవంతమైన భక్తిని తెలియచేయుచుండ, రెండవ అక్షరమైన 'గా’ శబ్దము ప్రజ్ఞానఘనమైన జ్ఞానమును నిర్దేశించుచుండ, మూడవ అక్షరమైన 'వ ' శబ్దము వివేకయుతమైన వైరాగ్యమును సూచించుచుండ, నాల్గవ అక్షరమైన ‘త‘
వృచ్ఛకుడు నాలుగుసార్లు భాగవతము - భాగవతము- భాగవతము - భాగవతము యని పలికెను. ఇలా పలుకుదుండగా భాగవతమనెడి పదము పునశ్చరణ వేగానికి "బాగవుతాము" యని వినిపించును. వెంటనే ఆ సంత్ పురుషుడు "నాయనా చూచితివా భాగవతమును పఠించినచో మనమంతా బాగవుతాము" యనెను. బాగును తెలియక సాగే జీవులకు భవ్యమైన, యోగ్యమైన బాటను తెలిపే బావుటాయే భాగవతము.
బుధజనులారా! ఇది భాగవతము. ఎవరినో బాగుచేయాలని నేను వ్రాయలేదు నన్ను బాగుచేసుకొనేందుకు వ్రాసుకున్నాను. నా జీవన ప్రయాణంలో దారిబత్తెమైన ఈ భాగవతమును తోటి సహచరులైన మీకు పంచడం నా బాధ్యతగా భావించాను.
రుచి ఉందో లేదో! రుచిగా వడ్డించాలనే అభిరుచి మాత్రం నాలో నిండుగా ఉండింది. ప్రేమతో అందిస్తున్నాను. గ్రహించండి.
ప్రమోద భరితమైన ఈ పవిత్ర గ్రంధమును ప్రశాంతముగా కూర్చుని రచించే అదృష్టం కలుగలేదు. నిర్విరామ కార్యక్రమాల మధ్య ప్రయాసతో రచించాను.
ఒకరి చేత రామభద్రుడు వ్రాయించాడు. నాచేత వ్రాయించమని శ్యామభద్రుని కన్నీళ్ళతో ప్రార్థించాను. నేను చేసినది అంతే. చివరగా ఒక్కమాట, వస్తువు మహాప్రసాదము. పూజారి ఎవరని చూడకండి. తీర్థపుగిన్నె ఎలా ఉన్నదని వీక్షించకండి. అనంత కరుణామయుడైన శ్యామసుందరుని నిర్హేతుక కృపా విశేషము, అసమాన ప్రేమాన్వితులైన మీ అందరి ప్రేమలు నాకు కొండవలె అండగా నిలచి నా బ్రతుకు పంటను దండిగా పండించాయి. అందరికీ వడ్డించే అవకాశాన్నిచ్చాయి.
అందుకోవడంతోనే సరిపోయింది. తిరిగి ఏమి అందించగలను? ఏమీ లేదు. ఏమీలేని వాడను. మీకు ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు వందనము తప్ప. ఆ వందనమునే వంద జేసి అందిస్తున్నాను. అందుకోండి. భాగవత సాగర తీరాన
…ఒక రేణువు…స్వామి సుందర చైతన్యానంద
- చైతన్య భాగవతము PDF LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/9/chaitanya-bhagavathamu
- శ్రీ మద్భాగవతం videos link: https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/4/srimad-bhagavatam
చైతన్య రామాయణము
[మార్చు]
ఎందుకు? ఎవరి కొరకు? ఏమి సాధించాలని? - చెబుతాను. నా కథ చెప్పేముందు ప్రస్తావనగా రెండు మాటలు రామచంద్రుని గుణానుకీర్తనము పుణ్యప్రదము. ముక్తిప్రదము. రాముడు ధీరోదాత్త నాయకుడు. అట్టి సుగుణాభిరాముని కళ్యాణ చరితమును కమనీయంగా రచించిన వారిలో ఒకరైన కవిబ్రహ్మ తిక్కన తన "నిర్వచనోత్తర రామాయణము" నకు, హేతువును ఇలా చెబుతాడు. ఎత్తఱి నైనను ధీరోదాత్త నృపోత్తముడు రామధరణీపతి సద్వృత్తము సంభావ్యమౌట నుత్తర రామాయణోక్తి యుక్తుడ నైతిన్' అని తన మనోభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఉభయకవిమిత్రుడు తిక్కనార్యుడు. రామకథారచన కార్యాన్ని జీవిత లక్ష్యంగా భావించి, రచించి, తరించిన మహానుభావు లెందరో ఈ పుణ్యభూమిలో. అంతేకాదు. రామకార్యమే నిజమైన పని యని, తక్కినదంతా శని యని భావించినవారూ ఉన్నారు. ఏ పనికో జన్మించితి నని నీ వెంచవలదు శ్రీరామ నే॥నేపనికో॥ శ్రీపతి శ్రీరామచంద్ర నీ చిత్తానికే తెలియదా నే ॥నేపనికో॥ వాల్మీకాది మునులు నరులు నిన్ను వర్ణించిన నా యాస దీరునా మేల్మియై యుండు సద్భక్తులు మెచ్చుదురే త్యాగరాజ నుత నే ॥నేపనికో॥' అని కీర్తిస్తూ, రామ గుణానుకీర్తనమే తన జీవితానికి ముఖ్య ప్రయోజనము అంటాడు త్యాగరాజస్వామి.
ఇక నా కథ
[మార్చు]ఇది చైతన్య రామాయణం. రామ చైతన్యాన్ని వర్ణించే గ్రంథం. రామాయణ చైతన్యాన్ని వివరించే గ్రంథం. నాకు దైవ నియోగం మీకు ప్రసాద వినియోగం. పైనుండి అందింది పిలుపు ... క్రింద అందించబోయేది మేలుకొలుపు. ఇరవైఏడు సంవత్సరాలుగా చేసిన కొలువు గ్రామ గ్రామాన కనుల పండుగగా సాగిన భక్తి చెలువు - ఏకమై నాకు ఈ రామాయణ రచనా భాగ్యాన్ని ప్రసాదించాయి. కవినై వ్రాయలేదు. పండితుణ్ణి ప్రవచించలేదు. తియ్యని రామకథను, పవిత్రమైన రాముని గాథను తెల్లని కాగితంపై వ్రాశాను. అంతే. ప్రజాభాషలో వ్రాశాను. జనప్రియంగా చెప్పాను. సరళభాషలో వ్రాశాను. వాడుక భాషలో వ్రాశాను. వేడుకగా వ్రాశాను. వేడుకుంటూ వ్రాశాను. నన్ను వాడుకోమంటూ వ్రాశాను. శేముషీ సింధువునై వ్రాయలేదు. ఆర్తజన బంధువునై వ్రాశాను. "నేనా! దద్దమ్మను. రామన్న కథ రాయడం నాకు సాధ్యమా!" అని పెద్దమ్మ పాదం పట్టుకున్నాను. అమ్మల గన్న అమ్మను వేడుకున్నాను. దాశరథి గాథను దద్దరిల్లేలా వ్రాయమని పెద్దమ్మ ధైర్యాన్ని నూరిపోసింది. నా అదృష్టానికి పొంగిపోతూ శతధా ధన్యుణ్ణి రచన కుపక్రమించాను. ఇది సాహసమే నని నాకు తెలుసు. గంగానదిని పూర్ణంగా ఆపోశనం పట్టాలని భావించే గోరువంక ప్రయత్నం అని నాకు తెలుసు. అయినా ప్రారంభించాను. ప్రయత్నించాను. త్రికరణశుద్ధితో రామాయణాన్ని రచించేవారికి, అంభోధిని దాటిన అంజనేయుడు అండగా ఉంటాడనే మాట మీద విశ్వాసమున్న వాణ్ణి. దైవకృప ఎలా ఉంటుందో జీవితంలో చూసినవాణ్ణి. రామాయణాన్ని కొందరు కథగా వ్రాశారు. కొందరు మూలానికి శ్లోక తాత్పర్యాలు సమకూర్చారు. కొందరు యథాతథంగా భావాన్ని అందించారు. కావ్యంలోని కవితా పరిమళాన్ని కొందరు వెదజల్లారు. నేను ఇవేమీ చేయలేక పోయాను. మహిమను వర్ణించి మనిషిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. అది నా జీవితలక్ష్యం. దైవశాసనం. ఆంధ్రావనిలో ఈనాడు నాకు ఉండేది ఊడే ఉద్యోగం కాదు. ఊరేగే ఉద్యమం. చూస్తూ నమ్మలేని సభలు. సమయాల్ని పాటిస్తూ, నియమాల్ని అనుసరిస్తూ సకాలానికి సభాస్థలికి గలగలమంటూ నదిలా కదిలొచ్చే జనప్రవాహం. ప్రసంగించినంత కాలం విస్తరంగ జలధిలా నిశ్చేష్టులై కూర్చుని, ఆశ్చర్యంతో ఆర్ద్రతతో ఆనందంతో మూగబాధతో పకపకమనే నవ్వులతో కొంత సేపు తడి ఆరని కన్నులతో మరికొంత సేపు రెండు గంటల్ని రెండు నిముషాలుగా భావించి జీవిత లక్ష్యాన్ని, మార్గాన్ని పొందామనే తృప్తితో లేచిపోయే అశేష జనావళి ఈనాడు ఆంధ్రావనిలో ఎక్కడైనా సుందర చైతన్య సభలలో ప్రత్యక్షం! ఆహా! ఏమి వైభవం! ఏమి ప్రాభవం! ఎవరిది ఇదంతా! ఇదంతా సనాతనధర్మ వైభవమే! ఏనాటి పుణ్యఫలమో! వాసుదేవుని కృపా వీక్షణమో, వ్యాసవాల్మీకాదులు అభిషేకించిన పుణ్యతీర్థం నన్ను కరుణించింది. తీర్థపుగిన్నె నా చేతికి వచ్చింది. వినమ్రుడనై, వినీతుడనై వినియోగ భారాన్ని భుజాల కెత్తుకున్నాను. వితరణశీలినయ్యాను. నమ్మకమున్న వాణ్ణి గాని అమ్మకం తెలియని వాణ్ణి. అయితే నేమి? అమ్మి పెట్టేవాడు అచ్యుతు డయ్యాడు. వేడుకంతా వేదికవద్దే. చెప్పినట్లు చేయమన్న వాని చరిత్రను వ్రాసి మూడు సంవత్సరాల క్రితం విడుదల చేశాను. వేలాది కాపీలు గంటలో ఎగిరిపోయాయి. చేసినట్లు చేయమన్న వాని చరిత్రను ఇప్పుడు వ్రాస్తున్నాను. ముస్తాబు కాకముందే మాకంటే మాకని ముచ్చటపడుతున్నారు వేలాది భక్తులు. నమ్మి నడచిన బ్రతుకు వమ్ము కాదు. జీవికి ఏనాడైనా ప్రధానమైంది సొమ్ము కాదు. రెండు దశాబ్దాలు ఆంధ్రావనిలో గీతాప్రవచనం చేశాను. తేట తెలుగులో ఉపనిషత్తులు వినిపించాను. భాగవతామృతాన్ని త్రాగించాను. రామాయణసాగరం వైపుకు నడిపించాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్య ద్వాదశాక్షరీ మంత్రాన్ని మిన్ను ముట్టేలా వాడవాడలా ప్రతిధ్వనింప చేశాను. సత్సంగాలు నెలకొల్పాను. సన్మార్గాన్ని బోధించాను. చేయవలసిన సందడంతా చేశాను. మహర్షుల వైభవాన్ని దర్శించిన నా హృదయం విశ్రాంతిని విసర్జించింది. నిద్రను నిర్జించింది. ఆరోగ్యాన్ని విస్మరించింది. నోరు మూతను పారేసుకుంది. కంఠం పగ్గాన్ని తెంచుకుంది. కాళ్ళు సంకెళ్ళను ఛేదించుకున్నాయి. చేతులు కట్లును వదిలించుకున్నాయి. ప్రవచనాలు జోరుగా సాగాయి. పాటలు శ్రావ్యంగా కాసెట్ల కెక్కాయి. ఊరూరు ప్రయాణాలయ్యాయి. చాప పరచినట్లు గ్రంథాలు వెలువడ్డాయి.పరిశ్రమ ఫలించింది. పరిస్థితి మారిపోయింది. ఇంతకాలం విని ఆనందించిన వారంతా ఇకమీదట కని తృప్తి చెందాలని తపన చెందుతున్నారు. ధర్మజీవనాన్ని గడిపేందుకు నడుం బిగిస్తున్నారు. ఇప్పుడు రామాయణం వారికి చాలా అవసరమై ఉంది. ఈ క్షణం కొరకే వేచియున్న నేను కలం కదిలించి, రాత్రింబవళ్ళు శ్రమించి, సాధకజన లోకానికి రామాయణాన్ని అందించాలని సంకల్పించాను. దానికి తోడు ఈనాటి సమాజానికి రామాయణం అవసరం ఎంతో ఉంది. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినరు. బిడ్డల భవిష్యత్తును తల్లిదండ్రులు పట్టించుకోరు. భర్త మాట భార్య వినదు. భార్య సుఖాన్ని భర్త కనడు. గురువులపై శిష్యులకు గౌరవం లేదు. శిష్యులపై గురువులకు వాత్సల్యం లేదు. స్నేహితుల మధ్య నమ్మకాలు నశించాయి. బంధువుల మధ్య దూరాలు పెరిగాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు, పాలకులు, పాలితులు అంతా కాలుష్యమే. కాపట్యమే. ఈ వ్యసనాన్ని పారద్రోలి, సద్వ్యవస్థను ఆహ్వానించాలని ధర్మవ్యవస్థను సమాజంలో ఆవిష్కరించాలని అభిలషించి, ఆశపడి దేశకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక స్పృహను మదిలో నింపుకొని అధఃపతనమవుతున్న ఆధునిక సమాజానికి సనాతనధర్మ ప్రగతిని అందించాలని అజ్ఞాన అనారోగ్యంతో నీరసించిన సమాజానికి దివ్యారోగ్యాన్ని ప్రసాదించే జ్ఞానరక్తాన్ని ఎక్కించాలని, పట్టించాలని పట్టుపట్టి, పట్టుదలతో రామాయణాన్ని రచిస్తున్నాను. ఇది చైతన్య రామాయణం భక్తులకు సారథి. విమర్శకులకు వారధి. సాధకులకు పెన్నిధి. నిజానికి రామప్రభువు సన్నిధి. రామాయణంలో చైతన్యమూర్తి రామభద్రుడు. చైతన్యునిలో అదృశ్యశక్తి శ్యామభద్రుడు. కళ్ళ ముందు రాముడు మనసు వెనుక శ్యాముడు నేను మధ్యవర్తిని. మీకు మధ్యవర్తిని. మీ మధ్యవర్తిని. చైతన్య రామాయణమంతా వాల్మీకమే. అవాల్మీకాలు సుందరంగా గోచరించిన చోట వాటి చిరునామాలు తెలుపుకుంటూ నడిచాను. రాముని ఆలయమే రామాయణం అది భక్తుల పాలిటి దేవాలయం. విగ్రహం రామునిది ప్రతిష్ఠ వాల్మీకిది నా దేమి టంటారా? పరిచర్యలే. సేవలే. మెట్లు శుభ్రం చేయడం దారిని సుగమం చేయడం సున్నం కొట్టడం రంగులు పులమడం అంతే, రాజు కట్టిన వంతెనపై ప్రాకి చీమ నదిని దాటుతుంది. వాల్మీకి రామాయణాన్ని ఆశ్రయించి నేను నా కార్యాన్ని పూర్తి చేసుకున్నాను. చీమకు చేవ ఎంతో - మీకు తెలుసు. చైతన్యుని శక్తి అంతే - అని నాకు తెలుసు. కృషి రవ్వంత కృప కొండంత. అంతే అంతా. పుణ్యాత్ములారా ! శ్రీరామ చరితామృతం మన చేతి కందింది. శ్రీరామ పాదతీర్థం మనకు లభించింది. శ్రీరామ నామసుధ మనకు ప్రాప్తించింది. ఇక ఆలస్య మెందుకు? జుర్రుదామా! జుర్రెద మీ కథామృతము జుట్టెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుఱ్ఱ జుఱ్ఱుగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తఱ్ఱుల తోడి పొత్తిడక దాశరథీ కరుణా పయోనిధీ "కళ్యాణరామా! కరుణామయా! నీ చరితామృతాన్ని, నీ పాదతీర్థాన్ని, నీ నామపీయూషాన్ని కడుపారా గ్రోలుతాను. "దశరథరామా! దయామయా! నీ నామసుధను, నీ కథామృతాన్ని జుట్టి జుణ్ణి తృప్తిచెందిన సత్పురుషుల సహచర్య భాగ్యమును నాకు ప్రసాదించు. "కోదండరామా! కోమల హృదయా! కఠినాత్ముల కూరిమిని ఖండించు తండ్రీ!" అన్నాడు ఆనాడు భద్రాచల రామదాసు. ఆ మాటే ఈనాడు నేనూ అంటున్నాను, వినమ్రుడనై. నిజ భక్తుల చరణధూళినై అంటూనే ఉంటాను. చల్లని చూపుల నల్లని స్వామి పదముల కడ వాడని పువ్వులా పడి ఉండాలని పరితపించే, పరిశ్రమించే..మీ…స్వామి సుందరచైతన్యానంద
- చైతన్య రామాయణము PDF Book Link:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/8/chaitanya-ramayanamu?sort=title
- శ్రీ మద్రామాయణం videos link: https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/5/srimad-ramayanam?sort=title
చైతన్య భగవద్గీత
[మార్చు]
ఏనాటి పుణ్యఫలమో ఏ దివ్యాత్ముని కృపా వీక్షణమో బాల్యంలోనే నా మనస్సు బాలగోపాలుని బడి కెళ్ళి కూర్చుంది. అక్షరాలు నేర్చింది, పాఠాలు విన్నది అక్కడే. మాట లొచ్చింది, పాట లొచ్చింది ఆ బడి లోనే. 'తండ్రీ! నీవు మహోన్నతమైన తండ్రివి. నేను అర్హత లేని బిడ్డను. ఆశ ఒక్కటే నా ఆస్తి. అదే నా అర్హత. పారిజాత సుమాలను పట్టుకున్న చేతులతో నమస్కరిస్తూ ఉంటాను. తులసీ దళములను పట్టుకున్న హస్తాలను జోడించి వందన మంటూ ఉంటాను. నీ మాట వింటూ బ్రతుకుతాను. నీ భాషను పట్టుకొనే శక్తి లేనివాణ్ణి. నీ భావాన్ని ముట్టుకొనే సామర్థ్యం లేనివాణ్ణి.' ఇదంతా నా చిన్ననాటి వేడుకోలు. ఆ వేడుకోలు వెన్నుని చరణాల చెంతకు చేరుతుందని, తన వేడుకను ఆవిష్కరించే మహాకార్యంలో నన్ను వాడుకోవడం జరుగుతుందని నేను కలలో కూడా ఊహించ లేదు. గీత తోనే చెలిమి చేశాను గీతే నా కలిమి అని భావించాను మనస్సు పట్టుకోలేక పోయినా చేతులు గీతను విడిచి పెట్టేవి కావు. అదొక సుదినం. శుభదినం భగవద్వాణిపై గురి కుదిరింది భగవద్గీతపై మది నిలిచింది. య ఇమం పరమం గుహ్యం మద్బక్తే ష్వభిధాస్యతి | భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్య త్యసంశయః || న చ తస్మా న్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః | భవితా న చ మే తస్మా దన్యః ప్రియతరో భువి || ఈ గీతాశాస్త్రము అతి రహస్యము. దీనిని నా భక్తులకు ఉపదేశించే వాడు నాకు సరమ భక్తుడు అవుతాడు. నిస్సందేహంగా వాడు నన్నే పొందుతాడు. అర్జునా! అతని కంటే ప్రియమైన వాడు మానవ ప్రపంచంలో మరొకడ నేడు లేడు. మున్ముందు ఉండబోడు కూడా. ఈ రెండు శ్లోకాలు గీతను సమాప్తం చేస్తూ భగవంతుడు వినిపించిన అమూల్యమైన రత్నాలు అనే నా పాలిటి రత్నాల గనులు నన్ను సంపన్నుల్లోణ్ణి చేసిన రత్నరావులు,
గీతా మే వరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః
భగవద్గీత ఒక్కటే నాకు శ్రేష్ఠమైన జ్ఞానము శీత పరమేశ్వరుని స్వరూపము. సంశయం లేదు. అంతే, ముక్కుపచ్చ లారని పూస వయస్సులో బుద్ధిలో భగవంతుని నింపుకొని, ఎవరి కొరకూ ఎదురు చూడకుండా గీతా ప్రచార భారాన్ని భుజాని కెత్తుకున్నాను. శక్తి ఉండి ఆ కార్యానికి పూనుకోలేదు భక్తి ఉందనే ధైర్యం వల్ల మానుకోలేదు. కొండ మోసిన వాడే అండగా నిలిచాడు సేవా పంటను దండిగా పండించాడు. త్రికరణ శుద్ధిగా నమ్మి నడిచి నందుకు మాటిచ్చిన వాడు మాటను నిలబెట్టు కున్నాడు. నాలుగు దశాబ్దాలు దేశం నలు చెరగులా గీతను వినిపించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ధన్యోం స్మి. భగవాన్! ధన్యోం పి. ఎన్నో గ్రంథాలు వ్రాశారు. గీతను వ్రాయ రెందుకని? ఎంతో కాలంగా ఇదే భక్తులు నాపై సంధిస్తున్న ప్రశ్న. వినతిని వినిపిస్తూనే ఉన్నా! ఆనతి వస్తే తప్పక వ్రాస్తా! - ఇదే భక్తులకు నే నిచ్చిన సమాధానం. ఆజ్ఞ అయింది. క్షణం ఆగకుండా శుభారంభం చేశా! రచన ఊపందు కుంది. చిత్ర విచిత్రంగా, నిత్య నూతనంగా రూపు దిద్దుకుంటూ సాగింది. అర్జునునికి బాహ్యంలో నిలబడి బోధించిన వాడు నాకు మాత్రం లోపలే స్థిరపడి గుట్టు విప్పాడు. తెలిసిందంతా వ్రాయలేక పోయాను. వ్రాయ గలిగిందంతా వ్రాశాను. తెలుసుకోవాలి తరించాలి అని భావించే పుణ్యాత్ములకు మరొకటి తెలియ నవసరం లేకుండా వ్రాశాను. శ్రమనే ఆహారంగా పరిశ్రమనే పానీయంగా నిరీక్షణే నిద్రగా భావించి అనంత సహనంతో నిరంతర మననంతో విచిత్రంగా కదులుతూ వినూత్నంగా కలలు కంటూ నడకను మరచి పరుగును వలచి సూర్యుణ్ణి విడిచి చంద్రుణ్ణి మరచి దీప జ్వాలకే అంకితమై కాలం తెలియకుండా కాళ్ళు మడచి కూర్చుని మాటలకు ప్రాణం పోస్తూ వాక్యాలకు వన్నె లద్దుతూ మది నంతా మాధవుని నింపుకొని హృది నంతా గీతామాతను నిలుపుకొని శంకరునికి కింకరుణ్ణ వంకరలు లేకుండా శంకలు కదలకుండా రెండు వేల పుటలను కుప్పపోసి నాలుగు సంపుటాల లోకి ఎత్తి నింపి భక్తుల భుజాలకు తగిలిస్తున్నా! అలా ఋషి ఋణాన్ని తీర్చుకుంటున్నా!
నివేదన
త త ద్వస్తు స్వభావజ్ఞః తత్పలం వేత్తి నాపరః |
ఎవరికి ఏ వస్తు పరిజ్ఞాన ముందో వారికే దాని ఫలం పూర్ణంగా తెలుస్తుంది. భగవద్గీత ఏమిటో, ఏం చెబుతూ ఉందో, ఏ ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉందో బ్రతుకునే సమర్పించుకొని అర్థం చేసుకున్నాను. గీతాసుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర సంగ్రహైః ఇతర శాస్త్రాల ప్రసక్తి ఎందుకు? గీతను చక్కగా పఠిస్తే చాలు. అనే హితవాక్యం యొక్క ప్రభావ మేమిటో జీవితంలో చూశాను అందుకే, ఆరు పదులు నిండిన దశలో అనుభవాన్ని రంగరించి వ్రాశాను. గీతకు ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. వస్తున్నాయి. వస్తూనే ఉంటాయి. ఎవరు ఎందుకు వ్రాశారో, వ్రాస్తున్నారో నాకు తెలియదు. గీతను ప్రవచించడం వేరు. గీతను రచించడం వేరు గీతను బోధించే వాళ్ళందరూ గీతను వ్రాయలేరు. వినే వారికి అర్థమయ్యే లాగా బోధించడం బోధకు అందరికీ బోధకులందరికీ సాధ్యం కాదు చదివే వారికి అర్థమయ్యే లాగా రచించడం కూడా రచయిత లందరికీ సాధ్యం కాదు. మరొక అడుగు ముందు కేస్తే గీత అర్థం కాని వాళ్ళు ఎలాగూ గీతను వ్రాయలేరు గీతను అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా గీతను వ్రాయ గలరని చెప్పలేము. అందుచేతనే, భగవద్గీతకు ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చినా వ్యాఖ్యానం అనగానే, శ్రీ శంకర భాష్యమే మనస్సులో మెదుల్తుంది అదే ప్రసన్నము. అదే గంభీరము. ప్రసన్న గంభీరము. కొందరికి కొన్ని వ్యాఖ్యానాలు బాగుంటాయి కొందరికి కొన్ని వ్యాఖ్యానాలు బాగుండవు కొందరికి ఏవైనా బాగుంటాయి కొందరికి బాగున్నవే బాగుంటాయి. ఏది బాగు? ఏది ఓగు? తెలిసి చెప్ప గలిగే దెవరు? బాగు పడాలనే దృఢదీక్ష కలవారు బాగేమిటో తెలుసు కుంటారు. బాగును గ్రహించిన వారే ఇతరులకు బాగును అనుగ్రహించ గలరు. తాదృశానాం దశాం తాం తాం తాదృశా ఏవ జానతే! అలాంటి వారి స్థితిని అలాంటి వారే తెలుసుకుంటారు. ఇది చైతన్య భగవద్గీత నాకు తపః ఫలం మీకు పుణ్య ఫలం ఏదో సాదాగా చదివి ప్రక్కన పెట్టే గ్రంథం కాదు అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని కొన్ని పుటలు ఎన్నుకొని చదివేది అసలే కాదు. సొంతము సాదరంగా అధ్యయనం చేయవలసిన గ్రంథము బుద్ధితో పాటు భక్తిని తోడు చేసుకొని చదువ వలసిన గ్రంథము. భక్తి రేవ ఏనం గమయతి భక్తి రేవ ఏనం దర్శయతి భక్తి వశః పురుషః భక్తి చేయి పట్టుకొని భగవంతుని వద్దకు నడిపిస్తుంది భక్తి కళ్ళు తెరిపించి భగవంతుని చూపిస్తుంది ఎందుకనో తెలుసా? భగవంతుడు భక్తికి వశుడు. ఎవరి ఇంట్లో ఏదుందో, ఏది లేదో నాకు మాత్రం ఏం తెలుసు? అన్ని ఇళ్ళల్లో గీత ఉండాలి భగవంతుని దర్శించ డానికి ఆలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాలి గీత మీ గృహంలో ఉంటే, మీ గృహమే గీతా మందిర మవుతుంది గోవిందుడు గీత లోనే ఉన్నందున గోవింద మందిర మవుతుంది. గీతాశ్రయో_హం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ ! నేను గీతను ఆశ్రయించుకొని ఉంటాను. గీతే నా నివాస స్థానము ఇది ఎవరో ఎవరికో చెప్పింది కాదు. భర్త భార్యకు చెప్పింది అడిగింది ధరణి. తన చిరునామా ఎక్కడో చెప్పింది ధరణీపతి. ఇది వరాహపురాణం లోని వార్త. భూదేవి ప్రశ్నించింది అంటే భూలోక వాసు లందరి పక్షాన ప్రశ్నించిందని అర్థము భూదేవికి చిరునామా నందించాడు అంటే భూలోక వాసు లందరికీ అందించాడని అర్థము. గీత మన ఇంట్లో ఉంటే చాలు మన ఇంటికి రమ్మని అచ్యుతుని ఆహ్వానించ నవసరం లేదు మనందరము అచ్యుతుని ఇంటి లోనే ఆనందంగా ఉంటాము. గృహమే గుడి గోవిందుని దర్శించాలని భావించే భక్తులకు ఎన్ని గుళ్ళని నిర్మించ గలను? గూళ్ళనే గుడులుగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. ఇలా ఉంటుంది అనిపించింది అదే చైతన్య భగవద్గీత. సర్వం సఫలం - సర్వం సంపూర్ణం నా ఆశయం నెరవేరింది. నా ఏకైక వాంఛ తీరి పోయింది నా బ్రతుకు సఫల మైంది. పురుషార్థం సిద్ధించింది. చాలు. చాలు. చాలు. భగవదారాధన సమాప్త మైంది భక్తులకు ప్రసాదం ప్రాప్తించింది. మహాకృతి మహోజ్జ్వలంగా సమాప్త మైంది కృతి కర్త ఎవరు? కృతి భర్త ఎవరు? కృతి భర్త నేను కాదని మీకే తెలుసు కృతి కర్తను నేను అనేది మీ భావన కాదని చెప్పేందుకే చివరగా ఈ పొడి మాటలు. కర్తను కాను అంటే పనిముట్టును అనుకుంటా రేమో! పనిముట్టును కానే కాను; పనిని ముట్టుకున్నాను. అంతే. కర్తా బహిః అకర్తా న్తః బాహ్యానికి కర్తగా కనిపిస్తున్నా ఆంతర్యంలో అకర్త గానే ఉన్నా! కృతి భర్తే కృతి కర్త కృతజ్ఞత చెప్పే ధైర్యం లేదు ఐదు పది చేసి తల వంచుతున్నా! అలాగే ఉంటానని విన్నవించు కుంటున్నా! కృతార్థుణ్ణయ్యా నని వినమ్రుణ్ణి పలుకుతున్నా! మనసైన మాట శతాధిక గ్రంథాలను ప్రచురించే అదృష్టానికి నోచుకుంది సుందర చైతన్యాశ్రమం. ఎంతో కాలంగా సర్వులూ ఎదురు చూచిన గ్రంథం చైతన్య భగవద్గీత కూడా ఎదలను అలరించేందుకు ఆవిర్భవించింది. ఎందరో ఎన్నో విధాలుగా ఈ కార్యక్రమాలలో వారి వారి సేవలను అందించి తృప్తి చెందారు. అందరికీ ఆశ్రమం ఋణపడి ఉంటుంది. ఇక ప్రస్తుత విషయం చైతన్య భగవద్గీత. రెండు వేల పుటల గ్రంథాన్ని అచ్చు తప్పులు దిద్దుతూ, సవరించి సరి చేయడం సాధారణమైన కార్యం కాదు. బాల్యం లోనే కదిలిన ప్రస్థానము. నాపై ఎందరి ప్రభావ ముందో నాకే తెలియదు. బాల్యం లోనే విశేషంగా గ్రంథ పఠనం చేశాను. అవి ఎంత గానో నన్ను ఉత్తేజ పరచాయి. ఎందరో మహాత్ముల జీవితాలు, బోధలు నన్ను ప్రభావితం చేశాయి. తనదైన శైలిలో సమాజం కూడా తన వంతు పాత్రను తాను నిర్వహించింది. విశేషగ్రంథ పరిచయం, అశేష జన సంసర్గం కలవాణ్ణి. పేరు పేరున ఎందరికి కృతజ్ఞతలు చెప్పేది? ఎన్ని గ్రంథాలను ఉటంకించేది? ఎలాగూ ఉండనే ఉంది మూలమంత్రం, 'అందరికీ వందనాలు'. దాని తోనే ప్రస్తుతానికి సరిపెట్టు కుంటున్నా. చివరగా మీ అందరికీ నా మనసైన మాట. ఇలాంటి గ్రంథాలు అరుదుగా ఉంటాయి. దొరికి నపుడే దోచుకోవాలి. హృదయంలో దాచుకోవాలి. జీవించి నంత కాలం తోడుగా ఉండ వలసిన గ్రంథము. పుస్తకాన్ని పుస్తకంగా ఉంచకుండా, శ్రమించి మస్తకానికి పట్టించండి. మన వద్ద ఉన్నది మనది కాదు మన మనస్సు కెక్కిందే మనది. సద్భావన సత్కార్యాన్ని రూపొందిస్తుంది సత్కార్యం సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్య ఫల విశేషంగా తీర్థపు గిన్నె పూజారి చేతికి వచ్చినట్లు, చైతన్య భగవద్గీత గ్రంథాన్ని అందించే అదృష్టం మమ్మల్ని వరించింది. ఈ గ్రంథం మీది. మీతో ఉండ వలసింది మీరు కొనండి. మరి కొందరి చేత కొనిపించండి. మీరు శ్రద్ధతో చదవండి. ఇతరుల చేత చదివించండి కానుకగా ఎవరి కైనా సమర్పిస్తారా? ఇంతకు మించిన అమూల్యమైన రత్నం ఎక్కడ దొరుకుతుంది? …సర్వేజనాః సుఖినో భవన్తు ..ప్రణవ ప్రేమలతో..గీతామాత సేవలో …స్వామి సుందర చైతన్వానంద
- చైతన్య భగవద్గీత PDF Book Link: https://archive.org/details/@sudarshan_reddy330/lists/7/chaitanya-bhagavadgita
- చైతన్య భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము తెలుగు lyrical ఆడియో వీడియో link : https://archive.org/details/@sudarshan_reddy330/lists/95/%23chaitanya-bhagavad-gita-%23-12thchap_videos
చైతన్య పాంచజన్యం
[మార్చు]
మనసైన మాట
[మార్చు]ఎంత మందితో నాకు పరిచయాలు ఉన్నాయి; ఎవరెవరు నాకు తెలుసు అనే ఆలోచనల కన్నా, నాతో నాకు ఎంత వరకు పరిచయం? అనే ప్రశ్న వేసుకోగలిగితే, ఆ క్షణమే జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుంది. సదవగాహనకు మనస్సు సిద్ధ పడుతుంది. ఆ నిముషం నుండి బ్రతుకు సరళంగా, సజావుగా సాగుతుంది. నేను ఒక్కట్లే. కాని, నాలో నేను తొంగి చూసినపుడు తెలుస్తుంది నేను ఒక్కడిగా లేనవి. వాలో నేను ఇద్దరుగా ఉన్నానని. రెండుగా ఉన్నానని. (1) నాలో వాంఛలు ఉన్నాయి; వ్యథలు ఉన్నాయి. బాధలు ఉన్నాయి; అపజయాలు ఉన్నాయి. గాయాలు ఉన్నాయి. చెప్పుకోలేని గాథ లున్నాయి. ఇలా నేను ఒకణ్ణి. ఇలా ఉండాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కాని అలా ఉన్నారు. మరోలా ఉండలేకపోతున్నారు అంటే, ఈ విధమైన జీవనము వెనుక బలమైన కారణా లున్నాయి. ధర్మాలున్నాయి. నియతి ఉంది. నేను ఇలా ఉండటానికి ఏది కారణమో, నా జీవితం ఇలా ఉండటానికి ఏ నియతి కారణమో, అదే నా పరిసరాల్లో ఉంది. ప్రపంచంలో ఉంది. వ్యక్తులలో ఉంది. వారి ప్రవర్తనల లోనూ ఉంది. ఆ సమయంలో అలా ప్రవర్తించకుండా ఉంటే బావుండేది. అక్కడ అలా చేసి ఉంటే బావుండేది అనే మాటలు పలికేది మనమే. చేయకూడని దానిని ఎవరు చేయమన్నారు? చేయవలసిన దానిని ఆపమని చెప్పిం దెవరు? మానుకున్నది మనమే. పూనుకున్నదీ మనమే. అంతా తెలిసే చేశాం. అప్పుడు మరోలా చేయటం, మరో విధంగా ఉండటం సాధ్య మయ్యేది కాదు అని ఇప్పుడు కూడా తెలుసుకోలేక పోతున్నాం. చేయవలసింది ఎంతైనా ఉండవచ్చు. చేయగలిగిందే మనం చేయగలం. ఉండవలసినవే మన వద్ద ఉంటాయి. లేనివి రావచ్చు. మన కొరకు లేనివి రమ్మన్నా రావు. పోయేందుకు వచ్చినవి ఉండమన్నా ఉండవు. ఉండటానికి వచ్చినవి పొమ్మన్నా పోవు. మనకు ఇష్టం లేనివి ఎన్నో మనం చేస్తున్నాము. ఇతరులు చేసే వాటిని ప్రశ్నించే హక్కు మనకు ఎక్కడుంది? నా జీవితంలో అయినా, పరుల జీవితంలో అయినా, ప్రపంచంలో అయినా జరుగవలసినవియే జరుగుతున్నాయి. జరుగకూడనివి అయితే ఎందుకు జరుగుతాయి?
గతంలో ఇలాగే జరిగాయి. చైతన్య పాంచజన్యం వర్తమానంలో కూడా ఇచే రాగం. భవిష్యత్తులో కూడా ఇదే పాట. ఇదే బాట, ఇదే జీవితంలో ఘర్షణ. జీవిలో సంఘర్షణ. మనిషిలో అంతా ఇంతేనా? బ్రతుకంతా బాధలేనా? నాలో ఇంకేమైనా ఉందా? ఉంది. అదే ఆ రెండో నేను. (2) నాలో తృప్తి ఉంది. విశ్రాంతి ఉంది. హాయి ఉంది. సాధించినవి ఉన్నాయి. ప్రేమ ఉంది. దయ ఉంది. సానుభూతి ఉంది. ఇలా నేను మరొకణ్ణి. ఏదీ అవసరం లేనివాణ్ణి, ఎవరూ అవసరం లేనివాణ్ణి. దేనినీ కాదనలేని వాణ్ణి; ఎవరినీ కాదనలేని వాణ్ణి. సుఖాన్ని కోరనివాణ్ణి; సుఖమై ఉండేవాణ్ణి. ఉండాలి అమకోని వాణి; ఎప్పుడూ ఉండేవాణ్ణి. అందగాణ్ణి కాదు; అందంగా ఉంటాను. మాటలు లేవు: మాట్లాడుతాము. పాటలు రావు; పాడుతాను. పోవాలి అనుకోను; ఉండాలి అని భావించను. పోయినా ఉండేవాణ్ణి; పోకుండా ఉండేవాణ్ణి. రమ్మని పిలవని వాణ్ణి పొమ్మని చెప్పని వాణ్ణి. అదిగా ఇదిగా ఉండనివాణ్ణి ఏదోగా ఉండని వాణ్ణి వేమగా ఉండేవాణ్ణి. చలికి చెలికాణ్ణి. వానకు వేస్తాన్ని. ఎండకు మిత్రుణ్ణి. కాలంతో కలసి తిరుగుతాము. గాలితో చేతులు కలిపి షికారు కెళ్తాను. వెన్నెలను వాటేసుకొని ఊరేగుతాను. ఇదే జీవితంలో సరళత్వం. జీవికి సమత్వం. మనిషి తనలో తాము ఇలా లేదా? ఈ జీవన కళ తనకు లేదా? తనది కాదా? అవును.. తనదే. నీదే. నాదే. ఇదే ఆ రెండో నేను. నీవు ఒక్కడివే. ఎలా ఉంటావు రెండుగా? - రెండు ఉన్నా, ఉన్న దొక్కటే. నీవుగా ఉన్న దొక్కటే. అదేదో మనం తేల్చుకోవాలి.
నీవు, మొదటి నీవే అయితే, ఇక జీవితంలో కాంతి మిగలదు. నీవు, రెండవ నీవే అయితే, ఇక జీవితంలో అశాంతి నిలవదు. ఇది తేలాలి. అప్పుడే, బ్రతుకు తేలిక పడుతుంది. తేలిపోతుంది. లేదా అమాంతం, ఆసాంతం మునిగిపోతుంది. శనిని వలచి మునిగిపోవడమా? మునిని తలచి తేలిపోవడమా? తరించిపోవడమా? ఇదే నిర్ణయం కావాలి. ఇదే బుద్దిలో స్పష్టత. బ్రతుకులో వరిష్ఠత. అందమైనవి. అమోఘమైనవి. అద్భుతమైనవి - ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. వినీలాకాశము పచ్చని పాలము సాగర జలము - అందంగా ఉంటాయి. వాల్మీకి కవిత్వం నారదుని సంగీతం విశ్వకర్మ నిర్మాణం - అమోఘంగా ఉంటాయి. రవీంద్రుని గేయాలు రవివర్మ చిత్రాలు తిక్కన పద్యాలు - పోతన పలుకులు అద్భుతంగా ఉంటాయి. అన్నీ ఆకర్షణలే. అన్నీ అందాలే. ఆనందాలే. అద్భుతాలే. అన్నిటికన్నా అందమైనది, ఆకర్షణీయమైనది. అద్భుతమైనది ఏదయినా ఒక్కటి చెప్పండి అవి మీరెవరన్నా నన్ను అడిగితే, "స్పష్టత" అని సమాధానం చెబుతాను. స్పష్టత అంటే ఏ సంశయం లేకుండా ఉన్నది ఉన్నట్లు స్వచ్చంగా తెలియటం. అందుకే నేమో, "జ్ఞానానికి సమమైన పవిత్ర వస్తువు లేదు" అన్నది భగవద్గీత. ఈ విషయంలో మన శాస్త్రాలు విలక్షణంగా శోధిస్తాయి. మన మహర్షులు వైభవంతో ప్రకాశిస్తారు.
జ్ఞానము హృదయంలో వెన్నెలను కాయిస్తుంది. బుద్ధిలో స్పష్టంగా మనస్సులో మల్లెలను పూయిస్తుంది. మనం ఏదో చేయాలని ప్రపంచానికి రాలేదు. ఏదో కావాలని ప్రారబ్ధంతో కలసి వచ్చాము. మనం ఏమి కాలేకపోయామని, ఏదీ చేయలేకపోయా మని కాలం చూస్తూ కూర్చోదు. పరుగు లెత్తే కాలాన్ని మనం కూర్చోబెట్టలేము. మనం శాంతిలో పవ్వళించే దెలాగో అర్థం చేసుకోవాలి. పరమార్థాన్ని పొంది తరించాలి. అందుకే పుస్తకాలకు గుడి కట్టిన సుందర చైతన్యాశ్రమం మరీ మడి కట్టుకొని ఈ పుస్తకాన్ని ప్రపంచానికి సమర్పిస్తోంది. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు" అన్నట్లు, ఈ ఒక్క పుస్తకం మస్తకంలో స్పష్టతను కలిగించి, నిష్టను పెంచుతుందని, బ్రహ్మనిష్ఠ వైపు మనిషిని త్రిప్పుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సంతోషంతో మీ చేతుల్లో పెడుతున్నాను. నేను శ్రమించినా, మీరు ఈ గ్రంధము తాంతాన్ని, విశ్రాంతాన్ని, ప్రశాంతాన్ని ప్రసాదిస్తుంది అనే భావన రాగానే శ్రమ కూడా ఆశ్రమ జీవనమంత హాయిగా ఉంది. నిజం చెప్పాలంటే, రచనలో నాకు ఏవేవో తెలిసి ఉండవచ్చు. కాని, శ్రమ మాత్రం ఎప్పుడూ తెలిసి రాలేదు. నేను శ్రమించి ఉండొచ్చు. శ్రమ పడలేదు. వాది రచన కాదు. నేను రచించలేదు. నాది అర్చన. రచన నాకు అర్చన. అర్చనలో 'నేను' ఎలా ఉంటాను? నేనే లేను. ఇక శ్రమ ఎవరికి? అర్చించటం అదృష్టం. అదృష్టఫలం. పూజారి నేనే అయినా, ఆలయాన్ని కొందరు చిమ్ముతారు. కొందరు పూలు కోసి పెడతారు. కొందరు దీపారాధన చేస్తారు. కొందరు పూజలో ప్రత్యక్షంగా పాల్గొని తృప్తి చెందుతారు. పూజా ఫలము నీకే ఉండనీ పూజే ఫలముగ మాకు మిగలనీ సలిలము నిండిన మా నయనాలలో కదలక నీ రూపు మిగిలిపోన అని, చైతన్య గానాన్ని పాడుకొంటూ తన్మయత్వం చెందుతారు. ఇది చైతన్య పాంచజన్యం 'హరహర మహాదేవ' - అంటూ' భంభం అని మ్రోగిన శంఖారావం. ఆశ్రమం ప్రచురించిన ఎన్నో గ్రంధాలు రికార్డు స్థాయిలో పాఠకుల చేతుల్లోకి వెళ్ళాయి. ఎందరికో, ఎంతగానో స్ఫూర్తి నిచ్చాయి. తృప్తి నిచ్చాయి. కాని, "చైతన్య పాంచజన్యం" గ్రంథం వేరు. ఈ గ్రంథం నాకే ఎనలేని తృప్తి నిచ్చింది. దీపాన్ని దర్శించినంతగా తృప్తిపడ్డాను. ఎన్నో గ్రంథాలకు తల్లివైన నాకు ఈ గ్రంథం ముద్దుబిడ్డ అయింది. ఈ గ్రంధం పాఠకులకు ఎనలేని స్ఫూర్తిని ఇస్తుందని భావిస్తున్నాను. ముముక్షువులకు అమృతపానం లాంటిదని నా అభిప్రాయం. ఎక్కువ పుటలున్న ఈ గ్రంథం తక్కువ కాలంలో వెలువడింది. సమయం అబ్బే లేదు. అయినా సుందరంగా తయారైంది. శారదా మందిరంగా కళకళలాడింది. ఈ పవిత్ర కార్యంలో ఎందరో తమ వంతు సేవలను అందించి పుణ్యాన్ని చేరుకున్నారు. ఆశ్రమవాసులు, సత్సంగ్ సభ్యులు కంప్యూటర్ టైప్ సెట్టింగ్లోను, ఫోటో డిజైనింగ్, ప్రూఫ్ రీడింగ్ తదితర సేవలలో తృప్తి చెందారు. ఇక చివరగా, స్పష్టతకు ప్రతిరూపంగా శోభిస్తూ, పరమాత్మ ప్రసాదంగా అందిన ఈ గ్రంథము ముముక్షువులకు సుస్పష్టంగా అర్థమయ్యేలా ఆశీర్వదించమని మురళీకృష్ణ స్వామిని వేడుకొంటున్నాను… మీ … స్వామి సుందర చైతన్యానంద
- చైతన్య పాంచజన్యం PDF BOOK LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/61/chaitanya-panchajanyam-
ఆశ్రమములు
[మార్చు]- సుందర చైతన్యాశ్రమం దవలైశ్వరం, రాజమహేంద్రవరం.
- సుందర చైతన్యాశ్రమం దు౦డిగల్, హైదరాబాద్.
- సుందర చైతన్యాశ్రమం విశాఖపట్నం.
మూలాలు
[మార్చు]- ↑ Sagi Srinivas Raju. "Special Cover on 50 years of Spiritual Journey of H. H. Swami Sundara Chaitanyanandaji Maharaj – 19th March 2016". Retrieved 2016-10-13.
- ↑ Raghuveer Onbv. "Sadhguru Swami Sundara Chaitanyananda". Archived from the original on 2016-06-11. Retrieved 2016-10-13.
- ↑ Official website. "About Sadguru Swami Sundara Chaitanyanandaji". Retrieved 2016-10-13.
SWARNOTSAVA CHANDRIKA_A&B స్వామి సుందర చైతన్యానందుల 50 వ జన్మదినోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక
https://archive.org/details/swarnotsava-chandrika-a
https://archive.org/details/swarnotsava-chandrika-b
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల50 వ జన్మదినోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక - ఇది కృష్ణ కథ
https://archive.org/details/sundara-chaitanyananda-swamy-swarnotsava-chandrika-idi-krishna-katha
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల50 వ జన్మదినోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక - వెచ్చని వెన్నెల
https://archive.org/details/swarnotsava-chandrika-vechani-vennela
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల50 వ జన్మదినోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక - సంత్ జ్ఞానదేవ్ - Lyrical_audio_Video
https://archive.org/details/sant-dnyaneshwarswami-sundara-chaitanyananda
#Yuva_Chaitanyam#Sundara_Chaitanya_Asramam#Photo_Slide_Show video:
https://archive.org/details/yuva-chaitanyam-sundara-chaitanya-asramam-photo-slide-show
INTINTA CHAITANYA BHAGAVADGITA SWAMI SUNDARA CHAITANYA video:
https://archive.org/details/intinta-chaitanya-bhagavadgita-swami-sundara-chaitanya/mode/2up
Swami_Sundara_Chaitanyananda_Pravachanam_videos
- రామజోగి చిట్కాలు#lyricalvideos#4parts#swamiSundara Chaitanyananda:https://archive.org/details/@sudarshan_reddy330/lists/24/ramajogi-chitkalu
- జీవన జ్యోతి వీడియోస్ : https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/3/jeevana-jyothi-