గీతా జయంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.[1] భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహన ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది.[2]

ఈ రోజు కౌరవ రాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

మూలాలు[మార్చు]

  1. "మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా ... జయంతి". TeluguOne Devotional (in english). 2020-05-10. Retrieved 2020-05-10.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "గీతా జయంతి - జై శ్రీమన్నారాయణ www.jaisrimannarayana.in". www.pravachana4u.info. Retrieved 2020-05-10.[permanent dead link]