మాస శివరాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివుడు

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.

ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.[1]

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు.

మూలాలు

[మార్చు]
  1. "ధర్మస్థలమ్: మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ". web.archive.org. 2016-03-07. Retrieved 2024-10-03.

ఇవి కూడా చూడండి

[మార్చు]

శుక్ల పక్ష శివరాత్రి

మహా శివరాత్రి


బయటి లింకులు

[మార్చు]