సత్యనారాయణ వ్రతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీసత్యనారాయణస్వామి పూజ

సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం.

వ్రత ప్రాశస్త్యం[మార్చు]

కలియుగంన లోక సంచారం చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇటుల తెలిపాడు.

కలియుగంన నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరును.

అంతట వ్రత విధానంను తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపాడు

వ్రత సామాగ్రి[మార్చు]

వ్రత విధానం[మార్చు]

" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా

యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "

  • దేవాలాయానన, నదీతీరాన, గోశాలలో, తులసీవనంలో చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది.
  • కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు,కొబ్బరితో కూడిన కలశంనుకు రవికెల గుడ్డను చుట్టి మద్యమున ఉంచవలెను.
  • పసుపుతో వినాయకుని సిద్దం చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యంనందు తూర్పుదిక్కుగా ఉంచవలెను.
  • వినాయకపూజ నంతరం తమలపాకుపై బియ్యం పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారాయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
  • పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపం చెయ్యవలెను.
శ్రీసత్యనారాయణస్వామి పూజ

వ్రత కథలు[మార్చు]

వ్రత కథ మొత్తం ఐదుభాగాలుగా ఉంటాయి. ప్రతీ కథానంతరం నారికేళసమర్పణ ఆచారం.

మొదటి వ్రత కథ[మార్చు]

ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు "మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, మోక్షమును పొందగలరు?"అందులకు సూత మహర్షి

శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ వ్రతంను ఏ రోజునైనను చేసి, వ్రతానంతరం తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను.ఈ వ్రతము చేసిన వారు మోక్షంను పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

కనుక జనులారా, సత్యనారాయణ వ్రతం చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను. ఇది మొదటి వ్రత కథ.

రెండవ వ్రత కథ[మార్చు]

కాశీ పట్టణమందు ఒక బీద బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభించక విచారంగా నుండును,శ్రీ సత్యనారాయణ స్వామి వారు అతనిని చూచి జాలిపడి ఒక ముసలి బ్రాహ్మణవేషంలో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు.అంతట ఆ ముసలి బ్రాహ్మణుడు, సత్యనారాయణవ్రత విశేషం తెలిపి అదృశ్యుడాయెను. అంతట బీద బ్రాహ్మణుడు రేపే ఈ వ్రతం చేసెదనని నిశ్చయించుకున్నవాడై మరుసటి దినంన నిత్యకాలకృత్యాలు నెరవేర్చుకుని "స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతం చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయంన అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతం చేసెను.వ్రతమహిమ వలన అతనికి సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసం సత్యనారాయణ స్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక ఏకాదశినాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువాతి దినంనాడు వ్రతం చేసెదనని పలికెను.తరువాతిదినంన, కట్టెలమ్మగా మిక్కిలి విశేషంగా ధనం లభించింది.ఆ ధనంతో ఆ నాడు వ్రతం చేసినవాడై అనతికాలంనందు ధనవంతుడయ్యెను.సత్యనారాయాణ వ్రత విశేషం వల్ల బ్రాహ్మణుడు, కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ........

నాల్గవ వ్రతకథ[మార్చు]

ఐదవ వ్రతకథ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]