పున్నమి చవితి

'పున్నం' అంటే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నం, చవితి అంటే కార్తీక పున్నం వెళ్లిన 5వ రోజు వచ్చేది చవితి,ఇలా కార్తీక పున్నం వెళ్లిన 5వ రోజు వచ్చే చవితిని పున్నం చవితి గా జరుపుకుంటారు .దీనినే రెండోవా నాగుల చవితి అని కుడా అంటారు. దీనిని కార్తీక బహుళ చవితి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చాలా మంది నాగుల చవితి రోజున చేసినట్టే చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం కార్తీక పున్నమి (పౌర్ణమి) రోజు నాటికి ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళకు వారి పొలాలను చూపించటానికి వారిని పొలాలకు తీసుకువెళ్ళడం.[1]
హిందూ మత విశ్వాసాల ప్రకారం నాగుల చవితి రోజున పుట్టలో పాములకు పాలను పోయడంతో పాటు నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చవితి తిథి రోజున నాగ పంచమి, నాగుల చవితి వేడుకలు జరుపుకుంటారు. అదే విధంగా కార్తీక పున్నమి తర్వాత వచ్చే చవితినాడు పున్నమి చవితి కూడా అదే విధంగా జరుపుకొంటారు.
నిండు పున్నమి వచ్చేముందు ముందు రాత్రి నుండి చంద్రుడు ఎక్కువ కాంతితో విజృంభిస్తాడు దానినే కార్తీక పౌర్ణమి అని కూడా అంటారు[2]
మూలాలు
[మార్చు]- ↑ link, Get; Facebook; X; Pinterest; Apps, Other (2023-11-29). "పున్నమి చవితి | Punnami Chavithi in Telugu | Punnami Chavithi 2023 | Bhakthi Margam | భక్తి మార్గం" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2025-11-17.
{{cite web}}:|last2=has generic name (help) - ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.