క్రోధి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
క్రోధి తెలుగు సంవత్సరాలలో 38వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం శోభకృతు, తర్వాత సంవత్సరం విశ్వావసు. దీని అర్థం క్రోధాన్ని కలిగినది. కోపస్వభావం పెరుగుతుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1904-1905, 1964-1965, 2024-25లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు.
2024 : క్రోధి నామ సంవత్సరం 9 ఏప్రిల్ 2024 మంగళవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 30 మార్చి 2025 ఆదివారం విశ్వావసు నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "క్రోధి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 38 | క్రోధి | 44-45 | 104-105 | 164-165 | 224-225 | 284-285 | 344-345 | 404-405 | 464-465 | 524-525 | 584-585 | 644-645 | 704-705 | 764-765 | 824-825 | 884-885 | 944-945 | 1004-1005 | 1064-1065 | 1124-1125 | 1184-1185 | 1244-1245 | 1304-1305 | 1364-1365 | 1424-1425 | 1484-1485 | 1544-1545 | 1604-1605 | 1664-1665 | 1724-1725 | 1784-1785 | 1844-1845 | 1904-1905 | 1964-1965 | 2024-2025 | 2084-2085 | 2144-2145 | 2204-2205 | 2264-2265 | 2324-2325 | 2384-2385 | 2444-2445 | 2504-2505 | 2564-2565 | 2624-2625 | 2684-2685 | 2744-2745 | 2804-2805 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1426 వైశాఖ శుద్ధ పౌర్ణమి: పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు.
- 1905 శ్రావణ శుద్ధ విదియ: శిరశినగల్ కృష్ణమాచార్యులు - శతావధాని, సంస్కృతాంధ్ర కవి. (మ.1992) [3]
మరణాలు
[మార్చు]- 1904 : కార్తీక బహుళ సప్తమి : తూము రామదాసు ప్రముఖ తెలుగు కవి.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో ఉన్న గూడెం సత్యనారాయణస్వామి దేవాలయంలో మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ట చేసారు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 241.
- ↑ "Mancherial: Gudem temple earns Rs 29.21 lakh through offerings". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-20. Archived from the original on 2021-11-20. Retrieved 2021-11-22.
- ↑ "Telangana Temple: తెలంగాణ అన్నవరానికి కార్తీకశోభ.. కిక్కిరిసిన ఆలయం.. ఎక్కడంటే." News18 Telugu. 2021-11-19. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.