తూము రామదాసు
తూము రామదాసు | |
---|---|
జననం | ఆగష్టు 18, 1856 |
మరణం | నవంబరు 29, 1904 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత, కవి |
తల్లిదండ్రులు | తూము సర్వేశం |
బంధువులు | వరదరాజులు (కుమారుడు) |
తూము రామదాసు (ఆగష్టు 18, 1856 - నవంబరు 29, 1904) తెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత.[1] 1897లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.[2][3]
జననం
[మార్చు]రామదాసు 1856, ఆగష్టు 18 న (నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం) తూము సర్వేశం దంపతులకు వరంగల్ లోని బాలనగరంలో జన్మించాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.
రచనలు
[మార్చు]- రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
- గోపికావిలాసము (ప్రబంధము)
- మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
- కాళిదాసు (నాటకం): సురభి నాటక సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు బృందం 1897లో వరంగల్ లో నాటకాలు ప్రదర్శిస్తున్న క్రమంలో తూము రామదాసు వారికి ఈ నాటకాన్ని రాసిచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వంలో సురభి సంస్థ ప్రదర్శించింది. 1899లో తూము రామదాసు మద్రాసు కు వెళ్ళి ఈ నాటకాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ నాటక ప్రతి అలభ్యం.
- ఆంధ్రపదనిధానము: 1901లో ‘ఆంధ్ర పదనిదానము’ నిఘంటువు రచించాడు. ఈ గ్రంథాన్ని 1930లో రామదాసు కుమారుడు వరదరాజులు ప్రచురించాడు.[4]
మరణం
[మార్చు]నిజాం ప్రభుత్వం లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు 1904, నవంబరు 29 (క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి) న మరణించాడు.[5] రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం". Retrieved 18 August 2017.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి. "తొలి నాటక కర్త తూము రామదాసు". Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 18 August 2017.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385
- ↑ International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17
- ↑ [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166
- ↑ PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146