శివ పురాణం

వికీపీడియా నుండి
(శివ పురాణము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.

జగత్తు, భూతముల సృష్టి - 1828 కాలానికి చెందిన శివపురాణం ముద్రణలోని చిత్రం

విభాగాలు[మార్చు]

శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్క) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.

  1. విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
  2. రుద్ర సంహిత లో
  1. సృష్టి ఖండము (20 అధ్యాయాలు)
  2. సతీ ఖండము (43అధ్యాయాలు)
  3. పార్వతీ ఖండము (55 అధ్యాయాలు)
  4. కుమార ఖండము (20 అధ్యాయాలు)
  5. యుద్ధ ఖండము (59 అధ్యాయాలు)
  1. శతరుద్ర సంహిత (42 అధ్యాయాలు)
  2. కోటి రుద్ర సంహిత (43 అధ్యాయాలు)
  3. ఉమా సంహిత (51 అధ్యాయాలు)
  4. కైలాస సంహిత (23 అధ్యాయాలు)
  5. వాయివీత సంహిత - ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు

ప్రతి అధ్యాయములోను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను (మత్స్య పురాణములో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.

కొన్ని ముఖ్యాంశాలు[మార్చు]

శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు

  • సృష్టి ప్రశంస అజిత
  • తరణోపాయము
  • శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము
  • శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
  • శివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
  • అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
  • నంది, భృంగుల జన్మ వృత్తాంతము
  • పరశురామోపాఖ్యానము - కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము
  • పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
  • పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
  • ముక్తి సాధనములు
  • పిండోత్పత్తి విధానము
  • బృహస్పత్యోపాఖ్యానము

ఇవి కూడా చూడండి[మార్చు]

  • బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్పిన శివ మహా పురాణ వివరణ శివపురాణం..

మూలాలు, వనరులు[మార్చు]

  • అష్టాదశ పురాణాలు - (18 పురాణముల సారాంశం) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)

బయటి లింకులు[మార్చు]