Jump to content

రేభుడు

వికీపీడియా నుండి

రైభ్య మహర్షి వరాహ పురాణమున రైభ్యమహర్షి బ్రహ్మ కుమారుడని వ్రాయబడి ఉంది. రైభ్యుడు ఒక గురువు వద్ద విద్యాధ్యయనం చేయసాగాడు. గురువే పరమేశ్వరుడని భావించి సేవచేయుచూ విషయాలు గ్రహిస్తున్నాడు. గురువు హృదయము చూరగొన్నాడు రైభ్యుని గురుభక్తికి దేవతలే మెచ్చుకున్నారు. పుష్పవర్షం కురిపించారు. రైభ్యుడు సర్వవిద్యలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అనంతరం బృహస్పతి వద్దకు వెళ్ళి అతని కటాక్షమర్ధించాడు. బృహస్పతి రైభ్యునకు అనేక రహస్యాలు తెలియజేశాడు. రైభ్యునకు ఒక సందేహము కలిగినది. మోక్షము కర్మమున లేక జ్ఞానము వలన దేని వలన సులభముగా లభించునని ఆ విషయము బృహస్పతిని అడిగాడు. బృహస్పతి చక్కని కథ చెప్పి సంశయ నివృత్తి చేశాడు. అనంతరం రైభ్యుడు ఒక ఉత్తమ కన్యను వివాహమాడి గృహస్ధు అయ్యాడు. ఆమె యిరువురు పుత్రులను కన్నది. వారిలో పెద్దవానికి అర్యావసువు అని రెండవ వానికి పరావసువు అని పేర్లు పెట్టాడు. కొడుకులిద్దరికి తానే గురువుగా ఉండి వారిని వేదాధ్యయన సంపన్నులను చేశాడు. కుమారుల అభివృద్ధి గాంచి రైభ్యుడు ఉప్పొంగిపోయాడు. రైభ్యుని స్నేహితుడు భరద్వాజుడు. భరద్వాజుని కుమారుడు యవక్రీతుడు. రైభ్యుని కుమారులు మహాజ్ఞానులైయారని యవక్రీతుడు అసూయపడి తానూ విద్వాంసుడను కావాలని ప్రయత్నించి సాధించాడు. ఏది ఎమైనా రైభ్యుడు కూడా ప్రాచీన మహర్షులలో ఒకడు.

"https://te.wikipedia.org/w/index.php?title=రేభుడు&oldid=3596663" నుండి వెలికితీశారు